Featured Posts
కైమా ఉండల కూర
ఉల్లిపాయలు 2
పచ్చిమిర్చి 3
కొబ్బరిపొడి 50 gm
కారంపొడి 2 tsp
పసుపు 1/4 tsp
ధనియాల పొడి 2 tsp
గరం మసల పొడి 1 tsp
అల్లం వెల్లుల్లి 2 tsp
కరివేపాకు 1 tsp
కొత్తిమిర 2 tsp
నూనె 4 tbsp
ఉప్పు తగినంత
ముందుగా ఖైమాలో తగినంత ఉప్పు, సగం కారం, పసుపు, ధనియాల
జిలేబీ
కాజు బర్ఫీ
పాలకూర పకోడీ
ముందుగా పాలకూరను కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు
ఉల్లిపాయ పకొడీ

వెజ్ టబుల్ సమోసా
పిండిలో కొద్దిగా ఉప్పు 1 చెంచా నూనె వేసి నీరు పోసి చపాతీ పిండిలా కలిపి
బటన్ ఇడ్లీ పెరుగు వడ
చిన్న చిన్న ఇడ్లీలు చేసే పాత్రలు కూడా ఉంటాయి వీటినే బటన్ ఇడ్లీలంటారు.ఇవి కూడా మిగిలిపోతే చక్కగా పెరుగువడ చేసుకోవచ్చు
.బటన్ ఇడ్లీలు 10
పెరుగు 250 gm
మజ్జిగ 150 gm
ఎండుమిర్చి 2
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/2 tsp
మినప్పప్పు 1tsp
శనగపప్పు 2 tsp
క్యారట్ 1
కొత్తిమిర 2 tsp
కరివేపాకు 1 tsp
నూనె 2 tsp
నూనె వేడి చేసి బటన్ ఇడ్లీలను బాగా వేయించాలి.వీటిని ఉప్పు
కలిపిన మజ్జిగలో వేయాలి.2 tbsp నూనెను వేడి చేసి
ఎండుమిర్చి,ఆవాలు,జీలకర్ర,మినప్పప్పు,శనగపప్పు,కరివేపాకు
వేసి కాస్త వేగాక మజ్జిగలో కలపాలి.పెరుగును కూడా ఉప్పు
కలిపి బాగా చిలికి ఇందులోనే వేయాలి.సన్నగా తురిమిన
క్యారట్,కొత్తిమిర చల్లి వడ్డించాలి.
మైసూరు ఉప్మా
ఇడ్లీలు 8
వేరుశనక్కాయలు 50 gm
ఆవలు 1/2 tsp
జీలకర్ర 1 tsp
మినప్పప్పు 1 tsp
శనగపప్పు 2 tsp
ఎండుమిర్చి 2
అల్లం 1''
'పసుపు కొద్దిగా
కొత్తిమిర 2 tsp
కరివేపాకు 1 tsp
నిమ్మరసం 1 tsp
ఉప్పు తగినంత
నూనె 3 tbsp
ఇడ్లీలను మెత్తగా చిదిమి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేడి
చేసి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక మినప్పప్పు,
శనగపప్పు,వేరుశనగ గుళ్ళు,కరివేపాకు పసుపు వేసి కొద్దిగా వేపాకా
దింపేయాలి.ఇప్పుడు ఇందులో ఇడ్లీపొడిని,తగినంత ఉప్పు కొద్దిగా
నిమ్మరసం,కొత్తిమిర వేసి బాగా కలిపి కొత్తిమిర చట్నీతో వడ్డించాలి.
ఇడ్లీ ఫ్రయంస్
ఇడ్లీలు 6
కారం పొడి 2 tsp
ధనియాల పొడి 2 tsp
ఉప్పు తగినంత
నూనె వేయించడానికి
ఇడ్లీలను సన్నగా నిలువుగా కోసుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి
సన్నగా కోసిన ఇడ్లీ ముక్కలను బాగా కరకరలాడేలా వేయించాలి.
నూనెలోంచి తీసి పైన ధనియాల పొడి, కారం, ఉప్పు చల్లి టమాటా
సాస్ తో వడ్డించాలి. ఇవి వేడిగా ఉన్నప్పుదే తినాలి. చల్లారితే గట్టిగా
ఉంటాయి.
ఇడ్లీ డోక్లా
ఇడ్లీలు 4
మజ్జిగ 2 కప్పులు
పసుపు 1/2 tsp
జీలకర్ర 1/4 tsp
ఆవాలు 1/4 tsp
ఇంగువ చిటికెడు
కొత్తిమిర 3 tsp
కరివేపాకు 1 tsp
పచ్చిమిర్చి 4
ఉప్పు తగినంత
ఇడ్లీలను చిన్న చదరపు ముక్కలుగా కోయాలి. వెడల్పాటి గిన్నెలో
పద్దతిగా అమర్చాలి. బాణలిలో నూనె వేడి చేసి ఇంగువ, ఆవాలు,
జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు,పసుపు,వేసి వేపాక నీరు
లేదా మజ్జిగ పోయాలి (ఉప్మా పద్దతిలో)తగినంత ఉప్పు,వేసి బాగా
మరిగాక ఇడ్లీలపై పోయాలి అన్నీ మునిగేదాకా.ఇడ్లీ ముక్కలు
నీరంత పీల్చుకున్నాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమిర చల్లాలి.
ఇడ్లీ తీపి పొంగలి
ఇడ్లీలు 4
బెల్లం సరిపడ
యాలకులు 3
జీడిపప్పు 5
కిస్మిస్ 5
నెయ్యి 2 tsp
ఇడ్లీలను చిదిమి పెట్టుకోవాలి.బాణలిలో కొంచెం నెయ్యి వేడి చేసి కిస్మిస్,
జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తురిమిన బెల్లం కొద్దిగా
నీరు కలిపి బాణలిలో వేసి సన్న మంట మీద ఉంచాలి. పై పాకంలో
ఇడ్లీ పొడి, యాలకుల పొడి, నెయ్యి వేసి కలుపుతూ ఉండాలి. బెల్లం
అంతా కరిగేవరకు ఇలా కలిపి దించేయాలి. కిస్మిస్, జీడిపప్పు కలిపి
వేడిగా వడ్డించాలి. ఇది పూర్తిగా సన్నని మంటపైనే చేయాలి.
కంచి ఇడ్లీ
ఇడ్లీ రవ్వ 2 1/2 గ్లస్సులు
ఉప్పు తగినంత
ఆవాలు 1/2 tsp
జీలకర్ర 1/2 tsp
మినప్పప్పు 2 tsp
శనగపప్పు 3 tsp
పచ్చిమిర్చి 3
కరివేపాకు 1 tsp
నూనె 5 tsp
ఇడ్లీ
ఇడ్లీ రవ్వ 21/2 గ్లాసులు
ఉప్పు తగినంత
ముందుగా పప్పు, రవ్వను బాగు చేసుకుని విడివిడిగా నీళ్ళు పోసి
క్యాబేజీ కూర

నువ్వుల లడ్డు
బెల్లం 250 gm
నెయ్యి 2 tsp
ఏలకులు 4
బెల్లం కరిగించి వడకట్టుకోవాలి.నువ్వులు ఖాలీ బాణలిలో దోరగా వేయించాలి. నువ్వు
మజ్జిగ పులుసు
సెనగపిండి 150 gm
ధనియాలపొడి 2 tbsp
పచ్చిమిర్చి 2
ఎండుమిర్చి 3
ఆవాలు 1/4 gm
జీలకర్ర 1/4 gm
మినప్పప్పు 1/2 gm
కరివేపాకు 2 రెబ్బలు
కొత్తిమిర 2 tsp
నెయ్యి 2 tbsp
నూనె
ముందుగా మజ్జిగ,1 tbsp ధనియాల పొడి,పసుపు,ఉప్పు,50 gm సెనగపిండి
బంగాళ దుంప వేపుడు
ఉల్లిపాయలు 3
పచ్చిమిర్చి 2
కరివేపాకు 2 రెబ్బలు
పసుపు చిటికెడు
కారంపొడి 1 tsp
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/4 tsp
ఉప్పు తగినంత
నూనె 3 tbsp
రవ్వ లడ్డు

పంచదార 250 gms
ఎండు కొబ్బరి పొడి 50 gms
ఏలకులు 4
జీడిపప్పు 10
కిస్మిస్ 10
నెయ్యి 50 gms
పాలు 100 ml
ముందుగా నెయ్యి కరిగించి జీడిపప్పు,కిస్మిస్ కొద్దిగా వేయించి అందులోనే రవ్వను
పొడి చేసుకోవాలి. వేయించిన రవ్వ,ఎండుకొబ్బరిపొడి,పంచదార పొడి,అన్ని బాగా
సెనగ పిండి లడ్డు
పంచదార 100 gms
కోవా 50 gms
నెయ్యి 50 gms
ఏలకులు 5
బాణలి వేడి చేసి కొద్దిగా నెయ్యి వేసి సెనగపిండిని కమ్మని వాసన వచ్చేవరకు నిదానంగా
సున్నుండలు
పంచదార 100 gms
ఏలకులు 5
నెయ్యి 50 gms
ముందుగా మినప్పప్పును ఖాళీ బాణలిలో కమ్మని వాసన వచ్చేవరకు నిదానంగా
వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి.పంచదార ఏలకులు కలిపి మెత్తగా పొడి చేసుకోవాలి.
పూతరేకులు

పంచదార 250 gm
ఈ పూతరేకులు చేయాలంటే చాల నేర్పు ఓర్పు కావాలి.చేయుటకు ప్రత్యేకమైన
దధ్యోధజనం
పెరుగు 100 ml
పాలు 100 ml
ఎండుమిర్చి 4
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/4 tsp
మినపప్పు 1 tsp
శనగపప్పు 1 tsp
అల్లం ముక్క 1"
కరివేపాకు 2 రెబ్బలు
నెయ్యి 2 tbsp
పెట్టుకోవాలి. పాలు పెరుగు బాగా కలిపి ఉంచుకోవాలి. నెయ్యి వేడి చేసి ఇంగువ
నిమ్మకాయ పులిహొర
నిమ్మకాయలు 2
పసుపు 1/4tsp
ఎండు మిర్చి 4
పులిహొర
చింతపండు 50 gm
పసుపు 1 tsp
ఎండు మిర్చి 4
ఆవాలు 1 tsp
జీలకర్ర 1/2tsp
మినప్పప్పు 1 tsp
శనగపప్పు 2 tsp
వేరుశన గుళ్ళు 1/4 కప్పు
కరివేపాకు 2 రెబ్బలు
ఇంగువ చిటికెడు
ఉప్పు తగినంత
బ్రెడ్ పకోడి
బ్రెడ్ స్లైసులు 8
బంగాళ దుంప (ఉడికించినది) 1
శనగపిండి 1 కప్పు
పచ్చిమిర్చి 2
కొత్తిమిర 1 tbsp
కరివేపాకు 1 tsp
కారం పొడి 1 tsp
ఉప్పు తగినంత
వంట సోడా చిటికెడు
పసుపు చిటికెడు
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/2 tsp
నూనె వేయించడానికి
ముందుగా బాణలిలో ఒక స్పూను నూనె వేడి చేసి ఆవాలు వేసి చిటపటలాడాక
కరివేపాకు,తరిగిన పచ్చిమిర్చి,పసుపు వేసి కొద్దిగా వేపి ఉడికించిన బంగాళ దుంపను
పొడి పొడిగ చిదిమి అందులో వేసి తగినంత ఉప్పు,కొత్తిమిర వేసి రెండు నిమిషాలు
వేయించాలి.శనగపిండిలో ఉప్పు,కారం పొడి,వంట సోడా వేసి గరిటజారుగా కలిపి
ఉంచాలి. ఒక బ్రెడ్ స్లైసును తీసుకుని దానిపై కొద్దిగా బంగాళదుంప మిశ్రమాన్ని పరిచి
ఇంకో స్లైసును దానిపై పెట్టి అతుకునేట్టట్టుగా కొద్దిగా వత్తి నాలుగు చతురస్రాలుగా
కట్ చేయాలి. ఇప్పుడు ఒక్కో ముక్కను శనగపిండి మిశ్రమంలో ముంచి వేడి నూనెలో
ఎర్రగా కాల్చాలి.ఇవి గ్రీన్ సాస్ కాని టొమాటో సాస్ కాని నంజుకుని తింటే బావుంటాయి
పక్కనే వేడి కాఫీ కాని టీ కాని ఉండాలి సుమా.
బ్రెడ్ పిజ్జా
ఉల్లిపాయ 1
టొమాటో 1
పచ్చిమిర్చి 2
కారట్(తురిమినది) 1 tbsp
కాప్సికం 1 tbsp
కొత్తిమిర 2 tbsp
ఉప్మా రవ్వ 1 కప్పు
పాలు 1/2 కప్పు
ఉప్పు తగినంత
టోమాటో సాస్ 1 tsp
చిల్లీ సాస్ 3 tbsp
చీజ్ 50 gm
నూనె 5 tbsp
పైన వస్తువులన్నీ కలిపి పెట్టుకోవాలి చీజ్,చిల్లీసాస్ తప్ప. ఇప్పుడు ఒక్కో బ్రెడ్
స్లైసుపై చిల్లీ సాస్ పూసి రెండు స్పూనుల మిశ్రమాన్ని పెట్టి సమానంగ పరిచి
తురిమిన చీజ్ చల్లి పెనంపై కొద్దిగా నూనె కాని వెన్న కాని వేసి రెండు వైపులా
కాల్చాలి.లేదా ఒవన్లో కాని కాలిస్తె సరి చీజ్ కరిగేవరకు.
బ్రెడ్ బజ్జీలు
బ్రెడ్ 8 స్లైసులు
శనగ పిండి 2 కప్పులు
ఉప్పు తగినంత
కారం పొడి 1 tsp
అల్లం వెల్లుల్లి 1 tsp
వంట సోడా చిటికెడు
గరం మసాల పొడి 1/2tsp
వాము లేదా జీలకర్ర 1/2tsp
నూనె వేయించడానికి
ముందుగా బ్రెడ్ ముక్కలను త్రికోణాలుగ కట్ చేసి పెట్టుకోవాలి.వాటిని టోస్టర్లో
కాని పెనంపై కాని కాస్త గట్టిపడేటట్టు కాల్చి పెట్టుకోవాలి. గిన్నెలో శనగపిండి
,ఉప్పు,కారం పొడి,అల్లం వెల్లుల్లి ముద్ద, వాము లేదా జీలకర్ర,గరం మసాలా పొడి
,వంట సోడా కలిపి నీళ్ళు పోసి గరిటజారుగా కలిపి ఓ పది నిమిషాలు ఉంచాలి.
నూనె వేడి చేసి ఒక్కో బ్రెడ్ ముక్కను పిండిలో ముంచి నూనెలో వేసి ఎర్రగా
వేయించాలి .వేడి వేడిగా సాస్ కాని ఆవకాయ కాని నంజుకుని తింటె అదిరిపోతుంది.
బ్రెడ్ మంచూరియా
బ్రెడ్ 6 స్లైసులు
మైదా 1/2 కప్పు
కార్న్ ఫ్లోర్ 1 tbsp
అల్లం వెల్లుల్లి ముద్ద 2 tsp
మిరియాల పొడి 1 tsp
కారం పొడి 1/2 tsp
ఉప్పు తగినంత
సోయా సాస్ 1/2 tsp
అజినొమొటో చిటికెడు
పచ్చిమిర్చి 1
ఉల్లి పొరక 1/4 కప్పు
బ్రెడ్ అంచులు తీసేయాలి. ఒక్కో స్లైసును నాలుగు ముక్కలుగా చేసి పెట్టుకోండి.
ఇప్పుడు మైదా,కార్న్ ఫ్లోర్,ఉప్పు,సగం అల్లం వెల్లుల్లి ముద్ద,కారం పొడి కలిపి
కొద్దిగా నీళ్ళు పోసి బజ్జీల పిండిలా కలిపి పెట్టాలి.ఈ మిశ్రమం మరీ చిక్కగా
కాకుండా,మరీ పలుచగా కాకుండా ఉండాలి. పొయ్యి మీద నూనె వేడి చేసి
ఈ బ్రెడ్ ముక్కలను పిండిలో ముంచి నూనెలో వేసి ఎర్రగా వేయించాలి. అలా
అన్ని ముక్కలు చేసి పక్కన పెట్టుకోండి.తర్వాత ఒక బాణలిలో రెండు స్పూనుల
నూనె వేడి చేసి అల్లం వెల్లుల్లి ముద్ద కొద్దిగా వేపి సన్నగా తరిగిన ఉల్లి పొరక,
పచ్చిమిర్చి ముక్కలు, వేసి బాగా వేపాలి. ఇప్పుడు అర కప్పు నీళ్ళలో 1 స్పూను
కార్న్ ఫ్లోర్,అజినొమొటొ,సొయా సాస్,మిరియాల పొడి వేసి కలిపి పోపులో వేసి
మరిగించాలి.ఇప్పుడు బ్రెడ్ ముక్కలు వేసి ఓ నిమిషం ఉడికించి దించేయండి.
ఈ వంటకం పొడి పొడిగా కావాలనుకుంటే కారంఫ్లోర్ మిశ్రమం వేయకూడదు.
అజినొమొటొ, సొయాసాస్,మిరియాల పొడి వేసి బాగ వేపి బ్రెడ్ ముక్కలు వేసి
కలిపి ఓ నిమిషం తర్వాత దించితే సరి.
బ్రెడ్ ఉప్మా
బ్రెడ్ 8 స్లైసులు
ఉల్లిపాయలు 1
టొమాటో 2
పచ్చిమిర్చి 3
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/4 tsp
మినప్పప్పు 1/4 tsp
కరివేపాకు 1 tbsp
పసుపు 1/4 tsp
ఉప్పు తగినంత
నూనె 2 tbsp
ముందుగా బ్రెడ్ ను చిన్న చదరపు ముక్కలుగ చేసి పెట్టుకోవాలి.కావాలంటె
ఈ ముక్కలను నూనెలో కాని టోస్టర్లో కాని ఎర్రగా కాల్చి పెట్టుకోవచ్చు.ఉల్లిపాయలు,
పచ్చిమిర్చి సన్నగా తరిగి ఉంచుకోవాలి. పొయ్యి మీద బాణలి పెట్టి నూనె వేడి చేసి
ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు,కరివేపాకు వేసి కొద్దిగా వేపి తరిగిన ఉల్లిపాయలు,
పచ్చిమిర్చి,పసుపు వేసి వేపాలి.ఇప్పుడు బ్రెడ్ ముక్కలు తగినంత ఉప్పు వేసి అన్ని
బాగా కలిపి మూత పెట్టాలి.ఓ మూడు నిమిషాల తర్వాత కొత్తిమిర చల్లి దించేయండి.
ఇది చాల తొందరగా అయ్యే టిఫిన్.
































