Featured Posts
అరటికాయ చిప్స్

అరటికాయలు చెక్కు తీసి చక్రాల్లా తరుగుకొని ఉప్పు వేసి ఉడికించాలి. తరువాత మంచి ఎండలో గల గల లాడేలా ఎండనివ్వాలి. పూర్తిగా ఎండాక నూనెలో వేపుకుని పైన కారం చల్లి తినాలి.ఇవి ఎన్నాళ్ళయినా నిల్వ ఉంటాయి. కూరలేవి లెనప్పుడు ఇవే ఆధారం. సాంబారులోకి ,రసంలోకి బావుంటాయి.
అరటికాయ ఉప్మా కర్రీ
అరటికాయలు 4
ఉల్లిపాయలు 3
ఉప్పు తగినంత
పోపు సామాను
కరివేపాకు
నూనె 3 tbsp
ముందుగా అరటికాయలను చెక్కు తీసి ముక్కలు చేసి నీరు పోసి ఉడికించుకోవాలి.
అవి ఉడికి, చల్లారాక పొడి పొడిగా చేసుకోవాలి. పొయ్యి మీద బాణలిలో నూనె
వేడి చేసి పోపు సామాను వేసి చిటపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు,
కరివేపాకు వేసి అవి మెత్తబడ్డాక పొడి చేసుకున్న అరటికాయ,తగినంత ఉప్పు వేసి
బాగా కలియబెట్టి మూత పెట్టాలి. కావాలంటే అర కప్పు నీరు పోసి మగ్గనివ్వాలి.
పొడిగా కావాలనుకుంటే నీరు పోయవద్దు.
సొరకాయ నూపిండి కూర
సొరకాయ 250 gm
పచ్చిమిరపకాయలు 3
ఎండుమిరపకాయలు 3
కరివేపాకు 1 tbsp
నువ్వులు 50 gm
ఉప్పు తగినంత
ఇంగువ చిటికెడు
పోపు సామాను
నూనె 3 tbsp
సొరకాయ చెక్కు తీసి ముక్కలు చేసి కొద్దిగా నీరు పోసి ఉడికించుకోవాలి. నువ్వులు
వేయించి పొడి చేసుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి ఎండుమిరపకాయలు, పచ్చి
మిరపకాయలు,ఇంగువ,పోపు సామాను వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన
సొరకాయ ముక్కలు,కరివేపాకు, నువ్వులపొడి,ఉప్పు వేసి బాగా కలియబెట్టి మరి
కొద్ది సేపు ఉడకనివ్వాలి.
సొరకాయ ఉల్లికారం
సొరకాయ 250 gm
ఉల్లిపాయలు 3
ఎండుమిర్చి 4
పచ్చిమిరపకాయలు 3
చింతపండు నిమ్మకాయంత
నూనె 3 tbsp
ఉప్పు తగినంత
సొరకాయ చెక్కు తీసి ముక్కలుగా చేసుకొని నూనెలో కొద్దిగా వేపుకుని
తీసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు,ఎండుమిర్చి, పచ్చి
మిరపకాయలు, చింతపండు కొద్దిగా ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా
రుబ్బుకోవాలి.ఆ ఉల్లి ముద్దను ఇంతకుముందు నూనెలో ఎర్రగా వేయించి
సొరకాయ ముక్కలు వేసి మరి కొద్ది సేపు వేయించి దింపేముందు కొత్తిమిర
వేయాలి. ఇది వేడి వేడి అన్నంలోకి లేదా చపాతీల్లోకి బావుంటుంది.
సొరకాయ హల్వా
సొరకాయ 250 gm
పంచదార 150 gm
పాలు 1/2 lit
యాలకులు 4
నెయ్యి 40 gm
సొరకాయ చెక్కు తీసి తురుముకోవాలి. దీనిలోంచి నీరు పిండేసి ఆ తురుమును
నెయ్యిలో వేయించుకోవాలి. దీనికి పాలు,పంచదార కలిపి గట్టిపడేవరకు ఉడికించాలి.
దించేముందు యాలకులపొడి చల్లి దింపేయాలి.
సొరకాయ పెరుగు పచ్చడి
సొరకాయ ముక్కలు 1 cup
గట్టి పెరుగు 1 cup
ఆవాలు 1/2 tsp
జీలకర్ర 1/2 tsp
ఉప్పు తగినంత
నూనె 1 tbsp
ఎండు మిరపకాయలు 2
ఇంగువ చిటికెడు
చిన్నగా చేసి పెట్టుకున్నసొరకాయ ముక్కలను కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా ఉడకబెట్టుకోవాలి.
ముక్కలలో నీరంతా ఒంపేసి చల్లారిన తర్వాత వీటిని పెరుగులో కలుపుకోవాలి. బాండీలో
నూనె వేడి చేసి మిరపకాయలు,ఆవాలు,ఇంగువ వేసి వేగిన తర్వాత పెరుగులో కలపాలి.
వడ్దించేముందు కొత్తిమిర చల్లాలి.
సొరకాయ రొట్టె
సొరకాయ తురుము 1 cup
బిప్పపు పిండి 1 cup
గోధుమ పిండి 1 cup
పచ్చికొబ్బరి తురుము 1/2 cup
పచ్చిశనగపప్పు 50 gm
అల్లం,పచ్చిమిర్చి ముద్ద 1 tbsp
ఉల్లి తురుము 1/2 cup
కొత్తిమిర, కరివేపాకు 2 tbsp
జీలకర్ర 1 tsp
ఉప్పు తగినంత
నూనె రొట్టెలు కాల్చడానికి
పై పదార్ధాలన్నీ కలిపి చపాతీ పిండిలా కలిపి పది నిమిషాలు అలా ఉంచి
కావలసిన సైజులో వుండలుగా చేసుకోవాలి. వీటిని పాలిథిన్ కవరుపై
మందంగా రొట్టెలుగా వత్తుకోవాలి. వెంటనే వేడి పెనంపై కాల్చుకోవాలి.
సొరకాయ వడలు
సొరకాయ తురుము 1 కప్పు
బియ్యపు పిండి 1 కప్పు
సెనగపిండి 1 కప్పు
ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు
అల్లం ముక్కలు 1 tsp
పచ్చిమిర్చి ముక్కలు 1 tsp
జీలకర 1 tsp
కరివేపాకు కొత్తిమిర
ఉప్పు తగినంత
నూనె వేయించడానికి
సొరకాయ తురుముతో సహా మిగిలిన పదార్థాలన్నీ కలుపుకోని గారెల
మాదిరిగా చేతితో వత్తుకుని వేడి నూనెలో ఎర్రగా వేయించుకోవాలి. దీనికి
పెరుగుపచ్చడి మంచి కాంబినేషన్.
సొరకాయ పాయసం
సొరకాయ 200 gm
పంచదార 150 gm
యాలకులు 4
జీడిపప్పు 5
కిస్మిస్ 5
బియ్యపు పిండి 1 tbsp
నెయ్యి 3 tsp
పాలు 1/2 lit
ముందుగా సొరకాయ చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి.
మందపాటి గిన్నెలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించి తీసి
పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలో సొరకాయ ముక్కలు వేసి కొద్దిగా వేపి
నీరు పోసి ఉడికించుకోవాలి.ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత చక్కెర వేసి
కరిగాక పాలు పోయాలి. బియ్యపు పిండిలో కొద్దిగా నీరు పోసి గరిటజారుగా
చేసి పాలు,సొరకాయ మిశ్రమంలో పోయాలి. కొద్దిగా ఉడికిన తర్వాత
దించేముందు జీడిపప్పు,కిస్మిస్,యాలకులపొడి వేసి దించాలి. దీనిని వేడి
వేడిగా లేకా చల్ల చల్లగా ఎలా తాగినా రుచిగానే ఉంటుంది.
సొరకాయ కర్రీ

సొరకాయ 250 gm
చింతపండు నిమ్మకాయంత
నూనె 50 gm
అల్లం 1" ముక్క
పచ్చిమిర్చి 1 tsp
కారం 1 tsp
ఉప్పు తగినంత
ఇంగువ చిటికెడు
కరివేపాకు 1 tbsp
సొరకాయ చెక్కు తీసి ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి
జీలకర్ర, అల్లం, పచ్చిమిరపకాయ ముక్కలు,ఇంగువ,కరివేపాకు వేసి బాగా వేయించాలి.
సొరకాయ ముక్కలు వేసి బాగా కలిపి సన్నని మంట మీద మగ్గనివ్వాలి. అవసరం
అనుకుంటే కొద్దిగా నీరు పోసుకోవచ్చు. ముక్కలు ఉడికిన తర్వాత చిక్కటి చింతపండు గుజ్జు
కొద్దిగా పోసి ఉప్పు, కారం వేసి మరికొద్దిసేపు ఉడకనివ్వాలి. వేడి వేడి అన్నంలో లేదా
చపాతీల్లోకి ఈ కూర రుచిగా ఉంటుంది.
ఢోక్లా

సెనగపిండి 250gm
పెరుగు 1 cup
అల్లం 1"
వంట సోడా లేదా ఇనో సాల్ట్ 1 tsp
పసుపు 1/4 tsp
నిమ్మరసం 1tsp
నూనె 1 tbsp
పోపుకి..
నూనె 3 tsp
ఆవాలు 1 tsp
కరివేపాకు 2 tsp
కొత్తిమిర 2 tbsp
జల్లించిన సెనగపిండి, పెరుగు,ఉప్పు,తగినంత నీరు కలిపి కాస్త చిక్కగా కలిపి కనీసం
నాలుగు గంటలు నాననివ్వాలి.పచ్చిమిర్చి,అల్లం ముద్ద, పసుపు అందులో వేసి
బాగా కలపాలి.ఒక పెద్ద గిన్నెలో నీరుపోసి వేడి చేయాలి.ఒక చిన్న గిన్నెలో సోడా లేదా
ఇనో సాల్ట్ , నూనె,నిమ్మరసం కలిపి పిండిలో వేసి బాగా కలియబెట్టాలి. ఒక వెడల్పాటి
గిన్నెకు( నీరు మరుగుతున్న గిన్నెలో పట్టేది) అన్నివైపులా నూనె రాసి ఈ పిండి
మిశ్రమం వేసి సమానంగా సర్ది పెద్ద గిన్నెలో మరుగుతున్న నీటిలో పెట్టి ఆవిరిపై పదిహేను
నిమిషలు ఉడికించాలి. చల్ల్లారాక ముక్కలుగా కోయాలి. ఇప్పుడు నూనె వేడి చేసి ఆవాలు
కరివేపాకు వేసి చిటపటలాడాక దింపి పావు కప్పు నీరు కలిపి ఈ ఢోక్లా ముక్కలపై
సమానంగా పోయాలి.ఆ నీటిని పీల్చుకుని అవి మృదువుగా అవుతాయి. కొత్తిమిర,
కొబ్బరి తురుముతో అలంకరించి వడ్డించాలి.
ఫ్రెంచ్ ఫ్రైస్

బంగాళదుంపలు ౪
నూనె వేయించడానికి
బంగాళదుంపలను నిలువుగా సన్నని ముక్కలుగా కోసి చల్లటి నీటిలో
గంట సేపు నానబెట్టాలి. తర్వాత తీసి నీరంతా ఓడ్చి, తడి ఆరేవరకు
ఉంచి వేడి నూనెలో ఎర్రగా వేయించుకోవాలి.
పనీర్ పకోడి

పనీర్ 200 gm
సెనగపిండి 150 gm
కారం పొడి 1 tsp
వాము 1 tsp
కొత్తిమిర 2 tsp
ఉప్పు తగినంత
వంట సోడా చిటికెడు
పనీర్‌ను అరంగుళం చదరపుగా కాని మనకిష్టమైన రీతిలో ముక్కలుగా కోసి ఉంచుకోవాలి. సెనగపిండిలొ కారం, వాము,ఉప్పు,సన్నగా తరిగిన కొత్తిమిర, వంట సోడా కలిపి అరగంట నాననివ్వాలి. తర్వాత ఒక్కో పనీర్ ముక్క సెనగపిండి మిశ్రమంలో ముంచి వేడి నూనెలో బంగారు రంగులో వచ్చేవరకు నిదానంగా వేయించి వేడిగా పుదీనా చట్నీతో వడ్డించాలి.
పనీర్ టిక్కా

పనీర్ 200 gm
ఉల్లిపాయ 1
క్యాప్సికం 1
మష్రూంస్ 3
కొత్తిమిర 2 tsp
మషాలా..
పెరుగు 1 కప్పు
అల్లం వెల్లుల్లి 1 tsp
కారం పొడి 1 tsp
చాట్ మసాలా 1 tsp
గరం మసాలా 1/2 tsp
జీలకర్ర పొడి 1 tsp
ఉప్పు తగినంత
తందూర్ కలర్ చిటికెడు
ముందుగా మషాలా సామానులన్ని కలిపి పెట్టుకోవాలి. పనీరును, కూరగాయలను అరంగుళం చదరపు ముక్కలుగా కోసి ఉంచుకోవాలి. పనీర్ ముక్కలకు మసాలా అన్నివైపులా బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. మిగతా మసాలాను కూరగాయలకు పట్టించాలి. వీటిని గంట అలా నాననివ్వాలి.లేదా కలిపి ఫ్రిజ్‌లో పెట్టి కావల్సినప్పుడు వేయించుకోవచ్చు. వేడి నూనెలో ఒక్కొక్కటిగా వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి గ్రీన్ చట్నీతో వడ్డించాలి.
మామిడి పెరుగు స్వీటు

పెరుగు 2 cups
మామిడి పండ్ల గుజ్జు 1/2 cup
మామిడి ఎస్సెన్స్ 1/2 tsp
కండెన్స్ మిల్క్ 1/2 cup
పెరుగును పలుచటి గుడ్డలో కట్టి వేలాడదీయాలి. అందులోని నీరంతా
పోయేదాక అలా వదిలేయాలి. తరువాత ఆ పెరుగు ముద్దని,మామిడి
పండ్ల గుజ్జు,ఎస్సెన్స్,కండెన్స మిల్క్ కలిపి మిక్సీలో బాగా మృదువుగా
అయ్యాక తీసి చల్లగా వడ్డించాలి సన్నగా తరిగిన జీడీపపు,పిస్తా ముక్క్లలతో
అలంకరించి.
మామిడి కుల్ఫీ

మామిడిపండ్లు 4
చక్కెర 1/2 cup
తాజా క్రీము 1 cup
పిస్తా 10
మామిడిపండ్లు చెక్కు తీసి ముక్కలు చేసి పావు కప్పు నీరు పోసి మిక్సీలో తిప్పాలి. వెడల్పాటి గిన్నెలో తీసుకుని చక్కెర వేసి అది కరిగేదాకా కలిపి క్రీము వేసి మెల్లిగా కలిపి ఫ్రిజ్‌లో పెట్టాలి. అది సగం గడ్డ కట్టాక తీసి మళ్ళీ మిక్సీలో తిప్పి కుల్ఫీ అచ్చులలో పోసి మళ్ళీ ఫ్రిజ్‌లో పెట్టాలి.
కేసర్ కుల్ఫీ

పాలు 1 lit
కండెన్స్డ్ మిల్క్ 1 cup
కోవా 100 gm
మైదా 1 tsp
యాలకులపొడి 3 tsp
కుంకుమ పువ్వు చిటికెడు
సన్నగా తరిగిన బాదాం ముక్కలు
పాలు,కండెన్స్డ్ మిల్క్,మైదా,కోవా యాలకులపొడి కలిపి చిక్కగా అయ్యేవరకు మరిగించాలి.పాలల్లో నానబెట్టిన కుంకుమపువ్వు,బాదాం ముక్కలు కూడా కలిపి కుల్ఫీ అచ్చులో పోస్ రాత్రంతా ఫ్రజ్లో పెట్టి మరునాడు తినాలి.
కుల్ఫీ

పాలు 1 lit
చక్కెర 1 cup
ఏలకులపొడి 3 tsp
సన్నగా తరిగిన జీడిపప్పు,బాదాం 1/4 cup
పాలను యాలకులపొడి వేసి చిక్కగా అయ్యేవరకు మరిగించాలి. చిక్కబడ్డాక జీడిపప్పు, బాదాం ముక్కలు కలిపి ఫ్రిజ్‌లో పెట్టాలి. గంటకోసారి తీసి బాగా కలపాలి లేదా మిక్సీలో వేసి తిప్పి కుల్ఫీ అచ్చులలో పోసి మళ్ళీ ఫ్రిజ్‌లో పట్టి గట్టిడ్డాక వడ్డించాలి.
మట్కా కుల్ఫీ

పాలు1 lit
కోవా లేదా కండెన్స్డ్ మిల్క్1/2 cup
చక్కెర 1 cup
చిన్న ముక్కలు చేసిన జీడిపప్పు,బాదాం,పిస్తా 1/2 cup
చిన్న చిన్న మట్టి కుండలు
ముందుగా పాలను బాగా చిక్కగా అయ్యేవరకు మరిగించాలి. ఇప్పుడు కోవా
లేదా కండెన్స్డ్ మిల్క్ , జీడిపప్పు,బాదాం,పిస్తా ముక్కలు అనీ కలిపి చిక్కగా
అయ్యేవరకు మరిగించి ఏలకుల పొడి కలిపి దింపేయాలి. కాస్త చల్లారాక శుభ్రం
చేసిన చిన్న మట్టి కుండలలో పోసి ఫ్రిజ్‌లో పెట్టాలి. గట్టిపడ్డాక తినొచ్చు.
సేవ్ పూరి

కరకరలాడే చిన్న పూరీలు 10
ఉల్లిపాయ 1
ఉడికించిన బంగాళాదుంపలు 2
పెరుగు 1 cup
చింతపండు చట్నీ 4 tbsp
పుదీనా చట్నీ 4 tbsp
చాట్ మసాలా 4 tsp
జీలకర్ర పొడి 3 tsp
కారం పొడి 2 tsp
ఉపు తగినంత
సన్నని కారప్పూస 1 cup
వెడల్పాటి పళ్ళెంలో పూరీలను పరచి పెట్టాలి. పూరి మధ్యలో రంధ్రం చేసి
ఉడికించిన బంగాళదుంప పొడి కొంచం పెట్టాలి. దానిపై చింతపండు చట్ని,
పుదీనా చట్నీ కొద్ది కొద్దిగా వేయాలి. తరువాత కారం పొడి, జీలకర్ర పొడి,
చాట్ మసాలా పొడులు,ఉప్పు చల్లాలి. చిలికిన పెరుగు అన్ని పూరీలలో పోసి
సన్నగా తరిగిన ఉల్లిపాయలు,కారప్పూస చల్లి కొత్తిమిరతో అలంకరించి
వడ్డించాలి.
భేల్ పూరి

మరమరాలు 2 cups
టొమాటోలు 1/2 cup
ఉల్లిపాయ 1
బంగాళదుంపలు 2
సన్న కారప్పూస 100 gm
చింతపండు చట్నీ 3 tbsp
పుదీనా చట్నీ 2 tsp
నిమ్మరసం 2 tsp
కొత్తిమిర 1/4 cup
కారంపొడి 1 tsp
ఉప్పు తగినంత
ముందుగా ఉల్లిపాయ, టొమాటోలు సన్నగా కోసి పెట్టుకోవాలి. బంగాళదుంపలు ఉడికించి
పొడి చేసి పెట్టుకోవాలి. వెడల్పాటి గిన్నెలో మరమరాలు,తరిగిన ఉల్లిపాయలు,టొమాటోలు,
కొత్తిమిర,చట్నీలు,బంగాళదుంప పొడి నిమ్మరసం,కారం,తగినంత ఉప్పు వేసి బాగా
కలియబెట్టాలి. చివరగా కారప్పూస,కొత్తిమిరతో అలంకరించి వడ్డించాలి.
చింతపండు(స్వీట్ ) చట్నీ
చింతపండు పులుసు 1 కప్పు
ఖర్జూరం 4
బెల్లం నిమ్మకాయంత
జీలకర్ర పొడి 1 tsp
అన్నీ కలిపి చిక్కగా అయ్యేవరకు ఉడికించాలి.
పుదీనా( గ్రీన్) చట్నీ
పుదీనా 1 కప్పు
కొత్తిమిర 1 కప్పు
పచ్చిమిర్చి 2
ఉప్పు తగినంత
అన్నీకలిపి మెత్తగా రుబ్బుకోవాలి. కొద్దిగా కొబ్బరిపొడి,క్రీం కలిపి రుబ్బుకుంటే సాండ్విచ్ కి రాసుకోవచ్చు.
పావ్ బాజీ

పావ్ లు ౧౨
ఉల్లిపాయలు ౨
బంగాళదుంపలు ౪
బఠానీలు 100 gm
బీన్సు 100gm
క్యారట్ 100 gm
క్యాప్సికం 100 gm
కాలిఫ్లవర్ 100 gm
కొత్తిమిర 1/2 cup
కారం పొడి 2 tsp
పావ్ బాజీ మసాలా 4 tbsp
టొమాటోలు 4
పసుపు 1 tsp
ధనియాల పొడి 4 tbsp
జీలకర్ర పొడి 2 tsp
పచ్చిమిరపకాయలు 2
ఉప్పు తగినంత
నిమ్మరసం 4 tsp
నూనె 5 tbsp
వెన్న 50 gm
ముందుగా అన్ని కూరగాయలు(టోమాటోలుతప్ప) చాలా చిన్న ముక్కలుగా కోసి
కొద్దిగా ఉడికించాలి.వెడల్పాటి బాణలిలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు
మెత్తబడేవరకు వేయించాలి. సన్నగా తరిగిన టొమాటోలు,అన్ని మసాలాపొడులు
వేసి నూనె తేలేవరకు నిదానంగా వేయించాలి. తర్వాత ఉడికించి వార్చిన కూరగాయ
ముక్కలు తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టి కొద్దిగా వేపాలి.కప్పుడు నీరు పోసి
మెత్తగా ఉడికించాలి. ఉడికేటప్పుడు గరిటతో కాని , పప్పుగుత్తితోకాని,పొటాటోమాషర్
గాని ఉపయోగించి కలపాలి.అప్పుడు కూరగాయలన్నీ ముద్దలా అవుతాయి.చివరగా
మొత్తం ఉడికాక నిమ్మరసం,కొత్తిమిర, వెన్న కలిపి దింపాలి.
పావ్ లను మధ్యలో కోసి వెన్నతో వేడి పెనంపై కాల్చి ఈ కూరతో వడ్డించాలి.
డబల్ కా మీటా

బ్రెడ్ 8 స్లైసులు
చక్కెర 150 gm
పాలు 1/2 lit
యాలకుల పొడి 2tsp
కుంకుమపువ్వు చిటికెడు
లేదా కేసర్ రంగు
బాదాం5
జీడిపప్పు 5
కిస్మిస్ 5
నెయ్యి బ్రెడ్ స్లైసులు వేయించడానికి
ముందుగా బ్రెడ్ స్లైసులను నాలుగు ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. వాటిని నెయ్యిలో
కాని రిఫైండ్ నూనెలో కాని ఎర్రగా వేయించాలి. పాలు ,చక్కెర, కుంకుమపువ్వు కలిపి
మరిగించి చిక్కగా అయ్యేవరకు ఉంచాలి. బ్రెడ్ ముక్కలను ఒక వెడల్పాటి పళ్ళెంలో పరిచి
వాటిపై ఈ వేడి చిక్కటి పాలు సమనంగా పోయాలి. బ్రెడ్ ముక్కలు పాలన్నీ పీల్చుకుంటాయి.
పైన సన్నగా తరిగిన బాదాం, జీడిపపు, కిస్మిస్ చల్లాలి. ఇది వేడిగా కాని చల్లగా కాని
వడ్డించాలి.
ఖుర్బాని కా మీఠా

ఖుర్బానీలు 100 gm
చక్కెర 150 gm
రాస్పబెర్రి కలర్ 3 చుక్కలు
ముందుగా ఖుర్బానీలను కనీసం ఆరు గంటలు నీళ్ళలో నానబెట్టాలి.
తర్వాత వాటినుండి గింజలను వేరు చేసి అవే నీళ్ళలో మెత్తబడేవరకు
ఉడికించాలి. గరిటతో మెత్తగా మెదపాలి. ఇప్పుడు చక్కెర వేసి మళ్ళీ
ఉడికించాలి. చివరలో కలర్ వేసి బాగా కలిపి దింపేయాలి. దీనిని
చల్లగా ఐస్‌క్రీమ్ గాని కస్టర్ద్ లేదా క్రీమ్ కాని వేసి వడ్డించాలి.















