Featured Posts
మాల్పువా

చిక్కటి పాలు 1 lit
మైదా 1/4 cup
రవ్వ 1/4 cup
నెయ్యి 300 ml
నీరు
చక్కెర 500 gm
ముందుగా రవ్వను పచ్చి వాసన లేకుండా వేయించాలి.చక్కెరలో నీళ్ళు పోసి
తీగపాకం చేసి ఉంచుకోవాలి. పాలను చిక్కబడేవరకు మరిగించాలి. మైదా,
రవ్వ కలిపి ఈ పాలల్లో వీసి ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం
గరిటజారుగా ఉండాలి.వెడల్పాటి బాణలిలో నెయ్యి వేడి చేసి ఈ మిశ్రమంతో చిన్న
సైజు దోసెల్లాగా చేసి రెండువైపులా ఎర్రగా కాల్చి చక్క్ర పాకంలో వేసి నానిన తర్వాత
తీసి పళ్ళెంలో సర్దుకోవాలి.
బ్రెడ్ పెరుగు ఆవడలు

బ్రెడ్ స్లైసులు
పెరుగు
కొత్తిమిర
పచ్చిమిర్చి
ఉప్పు తగినంత
నూనె వేయించడానికి
కారం పొడి
పెరుగును ఉప్పు పచ్చిమిర్చి వేసి బాగా గిలక్కొట్టాలి. బ్రెడ్ స్లైసులను
ఉప్పు నీటిలో ముంచి వెంటనే తీసి గట్టిగా నీరంతా పిండేయాలి.ఆ ముద్దను
వడల్లాగా వత్తుకుని వేడి నూనెలో ఎర్రగా కాల్చుకొని ఈ పెరుగు మిశ్రమంలో
వేసి కొత్తిమిర,కారం పొడివేసి అలంకరించాలి.
బ్రెడ్ టోస్ట్

బ్రెడ్ స్లైసులు 8
గ్రుడ్లు 1
పాలు 1 cup
చక్కెర 1/4 cup
వెన్న్ 50 gm
అరటిపండ్లు 2
పాలు,గ్రుడ్లు,చక్కెర కలిపి బాగా గిలక్కొట్టాలి. పెనంపై
కాస్త వెన్నవేడి చేయాలి. ఒక్కో బ్రెడ్ స్లైసును పాల
మిశ్రమంలో ముంచి రెండు వైపులా వెన్న వేస్తూ ఎర్రగా
కాల్చి తరిగిన అరటిపండు ముక్కలతో వడ్డించాలి.
ఆలూ పరాఠా

బంగాళదుంపలు 3
గోధుమపిండి 3 cups
మైదా 1 cup
జీలకర్ర 1 tsp
కారంపొడి 1 tsp
గరంమసాలా 1/2 tsp
కొత్తిమిర 2 tsp
కరివేపాకు 1 tsp
ఉప్ప 1/2 tsp
నూనె 50 ml
పెరుగు 3 tbsp
పసుపు 1/4 tsp
బంగాళదుంపలను మెత్తగా ఉడికించి పొట్టు తీసి పొడి పొడిగా చేసుకోవాలి. గోధుమపిండిలో
మైదా,కారంపొడి,జీలకర్ర,గరం మసాలా,సన్నగా తరిగిన కరివేపాకు,కొత్తిమిర,పెరుగు ,
బంగాళదుంప పొడి ,పసుపువేసి బాగా కలియబెట్టి తగిన నీరు పోసి చపాతీ పిండిలా కలిపి
అరగంట పక్కనపెట్తుకోవాలి.తర్వాత నిమ్మకాయంత ఉండలు చేసుకొని చపాతీల్లా వత్తి వేడి
పెనంపై నూనెతో రెండు వైపులా ఎర్రగా కాలుచుకోవాలి.
పుదీనా పూరీలు
మైదా 2 cups
గోధుమపిండి 1 cup
పుదీనా 1/4 cup
జీలకర్ర 1 tsp
నిమ్మరసం 1 tsp
పచ్చిమిర్చి 3
ఉప్పు తగినంత
నూనె వేయించడానికి
పుదీనా,జీలకర్ర,నిమ్మరసం,పచ్చిమిర్చి కలిపి ముద్దగ రుబ్బాలి. ఈ ముద్ద
మైదా,గోధుమపిండి,ఉప్పు వేసి తగినన్ని నీళ్ళు పోసి చపాతీ పిండిలా కలిపి
అరగంట నాననివ్వాలి. తర్వాత పూరీల్లా వత్తుకుని వేడి నూనెలో కాల్చుకోవాలి.
వెరైటీ ఉప్మా

ఇడ్లీలు 4
క్యారట్ 100 gm
బీన్స్ 100 gm
బంగాళదుంప 100 gm
క్యాబేజీ 100 gm
ఉల్లిపాయ 1
పచ్చిమిర్చి 3
అల్లం 1 tsp
కరివేపాకు 1 tsp
కొత్తిమిర 3 tsp
యాలకులు 3
లవంగాలు 4
దాల్చినచెక్క 1"
షాజీర 1 tsp
కారంపొడి 1/2 tsp
ఉప్పు తగినంత
నూనె 3 tbsp
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/4 tsp
ఇడ్లీలను , కూరగాయలను చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.కూరగాయ
ముక్కలను నీటిలో వేసి ఉడికించుకోవాలి. ముందుగా వెడల్పాటి ప్యాన్ లో నూనె
వేడి చేసి ఆవాలు,జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు,గరం మసాలా,పచ్చిమిర్చి
అల్లం ముక్కలు వేసి కొద్దిగా వేపాలి. ఆ తర్వాత కూరగాయముక్కలు,కారం పొడి,
ఉప్పు వేసి బాగా కలియబెట్టి కొద్ది సేపు వేపాలి. చివరగా ముక్కలు చేసిన ఇడ్లీలు,
సన్నగా తరిగిన కొత్తిమిర వేసి కలిపి దింపేయాలి.
కొబ్బరి పూరి

మైదా 2 cups
గోధుమ పిండి 1 cup
నూనె 1 tbsp
ఉప్పు 1 tsp
తురిమిన కొబ్బరి 1 cup
సెనగపిండి 1/2 cup
నూనె 2 tbsp
కరివేపాకు 1 tsp
పచ్చిమిర్చి 2
అల్లం 1 tsp
కారం పొడి 1 tsp
జీలకర్ర 1/2 tsp
ఇంగువ చిటికెడు
ఉప్పు తగినంత
ముందుగా మైదా,గోధుమపిండి,నూనె,ఉప్పు కలిపి చపాతీ పిండిలా కలిపి పక్కన
పెట్టుకోవాలి. వెడల్పాటి బాణలిలో నూనె వేడి చేసి అవాలు,కరివేపాకు వేసి వేగాక
సన్నగా తరిగిన పచ్చిమిర్చి,అల్లం ముక్కలు వేయించాలి.ఇప్పుడు తురిమిన కొబ్బరి
సెనగపిండి,కారం,ఉప్పు,వేసి బాగా వేపి కొద్దిగా నీరు పోసి మళ్ళీ కొద్ది సేపు వేపి
దింపేయాలి. చల్లారాక చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.తడిపి పెట్టిన మైదా
గోధుమ పిండిని కూడా కాస్త పెద్ద ఉండలుగా చేయాలి. ఒక్క పిండి ముద్ద చేతితో
వెడల్పుగా చేసి అందులో కొబ్బరి ఉండ పెట్టి మూసేసి పూరీల్లా చేసుకుని వేడి నూనెలో
కాల్చాలి.
అరటిపండు దోసె

మైదా 250 gm
అరటిపండ్లు 4
గ్రుడ్డు 1
యాలకుల పొడి 1 tsp
వంట సోడా pinch
పాలు1 1/2 cup
నూనె లేదా నెయ్యి 50 ml
చక్కెర 75 gm
గ్రుడ్డు,అరటిపండ్లు,పాలు, చక్కెర కలిపి మిక్సర్లో తిప్పాలి. ఇది ఒక గిన్నెలో
తీసుకుని మైదా,యాలకులపొడి,వంటసోడా వేసి బాగా కలపాలి. వేడి పెనంపై
దోసెలు పోసుకుని వేడిగా జామ్తో వడ్డించాలి.
మెంతి పకోడి

సెనగపిండి 1 cup
బియ్యప్పిండి 3 tbsp
ఉప్పు తగినంత
జీడిపప్పు 5
మెంతి ఆకులు 1/2 cup
నెయ్యి 1 tsp
వంట సోడా చిటికెడు
కొత్తిమిర 3 tsp
కారం 1/2 tsp
అల్లం 1 tsp
జీలకర్ర 1 tsp
పచ్చిమిర్చి 3
ఉల్లిపాయ 1
నూనె వేయించడానికి
ఓ గిన్నెలో సెనగపిండి,బియ్యప్పిండి, ఉప్పు, కారం,జీడిపప్పు,కొత్తిమిర,ఉల్లిముక్కలు,నెయ్యి,వంటసోడా వేసి బాగా కలియబెట్టి పక్కన ఉంచాలి. అల్లం, పచ్చిమిర్చి,జీలకర్ర మెత్తగా రుబ్బి ఈ మిశ్రమంలో కలపాలి.తర్వాత మెంతి ఆకులను కూడా వేసి తగినన్ని నీళ్ళు పోసి పకోడీల పిండిలా కలిపి వేడి నూనెలో పకోడీలు వేసి ఎర్రగా కాల్చి తీసుకోవాలి.
వెల్లుల్లి ఊరగాయ

వెల్లుల్లి రెబ్బలు 2 cups
ఉప్పు 1/2 cup
కారం 1/4 cup
మెంతిపొడి 3 tsp
ఆవపొడి 1/4 cup
జీలకర్ర 1 tsp
ఇంగువ చిటికెడు
పసుపు 1 tsp
నిమ్మరసం 3 tbsp
నూనె
వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి శుభ్రం చేసి కాగిన నూనెలో మగ్గ బెట్టాలి. దింపి చల్లారాక
పైన చెప్పిన పదార్థాలన్నీ వేసి బాగా కలియబెట్టాలి. బాణలిలో మిగిలిన నూనె వేడి చేసి
ఇంగువ,ఆవాలు,జీలకర్ర వేసి తాళింపు పెట్టి జాడీలో పెట్టుకోవాలి. ౩ నెలలు నిలువ
ఉంటుంది.
మామిడి కాయ చారు
పచ్చి మామిడికాయ 1
ఎండు మిరపకాయలు 3
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/4 tsp
ఇంగువ చిటికెడు
పసుపు చిటికెడు
ఉప్పు తగినంత
కరివేపాకు 1 tsp
కొత్తిమిర 2 tsp
చక్కెర 1 tsp
నూనె 3 tsp
పచ్చి మామిడికాయను ముక్కలుగా కోసి ఉడికించి గుజ్జు తీసుకోవాలి.ఇందులో కావల్సినంత
నీరు కలపాలి. బాణలిలో నూనె వేడి చేసి ఇంగువ వేసి, ఎందుమిరపకాయలు,ఆవాలు,
జీలకర్ర వేసి వేగాక మామిడి గుజ్జు కలిపిన నీరు పొసి అందులో పసుపు,ఉప్పు,కరివేపాకు,
కొత్తిమిర,చక్కెర వేసి బాగా మరిగించి దింపేయాలి.
కొత్తిమిర రసం
కొత్తిమిర ముద్దకు కావాల్సింది:
కొత్తిమిర 1 cup
పచ్చి శనగపప్పు 2 tsp
జీలకర్ర 1/2 tsp
టమోటాలు 2
వెల్లుల్లి రెబ్బలు 5
నూనె 3 tsp
ఎండు మిరపకాయలు 4
పసుపు చిటికెడు
ఇంగువ చిటికెడు
ధనియాల పొడి
ఆవాలు 1/4 tsp
బాణలిలో కొద్దిగా నూనె వేసి కొత్తిమిర ఆకులు,శనగపప్పు,ధనియాలు వేసి కొద్దిగా
వేపి చల్లారిన తర్వాత ముద్దగా రుబ్బుకోవాలి.బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు
ఎండుమిరపకాయలు,జీలకర్ర,ఇంగువ వేసి అవి వేగాక తరిగిన టొమాటోలు వేసి
మగ్గనివ్వాలి. రుబ్బిపెట్టుకున్న ముద్దలో కావల్సినంత నీరు పోసి కలిపి ఇందులో
పోసి మరగనివ్వాలి
ఉల్లి రసం
సాంబారు ఉల్లిపాయలు 6 - 8
చింతపండు గుజ్జు 100 gm
నీరు 3 cups
ధనియాల పొడి 1 tbsp
కొత్తిమిర 2 tsp
కరివేపాకు 1 tsp
ఉప్పు తగినంత
వెల్లుల్లి రెబ్బలు 5
చక్కెర 1 tsp
జీలకర్ర 1/4 tsp
ఆవాలు 1/4 tsp
ఎండు మిరపకాయలు 4
నూనె 3 tsp
చింతపండు గుజ్జులో కావలసినంత నీరు కలిపి కొద్ది సేపు నాననిచ్చి కావలసినంత
నీరు పోసి రసం తీసి పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి ఎండు మిర్చి
ఆవాలు,జీలకర్ర,కరివేపాకు వేసి కొద్దిగా వేపి చింతపండు నీరు,పసుపు,ఉప్పు,
ధనియాల పొడి,వెల్లుల్లి రెబ్బలు వేసి మరుగించాలి .ఐదు నిమిషాల తర్వాత
కొత్తిమిర,చక్కెర వేసి దింపేయాలి.
టొమాటో రసం
టొమాటోలు 250 gm
ఎండుమిరపకాయలు 3
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/4 tsp
వెల్లుల్లి రెబ్బలు 5
ధనియాల పొడి 1 tsp
కరివేపాకు 1 tsp
కొత్తిమిర 2 tsp
పసుపు pinch
చక్కెర్ 1 tsp
ఉప్పు as required
నూనె 3 tsp
ఇంగువ pinch
ముందుగా టొమాటోలను మూడు గ్లాసుల నీరు పోసి ఉడికించాలి. తర్వాత టొమాటోలు
అదే నీటిలో మెత్తగా పిసికేసి రసం వడకట్టి ఉంచుకోవాలి.బాణలిలో నూనె వేడి చేసి ఇంగువ
ఎండు మిరపకాయలు,ఆవాలు,జీలకర్ర వేసి కాస్త వేగాక టొమాటో రసాన్ని వేయాలి.ఇప్పుడు
పసుపు,ఉప్పు,ధనియాలపొడి, కొత్తిమిర వేసి మరిగించాలి. కొద్దిగా చక్కెర కూడా వేయాలి.
అనాస రసం
అనాసపండు ముక్కలు 100 gm
కొత్తిమిర 2 tsp
ఎండు మిరపకాయలు 3
వెల్లుల్లి రెబ్బలు 5
పచ్చిమిరపకాయలు 3
నూనె 3 tsp
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/4 tsp
ధనియాల్ పొడి 2 tsp
టమోటాలు 2
పసుపు చిటికెడు
ఇంగువ చిటికెడు
ఉప్పు తగినంత
ముందుగా అనాస ముక్కలను సగం తీసుకొని ముద్దగా రుబ్బి పెట్టుకోవాలి.
బాణలిలో నూనె వేడి చేసి ఎండుమిరపకాయలు,ఆవాలు,జీలకర్ర,ఇంగువ
వేసి కాస్త వేగాక కరివేపాకు,తరిగిన టమోటా ముక్కలు, రుబ్బిన అనాస
ముద్ద వేసి మరి కొద్ది సేపు వేగనివ్వాలి. తర్వాత మూడు కప్పుల నీరు పోసి
మరగనివ్వాలి.మరుగుతుండగా ఉప్పు,పసుపు,కొత్తిమిర,ధనియాల పొడి
మిగిలిన అనాస ముక్కలు వేసి మరో ఐదు నిమిషాలు ఉంచి దింపేయాలి.
మెంతి రసం
చింతపండు రసం 100 ml
పప్పు కట్టు(పప్పు ఉడికించిన నీళ్ళు)3 cups
ఎండు మిరపకాయలు 3
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/4 tsp
మెంతులు 1/2 tsp
వెల్లుల్లి రెబ్బలు 5
ఉప్పు తగినంత
ఇంగువ చిటికెడు
పసుపు చిటికెడు
కొత్తిమిర 2 tsp
కరివేపాకు 1 tsp
రసం పొడికి కావల్సినవి:
ఎండు మిరపకాయలు
ధనియాలు
మిరియాలు
ముందుగా రసం పొడి చేసుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి ఎండు మిరపకాయలు,
ఆవాలు,జీలకర్ర, మెంతులు,ఇంగువ, వెల్లుల్లి వేసి కాస్త వేగాక పప్పుకట్టు,
చింతపండు రసం వేసి మరగనివ్వాలి. మరుగుతున్నప్పుడు కరివేపాకు,కొత్తిమిర,
ఉప్పు,పసుపు, రసం పొడి వేసి మరి కొద్ది సేపు మరిగించి దింపేయాలి.
టమాట రసం
టమోటాలు 200 gm
చింతపండు 50 gm
పచ్చిమిరపకాయలు 2
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/2 tsp
పసుపు చిటికెడు
ఇంగువ చిటికెడు
ధనియాలు 2 tsp
చక్కెర 1 tsp
ఉప్పు తగినంత
వెల్లుల్లి రెబ్బలు 5
మిరియాలు 6
ముందుగా సగంజీలకర్ర, మిరియాలు,ధనియాలు కలిపి పొడి చేసుకోవాలి. చింతపండు
రసం తీసుకోవాలి.బాణలిలో నూనె వేడి చేసి ఇంగువ వేసి ఎండుమిరపకాయలు,ఆవాలు,
జీలకర్ర, కరివేపాకు వేసి వేగాక తరిగిన టొమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఉప్పు,
పసుపు,కారం వేయాలి. తర్వాత చింతపండు రసం వేయాలి. కావాలంటే నీళ్ళు పోయాలి.
మరుగుతున్నప్పుడు పొడి చేసుకున్న మసాలా,చితగ్గొట్టిన వెల్లుల్లి రెబ్బలు,కొత్తిమిర,చక్కెర
వేసి మరి కొద్దిసేపు మరిగించి దింపేయాలి.
పచ్చి ఉల్లి రసం
చిక్కటి చింతపండు రసం 50 gm
నీళ్ళు 3 cups
ఉల్లిపాయలు 1
ఎండుమిరపకాయలు 3
ఇంగువ pinch
ఉప్పు తగినంత
కారం పొడి 1/4 tsp
కరివేపాకు 1 tsp
కొత్తిమిర 2 tsp
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/4 tsp
చక్కెర 1 tsp
చింతపండు గుజ్జులో కావలసిన పరిమాణంలో నీరు పోసి రసం తయారు చేసుకోవాలి.
ఇందులోనే కారం,పసుపు,ఉల్లిపాయ ముక్కలు,ఉప్పు వేయాలి.బాణలిలో నూనె
వేడి చేసి ఆవాలు,జీలకర్ర , ఎండుమిరపకాయలు, ఇంగువ వేసి చిటపటలాడాక
కరివేపాకు,చింతపండు నీళ్ళు పోయాలి. మరుగుతుండగా కొత్తిమిర,చక్కెర వేయాలి.
ఐదు నిమిషాలు మరిగాక దింపేయాలి.
నిమ్మ రసం
నిమ్మ రసం 1/4 cup
బెల్లం 1 tsp
పచ్చిమిరపకాయలు 3
నూనె 2 tsp
ఆవాలు 1/2 tsp
జీలకర్ర 1/2 tsp
ఎండు మిరపకాయలు 2
కరివేపాకు, కొత్తిమిర
పసుపు చిటికెడు
ఉప్పు తగినంత
పప్పు ఉడికించిన నీరు 3 కప్పులు
ఇంగువ చిటికెడు
బాణలి నూనె వేడి చేసి ఎండుమిరపకాయలు,పచ్చిమిరపకాయ ముక్కలు,ఆవాలు, జీలకర్ర, ఇంగువ,కరివేపాకు వేసి చిటపటలాడాక పప్పు నీరు, నిమ్మ రసం,పసుపు,ఉప్పు,బెల్లం,కొత్తిమిర వేసి ఐదు నిమిషాలు మరిగించి దింపేయాలి. ఎక్కువసేపు మరిగితే రుచి పోతుంది.















