Featured Posts
పాప్ కార్న్
వివిధ రకాల పాప్ కార్న్ చేద్దామా.
బట్టర్ పాప్ కార్న్:
పాప్ కార్న్ గింజలకు ఉప్పు వెన్న పట్టించండి. వీటిని గిన్నెలో వేసి మూత
పెట్టి పొయ్యి మీద ఉంచండి. ఇంక నుంచి పాప్ కార్న్ తయారీ పద్ధతి లోనే
చేయండి. దించాక కస్త మిరియాల పొడి జల్లి కలియబెట్టండి వెన్న
సువాసనలతో వేడి వేడి పాప్ కార్న్ రెడీ.
ఖట్టామీటా పాప్ కార్న్:
కస్త సిట్రిక్ ఆసిడ్,పంచదార నల్ల ఉప్పు, మిరియాల పొడి కలిపి మెత్తటి
మిశ్రమంగా చేయండి. ఈ పొడిని వేడిగా తయారైన పాప్ కార్న్ కు
పట్టించండి.రుచికరమైన ఖట్టామీటా పాప్ కార్న్ రెడీ.
మసాలా పాప్ కార్న్: ముందుగా గింజలకు కొద్దిగా నూనె పట్టించండి.
ఇందులో కారం,పసుపు,ఉప్పు,మిరియాల పొడి పట్టించండి. వీటిని
గిన్నెలో వేసి మూత పెట్టి వేయించండి. ఈ రకం పాప్ కార్న్ నే బజార్లో
ఎక్కువగా అమ్ముతుంటారు.
స్వీట్ పాప్ కార్న్ : ముందుగా పంచదార ముదురు పాకం పట్టి
చల్లర్చండి. ఇప్పుడు ఎలాంటి మసాలా చేర్చకుండా పాప్ కార్న్
గింజల్ని వేయించండి. వీటిని పంచదార పాకంలో ముంచి తీసి
ఆరబెట్టండి.అంతే స్వీట్ కోటెడ్ పాప్ కార్న్ రెడీ. కావాలంటె
పాకంలో ఫుడ్ కలర్స్ చేర్చి రంగు రంగుల పాప్ కార్న్ ను చేసుకోవచ్చు.
మరమరాలతో చేసుకునే ఉండల మాదిరిగానే పాప్ కార్న్ తో కూడా
బెల్లం పాకంతో ఉండలు చేసుకోవచ్చు.
పప్పు చారు
చింతపండు 50 gm
ఉల్లిపాయ 1
టొమాటో 2
పచ్చిమిర్చి 3
కరివేపాకు 1 రెబ్బ
కొతిమిర 1 కట్ట
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/4 tsp
ఎండుమిర్చి 4
పసుపు 1/2 tsp
కారం పొడి 1 tsp
ఉప్పు తగినంత
నూనె 2 tbsp
ముందుగా కందిపప్పును కొద్దిగా పసుపు,నూనె వేసి కుక్కర్లో మెత్తగా
ఉడికించుకోవాలి. చింతపండు నీళ్ళలోనానబెట్టాలి . ఉల్లిపాయ,పచ్చిమిర్చి,
టొమాటోలు తరిగి పెట్టుకోవాలి. పప్పును గరిటతో మెదిపి చింతపండు
పులుసు తీసి అందులో కలపాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి నూనె వేడి చేసి
ఎండుమిర్చి,ఆవాలు,జీలకర్ర వేసిఅవి చిటపటలాడాక ఉల్లిపాయలు,పచ్చిమిర్చి,
టొమాటో ముక్కలు వేసి కొద్దిగావేపాలి. పసుపు,కారంపొడి,కరివేపాకు వేయాలి.
అవి మెత్తబడ్డాక పప్పు మిశ్రమాన్ని అందులో పోసి తగినంతఉప్పు,కొద్దిగా బెల్లం
కాని చక్కెర కాని వేయాలి. పప్పు చారు ఐదు నిమిషాలు మరిగిన తర్వాత
కొత్తిమిర వేసిదింపేయాలి. కొద్దిగ నెయ్యి వేస్తె సూపర్ గా ఉంటుంది
జంతికలు
బియ్యం పిండి — 2 కప్పులు
సెనగపిండి — 1/2 కప్పు
జీలకర్ర — 1 స్పూను
వాము — 1 స్పూను
వెన్న లేక కాచిన నూనె — 2 స్పూనులు
కారం పొడి — 1/2 స్పూను
ఉప్పు — తగినంత
నూనె — వేయించడానికి
తయారు చేయు విధానం
పైన చెప్పిన పదార్థాలన్ని కలిపి నీళ్ళతో తడిపి జంతికల గొట్టంలో పెట్టి వేడి
నూనెలో వత్తుకుని ఎర్రగా కాల్చి తీసిపెట్టుకోవాలి..బియ్యంపిండితో చేసాం
కాబట్టి నూనె ఎక్కువ పీల్చవు ఎన్ని తిన్నా ఏమి కాదు
చేగోడీలు
మైదా 1 గ్లాసు
నెయ్యి లేదా డాల్డా 50gm
వాము 1/2 tbsp
పసుపు 1/4 tsp
కారం పొడి 1/2 tsp
ఉప్పు తగినంత
నూనె వేయించడానికి
తయారుచేసె పద్దతి; ముందుగా ఒక గిన్నెలో నాలుగు గ్లాసుల నీళ్ళు పోసి
ఎసరు పెట్టండి. దానిలో తగినంత ఉప్పు వేసి నీరు మరిగిన తరవాత దించి
వాము కారంపొడి, పసుపు, నెయ్యి వేసి కలిపి మొత్తం బియ్యంపిండి మైదాలను
వేసి బాగా కలియబెట్టి మూత పెట్టి ఉంచాలి.కొద్దిగా చల్లారిన తర్వాత పిండిని
రెండు అరచేతులతో బాగా మర్దన చెసి సన్నని తాడులా పొడవుగా చేసి
ముక్కలుగా చెసుకొని రింగులలాగ చేసి పెట్టుకోవాలి.వేడి నూనెలో నిదానంగ
కాల్చి తీసి పెట్టుకోవాలి.కరకరలాడే చేగోడీలు తయారు.
పప్పు చెక్కలు
బియ్యపు పిండి 1/2 kg
జీలకర్ర 1/2 స్పూను
కారం పొడి 1/2 స్పూను
ఉప్పు తగినంత
కరివేపాకు 1 రెబ్బ
నానబెట్టిన పెసర పప్పు 100 gm
కరిగించిన నెయ్యి లేదాడాల్డ 50 gm
ముందుగా పిండిలో ఉప్పు,కారం పొడి,సన్నగా తరిగిన కరివేపాకు జీలకర్ర,కరిగించిన
నెయ్యి,నానబెట్టిన పెసరపప్పు వేసి బాగా కలిపి ఒక గ్లాసు మరిగించిన నీరు పోసి
మొత్తం బాగ కలిపి మూత పెట్టి ఉంచాలి. తర్వాత పిందిని బాగ కలిపి చిన్న చిన్న
ఉండలుగా చెసుకుని పాలిథిన్ కవరుపై నూనె రాసి పల్చగా వత్తి వేడి నూనెలో
ఎర్రగా వేయించి పెట్టుకోవాలి.కావలంటె వేయించిన పల్లీలు కూడ వేసుకోవచ్చు
.ఇవి చాల రోజులు నిలవ ఉంటాయి.
క్యారట్ తో
క్యారట్ ను సన్నగా తురిమి పెట్టుకోవాలి. కొద్దిగా సెనగపప్పు లేదా పెసరపప్పు నానబెట్టి
ఉంచాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి నూనె వేసి ఆవాలు,జీలకర్ర కొద్దిగా మినపప్పు వేసి
వేగిన తర్వాత సెనపప్పు రెండు పచ్హిమిర్చి, కరివేపాకు ,పసుపు వేయాలి.ఇప్పుడు
తురిమిన క్యారట్ వేసి తగినంత ఉప్పు,కారం వేసి కలిపి మూత పెట్టాలి.ఒ పది
నిమిషాలు చిన్న మంటపై నిదానంగ ఉడకనివ్వాలి.కొత్తిమిర,కొద్దిగా గరం
మసాలా పొడి వేసి కలిపి దించేయండి.చపాతీలలోకి సూపర్ గా ఉంటుంది..
క్యాబేజీతో
ముందుగా క్యాబేజీని సన్నగ దారాల్లాగ తరిగిపెట్టుకోవాలి.పొయ్యిపై గిన్నె పెట్టి కొద్దిగా
ఎక్కువె నూనె వేసి కాగిన తర్వాత కారానికి కావల్సినంత ఎండు మిర్చి,ఆవాలు,
జీలకర్ర,మినప్పప్పు కొద్దిగ ఎక్కువ సెనగపప్పు వేసి వేగిన తర్వాత కరివేపాకు
పసుపు వేయాలి. ఇప్పుడు క్యాబేజీ వేసి తగినంత ఉప్పు వేసి బాగాకలిపి మూత పెట్టాలి
నిమిషాలు చిన్న మంటపై అదే నూనెలో మగ్గనివ్వండి. పది నిముషాల తర్వాత కొత్తిమిర
చల్లి దించేయండి.ఇది చపాతీలలోకి అన్నంలోకి కూడా బావుంటుంది.
దోశలు
తీపి
మైదా కాని గోధుమ పిండి కాని తీసుకుని అందులో తగినంత చక్కెర,ఏలకుల పొడి
లేదా వెనిల్లా ఎస్సెన్స్ వేసి బాగ కలిపి పెట్టండి..ఓ పది నిమిషాల తర్వాత నాన్ స్టిక్
పెనంపై నెయ్యి లేదా వెన్నతో దోశలేసుకోడమే. అలాగే తినొచ్చు లేదా జాం తో
కారం
సెనగపిండి లో ఉప్పు,కారం,పసుపు,సన్నగ తరిగిన కరివేపాకు,కొత్తిమిర,కొద్దిగా గరం
మసాల పొడి వేసి కలిపి పెట్టాలి. పది నిమిషాల తర్వాత పెనంపై దోశలు వేసుకోడమె.
ఇలాగే తినొచ్చు లేదా ఆవకాయ ఐతె అదురుద్ది.
పప్పు
టొమాటో పప్పు ఎలా చెయాలో తెలిసిందిగా. ఇంకో విధానం ఏంటంటే కుక్కర్ లో అన్ని
కలిపి నీళ్ళు పోసి ఓ ఐదారు విజిల్స్ వచ్చేవరకు ఉంచి దించేయాలి. పోపు పెట్టుకుంటె సరి..
కూరగాయలతో పప్పు ఎలా చేయాలో చూద్దామా
కుక్కర్లో కందిపప్పు,పసుపు నూనె వేసి ఒక విజిల్ రాగానె దించేయాలి. ఇప్పుడు తరిగిన
ఉల్లిపాయ, పచ్చిమిర్చి,కరివేపాకు,కొత్తిమిర మనం కావల్సిన ఎదైనా కూరగాయ-
పాలకూర, చుక్కకూర, తోటకూర, బచ్చలికూర, దోసకాయ,చామదుంప,బీరకాయ,
ఇలా ఏదైన ఓ కూరగాయ, ఉప్పు, కారం పొడి,అల్లం వెల్లుల్లి ముద్ద కొంచం
(లేకున్నా ఎంకాదు) వేసి కలిపి మళ్ళి ఓ మూడు విజిల్స్ వచ్చేవరకు ఉంచి
దించేయాలి..చల్లారిన తర్వాత పోపు పెట్టేయడమె.
టొమాటో పప్పు
ముందుగా కంధిపప్పును పసుపు అరస్పూను నూనె వేసి కుక్కర్లో ఒక విజిల్
వచ్చేవరకు ఉంచండి.చిన్న ఉల్లిపాయ నాలుగు టొమాటోలు తరిగి పెట్టుకొండి.
ఇప్పుడు పప్పు లొ ఉల్లిపాయలు,టొమాటోలు,రెండు పచ్చిమిర్చి,కొత్తిమిర,
కరివేపాకు,ఉప్పు, కారంపొడి, అల్లం వెల్లులి ముద్ద ఓ స్పూను,చింతపండు
చిన్న ముక్కలు చేసి అన్ని కలిపి మళ్ళీ కుక్కర్ మూత పెట్టేయాలి. రెండు
విజిల్స్ రాగానె దించి చల్లారాక నూనె కొద్దిగా నెయ్యి వేసి వెడి అయ్యాక ఆవాలు
,జీలకర్ర,కరివేపాకు,నాలుగు వెల్లుల్లి వేసి పోపు పెట్టండి.
ఆంధ్రులు పోపు పెడితే పొలిమేర దాకా అదిరిపోవాలంట మరి.
ఏ కూరైనా చాలా సులువుగా చేసుకోవచ్చు
ముందుగా ఉల్లిపాయ సన్నగా తరిగిపెట్టుకోవాలి.మనకు కావల్సిన లేక మన దగ్గర
ఉన్న కూరగాయలు తరిగి పెట్టుకోవాలి.పొయ్యి మీద గిన్నె పెట్టి నూనె వేసి కాగిన
తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి అవి చిటపటలాడాక ఉల్లిపాయలు
వేయాలి.మంట మాత్రం తక్కువగా ఉండాలి.నిదానంగా చిన్న మంటపై తక్కువ
నీటితో చెస్తే కూర ఏదైన చాలా రుచిగా ఉంటుంది. ఉల్లిపాయలు వేగిన తర్వాత పసుపు
,అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కాస్త వేపాలి. ఇపుడు మన దగ్గరున్న కూరగాయ
ముక్కలను వేసి కారం పొడి,తగినంత ఉప్పు వేసి మూత పెట్టేయాలి.అది ఆ
నూనె లోనే మగ్గిపోతుంది.అవసరమనుకుంటే కొద్దిగా నీళ్ళు పోయాలి.
కూర మొత్తం ఉడికి నూనె తేలాక కొత్తిమిర, కొద్దిగా గరం మసాల పొడి వేసి
దించేయడమే.
ఇంట్లో ఏ కూరగాయలు లేకుంటే
ఓ కప్పుడు సెనగపప్పు అరగంట నానపెట్టండి. ఉల్లిపాయలు తరిగి పెట్టుకోండి.పొయ్యి
మీద గిన్నె పెట్టి కాస్త ఎక్కువ నూనె వేసి(పప్పు కాబట్టి) కాగిన తర్వాత ఉల్లిపాయలు
వేసి గొధుమవర్ణం వచ్చేవరకు వేయించి పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం పొడి,
కరివేపాకు వేసి కొద్దిగా వేపి నానపెట్టిన సెనగపప్పును నీళ్ళు తీసేసి వేయాలి.తగినంత
ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టాఅలి.తడి ఆరిపోయాక కొద్దిగా నీళ్ళు పోసి మూత
పెట్టెయండి..ఓ పదినిమిషాల తరవాత కూర ఉడికిపోతుంది.కుక్కర్లో ఐతె 5 నిమిషాలు
చాలు.కొత్తిమిర, గరం మసాల పొడి వేసి దించేయండి.ఈ కూర పొడిపొడిగానే ఉండాలి.
ముద్దలా కాకుండా కస్త జాగ్రత్త పడితే చాలు.
దీనికి బెస్ట్ కాంబినేషన్ పచ్చిపులుసు
కొద్దిగా చింతపండు నానపెట్టండి.తెల్లది ఐతె బావుంటుండి.ఓ చిన్న ఉల్లిపాయను చాలా
చిన్న ముక్కలుగ తరిగి పెట్టుకోవాలి.ఒకటి లేదా రెండు పచ్చిమిర్చి ని గ్యాస్ మంటపై
కాల్చి చిన్న ముక్కలుగ తరిగి పెట్టుకోవాలి.ఇప్పుదు ఉల్లిపాయ,పచ్చిమిర్చి,కరివేపాకు
,కొత్తిమిర,తగినంత ఉప్పు,పావు స్పూను చక్కెర కలిపి పెట్టి ఇందులొ చింతపండు
నీళ్ళు కలపాలి.పుల్లగా కావాలనుకుంటె చిక్కగా పులుసు తీసుకోవాలి.లేదంటె
పలుచగా తీసుకోవాలి.ఇప్పుడు బాణలిలో నూనె పోసి కాగిన తర్వాత ఆవాలు,జీలకర్ర,
కొద్దిగా పోపుగింజలు( ఎండుమిర్చి విత్తనాలు) వేసి అన్ని కలిపి పెట్టుకున్న పులుసులో
కలపి వెంటనే మూత పెట్టాలి.
గుత్తొంకాయ కూర
లేత వంకాయలు 250 gm
ఉల్లిపాయలు 150 gm
పల్లీలు 50 gm
నువ్వులు 50gm
జీలకర్ర 1 tbsp
మెంతులు 1/2 tsp
కొబ్బరిపొడి 100 gm
చింతపండు పులుసు 1/4 cup
నూనె 50 gm
ఉప్పు తగినంత
కారం పొడి 1 tbsp
పసుపు 1 tsp
అల్లం వెల్లుల్లి ముద్ద 1 tbsp
బెల్లం కొంచం
ముందుగా ఖాళీ బాణలిలో జీలకర్ర,మెంతులు,పల్లీలు,నువ్వులు విడివిడిగా వేయించాలి.
అవి పక్కన పెట్టి అందులోనే సగం నూనె పోసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి
గోధుమ వర్ణం వచ్చేవరకు వేయించి తీసి పెట్టుకోవాలి. ఇవి అన్ని కొబ్బరిపొడితో కలిపి
రుబ్బి పెట్టుకోవాలి. ఈ ముద్దలో ఉప్పు,కారం పొడి,పసుపు,అల్లం వెల్లుల్లి ముద్ద,
చింతపండు పులుసు,బెల్లం వెసి బాగ కలిపి పెట్టుకోవాలి..వంకాయలను నాలుగు
పక్షాలుగా కోసి ఉప్పు వేసిన నీల్లల్లో వెసి పెట్టాలి. ఈ రుబ్బిన ముద్ద వంకాయ
మధ్యలొ బాగా కూరి పక్కన పెట్టుకోవాలి.తర్వాత బాణలిలో మిగిలిన నూనె వేసి
కాగిన తర్వాత ఈ మసాల కూరిన వంకాయలను వేసి మూత పెట్టలి.ఈ కూరను
నిదానంగ చిన్న మంటపై చేయాలి.అన్ని వంకాయలు మగ్గి మెతబడిన తర్వత
మిగిలిన ముద్దలో కొద్దిగా నీరు కలిపి అందులో పోసి మెల్లిగ కలిపి మూత పెట్టాలి..
కూర ఉడికిన తర్వాత నూనె తేలుతుంది.కొతిమిర చల్లి దించేయడమే..
ఇక గుత్తొంకాయ కూర రేడి.
సేమ్యా పుడ్డింగ్
సేమ్యా 200 gm
బ్రెడ్ 1
గ్రుడ్లు 2
పంచదార 150 gm
యాలకులు 4
పాలు 500 gm
గ్రుడ్లను పగులగొట్టి గిలకొట్టి పాలు, పంచదార వేసి కలపాలి. బ్రెడ్ చుట్టూగల భాగాన్ని
తీసేసి తెల్లని భాగాన్ని పొడిగా చేసి సేమ్యా,యాలకుల పొడి పాలల్లో కలపాలి. గిన్నెలో
సగం వరకూ ఈ మిశ్రమాన్ని పోసి, పొయ్యి మీద వేరే పెద్ద గిన్నెలో నీళ్ళు పోసి ఆ
నీటిలో ఈ పుడ్డింగ్ గిన్నె ఉంచి మూత పెట్టి ఆవిరి మీద ఉడకనివ్వాలి. ఉడికితే
జున్నులా తయారవుతుంది. చల్లారనిచ్చి తింటే రుచిగా తియ్యగా చాలా బావుంటుంది.
త్వరగా జీర్ణమవడమేగాక ఇది బలవర్ధకమైన ఆహారం.
సేమ్యా పులిహోర
సేమ్యా 500 gm
మంచి నూనె 150 gm
వేరుశనగపప్పు 100 gm
నిమ్మకాయలు 5
పచ్చి మిరపకాయలు 10
ఎండు మిరపకాయలు 10
పసుపు 1 tbsp
ఉప్పు తగినంత
కరివేపాకు 4 రెబ్బలు
అల్లం అంగుళం ముక్క
శనగపప్పు 3 tbsp
మినపప్పు 1 tbsp
ఆవాలు 1 tsp
జీలకర్ర 2 tsp
ముందుగా సేమ్యాను కొలుచుకుని ఎన్ని గ్లాసులైతే అంతకు రెండింతలు గ్లాసుల
నీళ్ళు ఒక పెద్ద గిన్నెలో తీసుకుని అందులో పసుపు వేసి పొయ్యి మీద పెట్టి
మరగనివ్వాలి. నీళ్ళు బాగా పొంగు వచ్చాక కొలిచి పెట్టుకున్న సేమ్యాను వేసి
పలుకుగా ఉన్నప్పుడే దించి ఒక చిల్లుల గిన్నెలో వేయాలి.వెంటనే చల్లని నీళ్ళు
పోయాలి..ఇలా చేయడం వల్ల సేమ్యా విడివిడిగా అతుక్కోకుండా ఉంటాయి.
తర్వాత బాణలిలో నూనె పోసి కాగిన తర్వాత ఎండుమిర్చి,శనగపప్పు,
మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు,వేరుశనగపప్పు వరుసగా వేస్తూ దోరగా
వేగిన తర్వాత ముక్కలు చేసిపెట్టుకున్న పచ్చిమిర్చి,అల్లం వేసి కొంచెం వేగగానే
దించేయాలి. ఇందులో నిమ్మరసం పిండాలి. చలారిన సేమ్యాని ఒక వెడల్పాటి
పళ్ళెంలో వేసి తగినంత ఉప్పు కలిపి ఈ పోపు మిశ్రమాన్ని వేసి అన్ని వైపులా
బాగా కలియబెట్టి మూత వేసి ఉంచాలి. ఒ పది నిమిషాల తర్వాత తింటే చాలా
రుచిగా ఉంటుంది.
సేమ్యా బోండా
సేమ్యా 1/4 kg
క్యాబేజీ 100 kg
క్యారట్ 50 gm
మంచినూనె 1/4 kg
నెయ్యి లేదా డాల్డా 50 gm
శనగపిండి 1 కప్పు
బియ్యం పిండి 1 కప్పు
ఉల్లిపాయలు 1
పచ్చిమిర్చి 4
అల్లం అంగుళం ముక్క
కారం 1 tsp
ఉప్పు తగినంత
పసుపు 1/2 tsp
వంట సోడా చిటికెడు
కరివేపాకు ఒక రెబ్బ
ఆవాలు 1/4tsp
జీలకర్ర 1/4tsp
జీడిపప్పు 8
ముందుగా సేమ్యాను నేతిలో కొద్దిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక వెడల్పు
గిన్నెలో 4 స్పూనుల నూనె వేసి వేడి చెసి ఆవాలు,జీలకర్ర,కరివేపాకు,వేసి ఆ
తర్వాత తరిగిపెట్టుకున్న ఉల్లి,పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. ఇవన్నీ
వేగాక తరిగిన క్యాబేజీ,తురిమిన క్యారట్, తగినంత ఉప్పు వేసి కలిపి మూతపెట్టాలి.
కొద్దిగా మగ్గిన తర్వాత రెండు గ్లాసుల నీళ్ళు పోసి మరిగించాలి.నీళ్ళు మరుగుతుండగా
వేయించిన సేమ్యాను వేసి ఉండలు కట్టకుండా దగ్గరకు వచ్చేవరకు కలుపుతూ
ఉండాలి. దింపేముందు జీడిపప్పు,సన్నగా తరిగిన కొత్తిమిర వేసి కలపాలి.
శనగపిండి,బియ్యంపిండి మిశ్రమంలో తగింత ఉప్పు,కారం పొడి, వంటసోడా నీళ్ళు
పోసి బజ్జీల పిండిలా కలపాలి.పొయ్యి మీద బాణలి పెట్టి నూనె పోసి వేడి చేయాలి.
సేమ్యా మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసిపిండిలో ముంచి నూనెలో వేసి
ఎర్రగా వచ్చేలా వేయించి తీయాలి. ఇవి వేడి మీద తింటే చాలా బావుంటాయి
సేమ్యా పాయసం
సేమ్యా 200 gm
చక్కెర 150 gm
నెయ్యి 50 gm
యాలకులు 5
జీడిపప్పు 10
పాలు 500 ml
ముందుగా సేమ్యాను నెయ్యిలో బంగారు రంగు వచ్చేవరకు వేయించి పెట్టుకోవాలి.
పొయ్యి మీద పాలు వేడి చేసి అవి మరుగుతుండగా సేమ్యా వేసి ఉడికించాలి.
అవి ఉడికినతర్వాత చక్కెర,యాలకుల పొడి వేయాలి.కాస్త దగ్గర పడ్డాక దించి
జీడిపప్పును నేతిలో వేయించి అందులో కలపాలి.అంతే.
తీపి గవ్వలు
మైదా 250 gm
నెయ్యి లేదా డాల్డా 50 gm
ఉప్పు చిటికెడు
నూనె 250 gm
చక్కెర 250 gm
యాలకులు 5
ముందుగా చక్కెరలో అర గ్లాసు నీళ్ళు పోసి తీగ పాకంలా చేసి యాలకుల పొడి
కలిపి పెట్టుకోవాలి. మైదాలో కాచిన నెయ్యి కొద్దిగా ఉప్పు వేసి కలిపి చపాతీ
పిండిలా కలిపి పెట్టుకోవాలి. గవ్వల పీటకు నూనె రాసి పెట్టుకోవాలి.మైదా
పిండిని రెండుచేతులతో బాగా మర్ధన చేసి చాలా చిన్న ముద్దలుగా
చేసిపెట్టుకోవాలి.ఇప్పుడు ఈ మైదా ముద్దను గవ్వలపీటపై బొటనవేలితో వత్తుతూ
సాగదీయాలి. దానిని మెల్లిగా చుట్టెస్తే గవ్వలా ఉంటుంది.అలా అన్ని చేసి
పెట్టుకుని వేడి నూనెలో నిదానంగా కాల్చాలి.వాటిని వేడిమీదనే పాకంలో
వేయాలి. పాకం పీల్చుకున్న తర్వాత తీసి విడివిడిగా ఆరబెట్టి డబ్బాలో వేసి
పెట్టుకోవాలి.
కారం గవ్వలు

మైదా 200 gm
నెయ్యి లేదా డాల్డ 50 gm
ఉప్పు తగినంత
కారం 1 tbsp
నూనె వేయించడానికి
మైదాలో ఉప్పు,కారం పొడి, కాచిన నెయ్యి వేసి బాగా కలిపి చపాతీ పిండిలా కలిపి
పెట్తుకోవాలి. చాలా చిన్న ముద్దలు చేసుకుని గవ్వల పీటపై వత్తుకుని వేడినూనెలో
నిదానంగా బంగారు రంగు వచ్చేవరకు కాల్చాలి.. ఇవి వారం వరకు నిల్వ ఉంటాయి.
బీట్రూట్ వేపుడు

బీట్రూట్ 250 gm
ఉల్లిపాయ 1
పచ్చిమిర్చి 2
పసుపు చిటికెడు
కారం పొడి 1 gm
ఉప్పు తగినంత
కొత్తిమిర 1 tbsp
పచ్చికొబ్బరి 3 tbsp
ముందుగా బీట్రూట్ ను సన్నగా ముక్కలుగా కోసి కొద్దిగా ఉడికించి పెట్టుకోవాలి
.ఒక ఉల్లిపాయ చిన్నముక్కలుగా తరిగిపెట్టుకోవాలి.రెండు పచ్చిమిర్చి నిలువుగా
చీల్చి పెట్టుకోవాలి.పొయ్యిమీద గిన్నె పెట్టి నూనెవేడి చేసి ఆవాలు,జీలకర్ర,మినపప్పు
,సెనగపప్పు కరివేపాకు వేసి కొద్దిగా వేపాలి.ఇప్పుడు బీట్రూట్ముక్కలు,పసుపు,
కారం పొడి, ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టాలి.చిన్న మంటపై నిదానంగా
ఉడకనివ్వాలి.నీళ్ళు పోసే పని లేదు. ఉడికిన తర్వాత సన్నగ తరిగిన కొత్తిమిర
కాని తురిమిన పచ్చికొబ్బరి కాని కలిపి దించేయాలి.
వంకాయ కూర
వంకాయలు 250 gm
ఉల్లిపాయలు 1
పచ్చిమిర్చి 6-8
కొత్తిమిర 1/2 కప్పు
అల్లం 2 ‘ ముక్క
నూనె 4 tbsp
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/4 tsp
మినపప్పు 1 tsp
సెనగపప్పు 2 tsp
కరివేపాకు 1 tsp
పసుపు 1/2 tsp
వంకాయలు చిన్న ముక్కలుగా తరిగి ఉప్పు వేసిన నీళ్ళలో వేసి పెట్టుకోవాలి.
ఉల్లిపాయ,పచ్చిమిర్చి కూడాసన్నగా తరిగి పెట్టుకోవాలి. అల్లం, కొత్తిమిర కలిపి
నూరిపెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు,జీలకర్ర, మినపప్పు,
సెనగపప్పు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కొద్దిగా ఎర్రబడిన
తర్వాత నూరినముద్ద,కరివేపాకు వేసి కొద్దిగా వేపి వంకాయ ముక్కలు తగినంత
ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టాలి. చిన్న మంటపై నీళ్ళు పోయకుండానె
ఉడికిపోతుంది
పప్పు చారు

కందిపప్పు 200 gm
చింతపండు 50 gm
ఉల్లిపాయ 1
టొమాటో 2
పచ్చిమిర్చి 3
కరివేపాకు 1 రెబ్బ
కొతిమిర 1 కట్ట
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/4 tsp
ఎండుమిర్చి 4
పసుపు 1/2 tsp
కారం పొడి 1 tsp
ఉప్పు తగినంత
నూనె 2 tbsp
ముందుగా కందిపప్పును కొద్దిగా పసుపు,నూనె వేసి కుక్కర్లో మెత్తగా ఉడికించుకోవాలి.
చింతపండు నీళ్ళలో నానబెట్టాలి . ఉల్లిపాయ,పచ్చిమిర్చి,టొమాటోలు తరిగి పెట్టుకోవాలి.
పప్పును గరిటతో మెదిపి చింతపండుపులుసు తీసి అందులో కలపాలి. పొయ్యి మీద
గిన్నె పెట్టి నూనె వేడి చేసి ఎండుమిర్చి,ఆవాలు,జీలకర్ర వేసి అవి చిటపటలాడాక
ఉల్లిపాయలు,పచ్చిమిర్చి,టొమాటో ముక్కలు వేసి కొద్దిగావేపాలి. పసుపు,కారంపొడి,
కరివేపాకు వేయాలి. అవి మెత్తబడ్డాక పప్పు మిశ్రమాన్ని అందులో పోసి తగినంత
ఉప్పు,కొద్దిగా బెల్లం కాని చక్కెర కాని వేయాలి. పప్పు చారు ఐదు నిమిషాలు మరిగిన
తర్వాత కొత్తిమిర వేసిదింపేయాలి. కొద్దిగ నెయ్యి వేస్తె సూపర్ గా ఉంటుంది
క్యారట్ హల్వా
తురిమిన క్యారట్ 250 gm
చక్కెర 100 gm
నెయ్యి 50 gm
జీడిపలుకులు 10
యాలకుల పొడి 1 tsp
పాలు 1/2 lit
ముందుగా క్యారట్,చక్కెర కలిపి ఒక మందపాటి గిన్నెలో వేసి పొయ్యి
మీద పెట్టాలి. ఆ తర్వాత పాలు పోసి ఉడికించాలి. కాస్త దగ్గర పడ్డాక జీడిపప్పు
ముక్కలు, యాలకుల పొడి వేసి కలపాలి. పూర్తిగా ఉడికి దగ్గర పడ్డాక నెయ్యి
వేసి కలిపి దించేయాలి.
గులాబ్ జామూన్
కోవా 500 gm
చక్కెర 350 gm
మైద 100 gm
తినే సోడా 1/4tsp
యాలకుల పొడి 1 tsp
రిఫైండ్ నూనె వేయించడానికి
ముందుగా కోవాను పొడిపొడిగా చేయాలి. మైదా,సోడా కలిపి జల్లించి కోవాలో
కలిపి,యాలకుల పొడి వేసికలిపి కొద్ది నీళ్లతో చపాతీ ముద్దలా చేసి పెట్టుకోవాలి.
చక్కెరలో అర కప్పు నీరు పోసి పొయ్యి మీద పెట్టి తీగపాకం పట్టి పెట్టుకోవాలి.
నూనె వేడి చేయాలి(మరీ ఎక్కువ వేడి ఉండకూడదు). కోవాను చిన్న చిన్న
ముద్దలుగా చేసి గుండ్రంగా కాని కోలగా కాని చేసుకుని వేడి నూనెలో మెల్లిగా
వేసి నిదానంగా బంగారు వర్ణంవచ్చేవరకు వేపి పాకంలో వేయాలి. మొత్తం
ఇలానే చేసుకుని పాకంలో వేసి అరగంట ఉంచితే అవి పాకం బాగా
పీల్చుకుంటాయి. ఇంక తినేయడమే.
శనగపిండి హల్వా
శనగపిండి 2 కప్పులు
చక్కెర 1 1/2 కప్పులు
పాలు 2 కప్పులు
నెయ్యి 1/2 కప్పు
జీడిపప్పు 10
కిస్మిస్ 10
బాదాం 10
ఒక మందపాటి బాణలిలో శనగపిండిని దోరగా వేయించాలి మాడనివ్వకుండా. చక్కెర
వేసి మళ్ళీ ఓ పదినిమిషాలు వేయించాలి.. ఆ తర్వాత నెయ్యి వేసి కలిపి బాగా
వేయించాలి..ఇప్పుడు పాలు పోసి కలిపిహల్వాలాగా అయ్యేవరకు ఉడికించి జీడిపప్పు,
కిస్మిస్, బాదాం ముక్కలు కలిపి దించేయాలి.
అన్నంతో ఎన్నో వైరైటీలు
అన్నం మామూలుగా వండేసి పెట్టుకోండి.కాని పొడిపొడిగా ఉండాలి. మెత్తగా ఉంటే ఏమి చేయలేము.
1. ఒక గిన్నెలో ఒ గరిటెడు నూనె తీసుకునిఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి,కాస్త
మినప్పప్పు,శనగపప్పు,కరివేపాకు పసుపు వేసి కాస్త వేగిన తర్వాత దింపేసి
ఓ నిమ్మకాయ పిండి ఉప్పు వేసి అన్నంలో కలిపేస్తే నిమ్మకాయ పులిహార రెడీ
2. పచ్చి కొబ్బరి ఉంటె తురిమి పెట్టుకోండి.గిన్నెలో నూనె వేసి , ఎండుమిర్చి పోపు
గింజలు వేసి చిటపటలాడాక కరివేపాకు,పచ్చికొబ్బరి తురుము వేసి కలిపి
దించేయాలి. అన్నంలో తగింత ఉప్పు కలిపి పోపును,ఓ స్పూను నెయ్యి వేసి బాగా
కలిపి మూత పెట్టి ఓ పదినిమిషాల తర్వాత తిండానికి కొబ్బరి పులిహార రెడీ.ఇందులో
పసుపు వేయకూడదు. కొబ్బరి వేపకూడదు.
3. నిమ్మకాయ పులిహార ఎండుమిర్చి కాని పచ్చిమిర్చితో కాని చేసుకోవచ్చు.
అప్పుడప్పుడు అల్లం తురిమి పోపులో వేస్తె అదో అదిరే టేస్ట్.
4. క్యారట్,బీన్సు సన్నగా ముక్కలుగా కోసి కాస్త ఉడికించి పెట్టుకోవాలి. ఒక చిన్న
ఉల్లిపాయ చిన్న ముక్కలుగా తర్రిగి,రెండు పచ్చిమిర్చి చీల్చి పెట్టుకోవాలి. బాణలిలో
నూనె వేసి ఆవాలు,జీలకర్ర,కరివేపాకు,శనగపపు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ,
పచ్చిమిర్చి, కూరగాయ ముక్కలు కొద్దిగా వేపి కొంచం అల్లంవెల్లుల్లి ముద్ద,
గరంమసాల,పసుపు వేసి మళ్ళి కాస్త వేపి అన్నం వేసి తగిన ఉప్పు వేసి అన్ని
కలిసేలా బాగా కలిపి ఓ రెండు నిమిషాలు వేపి దించి పెరుగు పచ్చడితో
లాగించండివెజ్ ఫ్రైడ్ రైస్.
5. చింతపండు పులుసు తీసిపెట్టుకుని నూనె వేడి చేసి ఇంగువ వేసి,ఆవాలు,జీలకర్ర,
ఎండుమిర్చి,శనగపప్పు,వేరుశనగ గుళ్ళు,కరివేపాకు వేసి వేగిన తర్వాత పులుసు
పసుపు,తగినంత ఉప్పు వేసి చిక్కబడి నూనె తేలేవరకు ఉడికించి దించేయాలి. ఈ
పులుసు వారం నిల్వ ఉంటుంది ఉప్పు సరిగ్గా ఉంటే.కావల్సినప్పుడు అన్నంలో తగినంత
పులుసు వేసి కలుపుకోడమే.రుచికరమైన పులిహార రెడి ఎప్పుడైనా.
6. కాస్త వేరైటీగ ఉండాలంటె కారం తగ్గట్టుగా ఎండుమిర్చి,కాస్త జీలకర్ర,మెంతులు,
నువ్వులు వేయించి పొడి చేసి మరుగుతున్న పులుసులో అప్పుడు ఎండుమిర్చి
వేయకూడదు.మిగతావన్ని అలాగే.
7. ఉల్లిపాయ,చిన్న అల్లం ముక్క,రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి.
గిన్నెలో నూనె వేడి చేసి జీలకర్ర,యాలకులు,లవంగాలు,దాల్చిన చెక్క,షాజీర
కొద్దిగా,ఉల్లిపాయలు, మిర్చి, అల్లం ముక్కలు వేసి వేప అన్నం, తగినంత ఉప్పు
వేసి బాగ కలిపి కొద్దిగా వేపి దించేయాలి. అంతే జీరా రైస్ రేడీ.
8. అన్నంలో నీళ్ళు పోసి మెత్తగా ఉడికించుకోవాలి.లేదా అన్నం ఎప్పుడన్నా మెత్తబడితే
ఇలా చేసుకోవచ్చు.దానిని గరిటతో మెదిపి తగినంత ఉప్పు కలిపాలి. ఒక గిన్నెలో పాలు
ఇంక పెరుగు కలిపి పెట్టుకోవాలి.గిన్నెలో నూనె వేసి ఇంగువ వేసి ఎండుమిర్చి,ఆవాలు,
జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు వేసి వేపి పెరుగులో కలపాలి.కావాలంటె సన్నగా తరిగిన
అల్లం ముక్కలు పోపులో వెసుకోవచ్చు.బావుంటుంది. పెరుగు మిశ్రమాన్ని అన్నంలో
వేసి బాగా కలిపి అట్టే పెట్టి పది నిమిషాల తర్వాత తింటే సరి ఆవకాయనంజుకుంటూ.
ఇది ఎక్కువగా ప్రయాణాలకోసం చేసుకోవచ్చు.మొత్తం పెరుగుతో చేసుకుంటె అన్నం
పుల్లగ అవుతుంది.అందుకే సగం పెరుగు సగం పాలతో చేసుకోవాలి.అప్పుడు కమ్మగా
ఉంటుంది దధ్యోజనం దీనికి నిమ్మకాయ ఊరగాయ ఉంటె అదుర్స్.




















