Featured Posts
సెనగల సలాడ్
సెనగలు రెండు కప్పులు
బంగాళదుంపలు 2
ఉల్లిపాయలు 2
టమాట 1
నిమ్మకాయ 1
పచ్చిమిర్చి 1
కొత్తిమిర 1 tsp
గరం మసాలా 1/2 tsp
సెనగలని నానబెట్టాలి. బంగాళదుంప ముక్కలను,సెనగలను కుక్కర్లో ఉడికించాలి. నీరంతా వడకట్టి ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమిర, నిమ్మరసం, గరం మసాలా, ఉప్పు వేసి కలపాలి. కావాలంటే తాలింపు వేసుకోవచ్చు. ఇష్టమైతే కొంచెం కొబ్బరి, పంచదార కలుపుకోవచ్చు. ఇదే విధంగా నానబెట్టి ఉడికించిన బొబ్బర్లతోనూ, పెసర్లతోనూ,వేరుశనగపప్పులతోనూ సలాడ్ చేసుకోవచ్చు.
వెజిటబుల్ ఫ్రూట్ సలాడ్
క్యాబేజిముక్కలు 2 tsp
క్యారట్ ముక్కలు 2 tbsp
కీరా ముక్కలు 2 tbsp
బీట్రూట్ ముక్కలు 2 tbsp
నిమ్మచెక్క సగం
తేనె 2 tsp
దానిమ్మగింజలు 2 tbsp
ఆపిల్ ముక్కలు 2 tbsp
జామ ముక్కలు 2 tbsp
అనాసముక్కలు 2 tbsp
కూరగాయలు, పళ్ళు అన్నీ కలిపి తేనే , నిమ్మరసం వేసి మొత్తం కలియబెట్టి చల్లగా తీసుకోవాలి. ఇందులో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి.
బీన్స్ సలాడ్
మొలకెత్తిన బీన్స్ 300 gms
వెల్లుల్లి రెబ్బ 1
సోయాసాస్ 1/2 tsp
నువ్వుల నూనె 1/2 tsp
వేయించిన నువ్వులు 1 tsp
క్యాప్సికం తరుగు 1/4 కప్పు
ఉల్లికాడల తరుగు 1/4 కప్పు
వెనిగర్ 1/2 tsp
చక్కెర 1 tsp
మొలకెత్తిన బీన్స్ బాగా కడిగి నీరులేకుండా జల్లెడలో వడకట్టాలి. పైన చెప్పిన దినుసులన్నీ వేసి బగా కలపాలి. పదినిమిషాలు ఆగి వడ్డించాలి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. సోయాసాస్ ఇష్టం లేకుంటే టమాటా సాస్ వేయొచ్చు.
క్యారెట్ రైతా
పెరుగు 250 gms
క్యారెట్ తురుము 1/2 కప్పు
ఆవాలు 1/4 tsp
నూనె 1 tsp
ఉప్పు తగినంత
సన్నగా తరిగిన పచ్చిమిర్చి 1
టొమాటో 2
టొమాటోలను సన్నని ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ప్యాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు వేసి చిటపటలాడగానే క్యారెట్ తురుము, ఉప్పు వేసి క్యారెట్ మెత్తబడేవరకు వేయించి దింపేయాలి. పెరుగు, టొమాటో ముక్కలు ఇందులో కలిపి అన్ని బాగా కలిసేలా తిప్పి కొత్తిమిరతో అలంకరించి వడ్డించాలి.
ఆకు కూర రైతా
తోటకూర 30 gms
చుక్కకూర 30 gms
కొత్తిమిర 30 gms
పచ్చికొబ్బరి తురుము 20 gms
అల్లం తురుము 1 tsp
పెరుగు 200 gms
నిమ్మరసం 1 tsp
సొరకాయ తురుము 10 gms
కేబేజీ తురుము 10 gms
బెంగులూరు టొమాటో 1
ఉప్పు తగినంత
టొమాటో,ఆకుకూరలన్ని కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి.వీటితో పాటు కొత్తిమిర,పచ్చికొబ్బరి తురుము,అల్లం తురుము, నిమ్మరసం, సొరకాయ, క్యాబేజీ తురుము, అన్ని బాగా కలిపి చిలికిన పెరుగు, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఆరోగ్యానికి మేలు చేకూర్చే ఆకు కూర రైతాను అన్నంతో కలిపి వడ్డించుకోవచ్చు.
కీర దోసకాయ రైతా
తురిమిన కీర 1 కప్పు
పెరుగు 1 1/2 కప్పు
వేయించిన గసగసాలు 1/2 tsp
ఉప్పు తగినంత
మిరియాలపొడి చిటికెడు
సన్నగా తరిగిన కొత్తిమిర 1 tsp
పెరుగు బాగా చిలికి దానిలో ఉప్పు, మిరియాలపొడి,గసగసాలు, తురిమిన కీరా కలిపి కొత్తిమిరతో అలంకరించి చల్లగా వడ్డించండి.
ముల్లంగి రైతా
పెరుగు 200 gms
చిన్న ముల్లంగి 1
పచ్చిమిర్చి 1
కొత్తిమిర 1 tsp
చక్కెర 1/2 tsp
ఉప్పు తగినంత
మిరియాలపొడి 1/4 tsp
సన్నగా తరిగిన పుదీనా ఆకులు 5
ముందుగా పెరుగు బాగా చిలికి ఉప్పు, చక్కెర వేసి కలపాలి. ముల్లంగి తొక్కు తీసి తురమాలి. మిక్సీలో వేసి రసం తీసి పెట్టుకోవాలి. ముల్లంగి రసంలో ఉప్పు, మిరియాలపొడి, కొత్తిమిర, పచ్చిమిర్చి ముక్కలు, పెరుగు అన్నీ బాగా కలియబెట్టాలి.పుదీనా ఆకులతో అలంకరించి చల్లగా సర్వ్ చేయాలి.
ఉల్లిపాయ టొమాటో రైతా
పెరుగు 500 gms
సన్నగా తరిగిన టొమాటో ముక్కలు 1 కప్పు
ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు
కారం పొడి 1/4 tsp
గసగసాలు పొడి 1/2 త్స్ప్
సన్నగా తరిగిన కొత్తిమిర 2 tsp
ఉప్పు తగినంత
మిరియాల పొడి 1/4 tsp
పెరుగు బాగా చిలికి ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిర్చి ముక్కలు ,కొత్తిమిర,కారం, గసగసాల పొడి,ఉప్పు,మిరియాలపొడి వేసి బాగా కలపాలి. చల్లగా సర్వ్ చేయాలి.
కాలిఫ్లవర్ రైతా
కాలీఫ్లవర్ 200 gms
పచ్చిమిర్చి 1
పెరుగు 250 gms
ఉప్పు తగినంత
మిరియాలపొడి 1/4 tsp
గసగసాలు 1/2 tsp
కారం పొడి 1/2 tsp
పోపు గింజలు 1/4 tsp
నూనె 1 tbsp
ముందుగా పెరుగు బాగా చిలకాలి. కాలీఫ్లవర్ని మెత్తగా ఉడకబెట్టాలి. చల్లారిన తర్వాత పెరుగులో వేసి కలపాలి. బాణలిలో నూనె వేడి చేసి పోపు గింజలు వేసి చిటపటలాడాక పచ్చిమిరపకాయల ముక్కలు, గసగసాలు, ఉప్పు, మిరియాలపొడి, కారం పొడి వేసి కలపాలి. దింపేసిన తర్వాత పెరుగు,కాలీఫ్లవర్ మిశ్రమం కూడా వేసి బాగా కలిపి చల్లగా వడ్డించాలి.
పెండలం రైతా
పెరుగు 500 gms
పెండలం 200 gms
ఉప్పు తగినంత
చక్కెర 1 tsp
కిస్మిస్లు 1 tsp
పచ్చిమిర్చి,అల్లం ముక్కలు 1 tsp
పెండలాన్ని ఉడికించి మెత్తగా మెదపాలి. పెరుగులో ఉప్పు,పంచదార,మెదిపిన పెండలం వేసి బాగా కలపాలి. వేయించిన జీలకర్రపొడి,కిస్మిస్లు కొత్తిమిర ఆకులతో అలంకరించి వడ్డించాలి.
బెండ రైతా
బెండకాయలు 5
పెరుగు 200 gms
కారం 1/4 tsp
వేయించిన జీలకర్ర పొడి 1/4 tsp
కొత్తిమిర 1 tsp
ఉప్పు తగినంత
బెండకాయ చివర్లు తీసేసి అంగుళం ముక్కలుగా కోసుకోవాలి. వీటిని నూనె ఎర్రగా వేయించి పేపర్ మీద వేయాలి నూనె అంతా పీల్చుకోడానికి. పెరుగు చిలికి కారం,జీలకర్ర పొడి, ఉప్పు కలిపి బెండముక్కలు కూడ కలిపి కొత్తిమిర చల్లి వడ్డించాలి
క్యారెట్ పెరుగు పచ్చడి
క్యారెట్లు 2
పెరుగు 250 gms
ఉప్పు తగినంత
పోపు సామాన్లు 1/2 tsp
పచ్చిమిర్చి 1
తరిగిన కొత్తిమిర 1 tsp
పసుపు చిటికెడు
నూనె 1 tsp
క్యారెట్లు కడిగి తోలు తీసి తురిమి, తగినంత ఉప్పు కొత్తిమిర,సన్నగా తరిగిన పచ్చిమిర్చి కలిపి పెరుగులో కలపాలి. నూనె వేడి చేసి పోపు సామాన్లు వేసి చిటపటలాడాక ఇందులో కలపాలి. కళ్ళకు మంచిది. రుచిలోకూడా బాగుంటుంది.
కొబ్బరి పెరుగు పచ్చడి
పెరుగు 1/2 kg
పచ్చి కొబ్బరి కోరు 100 gms
ఉప్పు తగినంత
తాలింపు సామాను 1 tsp
కరివేపాకు 2 రెబ్బలు
కొత్తిమిర 2 tbsp
పచ్చిమిర్చి 2
నూనె 1 tsp
ముందుగా కొబ్బరికోరు, ఉప్పు, పెరుగు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి కలిపి పెట్టుకోవాలి. పెరుగు గట్టిగా ఉంటే బాగుంటుంది. బాణలిలో నూనె వేడి చేసి తాలింపు పెట్టుకుని కరివేపాకు కూడ వేసి పచ్చడికి చేర్చాలి. సన్నగా తరిగిన కొత్తిమిర కలిపి వడ్డించాలి. ఇది అన్నంలోకి, రొట్టెలలోకి కూడా బాగుంటుంది
రాగులతో శిశు ఆహారం
రాగులు 60 gms
వేయించిన పెసరపప్పు 15 gms
వేయించిన నువ్వులు 5 gms
వెన్న తీసిన పాలపొడి 15 gms
వేరుశనగపప్పు 10 gms
రాగులను ఒక రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయం వాటిని పళ్ళెంలో ఆరబెట్టి తడిగుడ్ద కప్పి ఒక రోజంతా అలాగే ఉంచాలి. మరుసటిరోజుకి రాగులు మొలకెత్తుతాయి. మొలకెత్తిన రాగులను ఎండబెట్టాలి. ఎండాక దోరగా వేయించి పొడి చేయాలి. ఇతర దినుసులను కూడా విడివిడిగా పొడికొట్టి పాలపొడిలో కలిపి గాలి చొరరాని డబాలలో నిల్వ చేసుకోవాలి. పిల్లలకి తినిపించేటప్పుడు పొడికి 100 ml పాలు కలిపి తినిపించవచ్చు.
రాగితో తీపి బిస్కెట్లు
రాగిపిండి 250 gms
చక్కెర 150 gms
వెన్న 30 gms
బేకింగ్ పౌడర్ 1 tsp
సెనగపిండి 50 gms
వెనీల్లా ఎస్సెన్స్ 1/4 tsp
సెనగపిండిని ఒక స్పూను నేతిలో దోరగా వేయించి, రాగిపిండి, బేకింగ్ పౌడర్ కలిపి మూడు సార్లు జల్లించుకోవాలి. పిండిలో కరిగించిన వెన్న కలపాలి. దీనికి పొడి చెసిన చక్కెర కలిపి బాగా కలియబెట్టాలి. దీనిలో ఎస్సెన్స్ కూడ వేసి కలిపి ముద్దగా చెయాలి. దీనిని మృదువుగా అయ్యేలా మర్ధించి 1/8 అంగుళం మందంగా కర్రతో చప్పాతీలా వత్తుకుని బిస్కెట్ కట్టర్‌తో కోసి 350 డిగ్రీల ఫారన్‌హీట్ ఉష్ణోగ్రతలో పది నిమిషాలు బేక్ చేయాలి.
రాగి లడ్డు
రాగిపిండి 200 gms
బెల్లం 150 gms
నెయ్యి 50 gms
యాలకుల పొడి 1 tsp
రాగిపిండిని సగం నెయ్యి వేసి దోరగా వేయించాలి. బెల్లంలో తగినన్ని నీళ్ళు పోసి తీగ పాకం పట్టాలి. రాగిపిండిని యాలకుల పొడిని వేసి ఉండలు కట్టకుండా కలపాలి. కరిగించిన వేడి నెయ్యి కూడా పోసి కలిపి లడ్డూలు చేయాలి.వేయించిన వేరుశనగపప్పు, జీడిపప్పు, నువ్వులు కలిపితే ఇంకా రుచిగా ఉంటాయి.
రాగి దోసెలు
రాగిపిండి 100 gms
ఉప్పు తగినంత
మినప్పప్పు 50 gms
నూనె 5 tbsp
మినప్పప్పు కనీసం నాలుగు గంటలు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బిన పిండిలో రాగిపిండి, ఉప్పు వేసి కలిపి ఒక రాత్రి లేక కనీసం ఎనిమిది గంటలు పులవనివ్వాలి. మర్నాడు పిండిని బాగా కలియబెట్టి పెనం కాలిన తర్వాత దోసె పోయాలి. తగినంత నూనె వేస్తూ దోసె రెండువైపులా దోరగా కాలనివ్వాలి.
రాగి తీపి దోసెలు
రాగిపిండి 250 gms
బెల్లం 150 gms
కొబ్బరి చిన్న ముక్క
వేరుశనగపప్పు 50 gms
నూనె 1 త్స్ప్
ఒక గ్లాసు నీటిలో బెల్లం కరిగించాలి.వేరుశెనగపప్పును వేయించి పొడి చేసుకుని, కొబ్బరితో కలిపి ఉంచుకోవాలి. కరిగిన బెల్లంలో రాగిపిండి వేసి దోసెలపిండిలాగా కలపాలి. పెనం కాలిన తర్వాత దోసె పోసి నూనె వేసి కాలనివ్వాలి. రెండవ వైపు కూడా కాలిన తర్వాత మధ్యలో ఒక స్పూను తురిమిన కొబ్బరి, వేరుశెనగపప్పు పొడి కలిపి మడతపెట్టాలి. వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.
రాగి అట్టు
రాగిపిండి 100 gms
వేరుశనగపప్పు 20 gms
సెనగపప్పు 10 gms
పచ్చిమిర్చి 2
నూనె ఒక చెంచా
వేరుశనగపప్పు వేయించి పొడి చేసుకోవాలి. సెనగపప్పును ముందుగా నానబెట్టాలి. రాగిపిండిలో ఉల్లి,పచ్చిమిర్చి ముక్కలు,సెనగపప్పు, వేరుశనగపప్పు పొడి తగినంత ఉప్పు వేసి గోరువెచ్చని నీటితో గత్త్జిగా ముద్దలా కలపాలి. ఈ ముద్దను చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండను చేతితో గుండ్రంగా వత్తుతూ రొట్టెల్లా చేయాలి. కాలిన పెనం పై నూనె రాసి ఈ రొట్టెను నిదానంగా కొద్దిగా నూనె వేస్తూ రెండు వైపులా ఎర్రగా కాల్చాలి.
రాగి అంబలి
రాగిపిండి 25 gms
నీరు 2 గ్లాసులు
ఉప్పు తగినంత
రాగిపిండిని కొద్దిగా గోరువెచ్చని నీటిలో ఉండలు లేకుండా కలపాలి. బియ్యం గంజితో కొంత నీరు మరగనివ్వాలి. తర్వాత రాగిపిండి,ఉప్పు వేసి చిక్కబడేవరకు ఉడికించాలి. చల్లబడినాక తాగితే బాగుంటుంది. అవసరమైతే కొక్ద్దిగా నీరు లేక మజ్జిగ కలుపుకోవచ్చు.
రాగి సంకటి
రాగిపిండి 100 gms
నీరు 2 గ్లాసులు
ఉప్పు తగినంత
నీరు బాగా మ్రిగిన తర్వాత ఉప్పు, రాగిపిండి వేసి కలిపి ఉడకనివ్వాలి. గట్టిపడకముందే ఉండలుగా చేయాలి.
రిబ్బన్ పకోడి
సెనగపిండి 400 gms
బియ్యప్పిండి 100 gms
కొత్తిమిర 4 కట్టలు
పచ్చిమిర్చి 2
ఉప్పు తగినంత
జీలకర్రపొడి 1 tsp
కారం 1 tsp
నెయ్యి 50 gms
నూనె వేయించడానికి
సెనగపిండి బియ్యప్పిండి కలిపి జల్లించండి. ఇందులో ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమిర, పచ్చిమిర్చి,జీలకర్ర పొడి, కారం కలపండి. పిమ్మట వేడి చేసిన నెయ్యిని పిండిలో పోసి బాగా కలపండి. తర్వాత తగు మాత్రం నీళ్ళు పోసి గట్టి ముద్దలా చేయండి. జంతికల గొట్టంలొ రిబ్బన్ ఆకారంలో ఉండే అచ్చును ఉంచి , ముందుగా కలిపిన పిండిని పెట్టి వేడి నూనెలో వత్తి ఎర్రగా వేయించాలి., నోరూరించే రిబ్బన్ పకోడి రెడీ.
జంతికలు
పెసల పొడి 500 gms
బియ్యం పిండి 700 gms
ఉప్పు తగినంత
కారం 2 tsp
నెయ్యి 150 gms
నూనె వెయించడానికి
వాము 2 tsp
పెసర పొడి, బియ్యంపిండిలో తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇందులో కారం, వాము నెయ్యి చేర్చి కలిపి కొద్ది కొద్దిగా నీరు కలుపుతూ చక్రాల పిండిలా మరీ మెత్తగాగాక మరీ గట్టిగా కాక మధ్యస్థంగా కలుపుకోవాలి. ఈ పిండి ముద్దను తడి బట్టలో చుట్టి ఓ గంట సేపు పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె మరిగించి చక్రాల గిద్దతో పిండిని చక్రాల్లా వత్తుకుని దోరగా వేయించి పెట్టుకోవాలి. ఇవి వారం రోజులు నిలవ ఉంటాయి.
గుమ్మడికాయ పులుసు
గుమ్మడికాయ 250 gms
ఉల్లిపాయలు 2
పచ్చిమిర్చి 2
బెల్లం 50 gms
కారం 1 tsp
ఉప్పు తగినంత
పస్పు చిటికెడు
ఇంగువ చిటికెడు
ధనియాలు 1 tsp
మెంతులు 1/2 tsp
పోపు గింజలు 1 tsp
ఎండుమిర్చి 2
నూనె 2 tsp
కరివేపాకు 1 రెబ్బ
కొత్తిమిర 1 కట్ట
శనగపిండి 2 tbsp
చింతపండు పెద్ద నిమ్మకాయంత
గుమ్మడికాయ చెక్కు తీసి బాగా పెద్ద ముక్కలు తరగాలి.ఉల్లి, పచ్చిమిర్చి,తరిగి అందులో వేసి కాసిన్ని నీళ్ళు పోసి ఉడకబెట్టాలి. చింతపండు కడిగి నానబెట్టి పులుసు తీసి ఉడికిన గుమ్మడి ముక్కలలో పోయాలి. కారం, బెల్లం, పసుపు , ఉప్పు కూడా వేయాలి. ధనియాలు, ఇంగువ, మెంతులు కలిపి ఎర్రగా వేయించి పొడి చేసి పులుసులో వేయాలి.ఈ పొడి వేసినందువల్ల పులుసు రుచి ఎక్కువగా ఉంటుంది. పులుసు బాగా ఉడికిన తర్వాత శనగపిండి కొద్దిగా నీళ్ళలో కలిపి పులుసులో పోస్తూ ఉండలు కట్టకుండా కలపాలి.కాసేపు ఉడికిన తర్వాత దింపి పోపు పెట్టాలి. కరివేపాకు, కొత్తిమిర కూడా కలపాలి. ఈ ధప్పళాన్ని చేసి, చూసి తింటే తెలుస్తుంది దీని రుచి అమోఘం.
పిండి మిరియం
గుమ్మడికాయ 250 gms
పచ్చిమిర్చి 6
మిరియాలు 1 tsp
జీలకర్ర 1/2 tsp
శనగపప్పు 2 tsp
తాలింపు గింజలు 1/2 tsp
నూనె 3 tsp
అల్లం చిన్న ముక్క
తురిమిన కొబ్బరి 3 tbsp
ధనియాలు 1 tsp
ఇంగువ చిటికెడు
బియ్యం 2 tbsp
ఎండుమిర్చి 2
పసుపు చిటికెడు
కరివేపాకు 2 రెబ్బలు
ఉప్పు తగినంత
గుమ్మడికాయ చెక్కు తీసి కొద్దిగా సన్నని ముక్కలుగా తరిగి కాసిన్ని నీళ్ళు పోసి ఉడికించాలి. ఉప్పు, పసుపు, కారం వేయాలి. ధనియాలు, ఇంగువ,మిరియాలు, జీలకర్ర కలిపి కొద్దిసేపు వేయించి పొడి చేసి ఉడికే గుమ్మడి ముక్కలలో వేయాలి. ముందుగానే శనగపప్పు,బియ్యం కొద్దిసేపు నానబెట్టి రుబ్బి గరిట జారుగా చేసుకుని గుమ్మడి ముక్కలలో వేయాలి. బాగా ఉడికిన తర్వాత దించి పోపు పెట్టాలి. కరివేపాకు ,కొత్తిమిర,కొబ్బరి పొడి వేసి బాగా కలపాలి. ఈ పిండి మిరియం ఘుమఘుమలాడుతూ రుచిగా ఉంటుంది.వేడిమీదనే తింటే బావుంటుంది.
తియ్య ఎర్ర గుమ్మడికూర
ఎర్ర గుమ్మడికాయ 500 gms
ఉల్లిపాయలు 200 gms
పచ్చిమిర్చి 4
కరివేపాకు 2 రెబ్బలు
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/4 tsp
కారం 1/2 tsp
పసుపు చిటికెడు
గరం మసాలా 1/4 tsp
ఉప్పు తగినంత
నూనె 50 gms
గుమ్మడికాయ చెక్కు తీసి చిన్న చిన్నముక్కలుగా తరిగి మెత్తగా ఉడికించాలి. ఒక గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి, అవి వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు వేసి అవి మెత్తబడేవరకు వేయించండి. ఆపైన కారం కూడ వేసి కొద్దిగా వేపాలి. ఇందులో ఉడికించిన గుమ్మడికాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలిపి మూతపెట్టి కాసేపు ఉంచాలి. దించే ముందు గరం మసాల పొడి చల్ల్లాలి. కూర రెడీ.
నువ్వుల అరిసెలు
బియ్యం 150 gms
బెల్లం 100 gms
నువ్వులు 20 gms
నూనె వేయించడానికి
మజ్జిగ అరకప్పు
బియ్యం కడిగి రెండు రోజులపాటు నానబెట్టండి. మధ్యలో ఒకసారి నీళ్ళు మార్చండి. రెండో రోజు నీళ్ళు వార్చి బియ్యాన్ని అరగంట సేపు నీడలో ఆరబెట్టి, మెత్తగా పిండి పట్టించండి. తురిమిన బెల్లం, అర కప్పు నీళ్ళు పోసి ముదురు పాకం పట్టండి.అర కప్పు నీళ్ళలో రెండూ మూడూ చుక్కల పాకం వేయండి. ఆ చుక్కలు నీటి అడుగున గట్టిపడి ఉండలా అయితే పాకం దించేయవచ్చు. ఈ పాకంలో బియ్యప్పిండిని, ఓ గరిటెడు నెయ్యి వేసి బాగ కలియబెట్టి పక్కన పెట్టాలి. మజ్జిగలో నువ్వులను పదినిమిషాలు నానబెట్టి తీసేయండి. బాణలిలో నూనె వేడి చేయాలి. పాకం పిండిని చిన్న ముద్దలుగా చేసుకుని నువ్వులలో దొర్లించి, పాలిథిన్ పేపరుపై కాస్త నూనె రాసి, చేత్తో వెడల్పుగా ఒత్తి నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. వేగిన వాటిని తీసి పీట మీద గట్టిగా ఒత్తాలి. అలా చేస్తే నూనె దిగిపోతుంది. నువ్వుల అరిసెలు సిద్ధం.
కొబ్బరి అన్నం
బాస్మతి బియ్యం 500gm
కొబ్బరికాయ 1
ఎండుమిర్చి 4
జ్పచ్చిమిర్చి 4
మినప్పప్పు 2 tsp
సెనగపప్పు 2 tsp
ఆవాలు 1/2 tsp
జీలకర్ర 1/2 tsp
కరివేపాకు 2 రెమ్మలు
నూనె 1/2 కప్పు
జీడిపప్పు 10
కిస్మిస్ 6
ఉప్పు తగినంత
ముందుగా బియ్యం కడిగి పొడిపొడిగా వండాలి. కొబ్బరి తురిమి ఉంచుకోవాలి. ఓ వెడల్పాటి పళ్ళెంలో అన్నం పోసి, సగం నూనె పోసి కలపాలి. స్టవ్ మీద కళాయి పెట్టి మిగతా నూనె వేడి చేసి ఎండుమిర్చి,ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి,పప్పులు, కరివేపాకు వేసి కాస్త వేగాక అన్నంలో వేసి బాగా కలియబెట్టాలి. కొంచెం నెయ్యిలో జీడిపప్పు, కిస్మిస్ కూడా వేయించి అన్నంలో కలపాలి. చివరగా తగినంత ఉప్పు, కొబ్బరి తురుము కూడా వేసి బాగా కలిపి ఓ గంట తర్వాత వడ్డించండి.
నవరత్న బాత్
బియ్యం 500 gms
నెయ్యి 75 gms
పండుమిర్చి 5
చిక్కుడుకాయలు 100gms
చింతకాయలు 2
రేగిపండ్లు 5
వంకాయలు 3
చిలకడదుంప 1
ఉప్పు తగినంత
ఆవాలు చిటికెడు
జీలకర్ర చిటికెడు
ఇంగువ చిటికెడు
పసుపు చిటికెడు
కొత్తిమిర 1 కట్ట
ఒక మందపాటి గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి తాలింపు వేయాలి. ఆపైన ముక్కలుగా తరిగిన కాయగూరల్ని వేసి ఫ్రై చేసి పసుపు కలపండి. ఇందులో లీటరు నీళ్ళు,తగినంత ఉప్పు వేసి మరగనివ్వండి. తర్వాత కడిగిన బియ్యం వడపోసి ఇందులో వేయండి. పూర్తిగా ఉడికిన తర్వాత చిన్న మంటపై అయిదు నిమిషాలు ఉంచి దింపేయండి. కొత్తిమిర చల్లి పెరుగు పచ్చడితో వడ్డించండి.
పులగం
బియ్యం 250 gms
పెసరపప్పు 100 gms
పచ్చిమిర్చి 6
ఆవాలు 1/4 gms
జీలకర్ర 1/4 gms
అల్లం చిన్న ముక్క
కొత్తిమిర 1/2 కట్ట
జీడిపప్పు 10
మిరియాలు 8
నెయ్యి 4 tbsp
నూనె 2 tsp
ఉప్పు తగినంత
బియ్యం, పెసరపప్పు కలిపి శుభ్రంగా కడిగి అరగంట నీటిలో నానబెట్టాలి. వెడల్పటి గిన్నెలో నూనె, నెయ్యి కలిపి వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అల్లం వరసగా వేసి దోరగా వేగాక సరిపడినన్ని నీళు పోసి మరిగించాలి. తర్వాత బియ్యం, పప్పు, తగినంత ఉప్పు వేసి ఉడికించాలి.రంగు కావాలంటే పావు టీస్పూను పసుపు వేసుకోవచ్చు. అడుగంటకుండా కలుపుతూ మొత్తం ఉడికాక కొత్తిమిర కలిపి దింపేయాలి.
పనీర్ ఫ్రైడ్ రైస్
పనీర్ 200 gms
బాస్మతి బియ్యం 500 gms
నూనె 50 gms
పచ్చిబఠాణి 50 gms
జీడిపప్పు 25 gms
తాజా కొబ్బరి తురుము 1/2 కప్పు
క్యారట్ తురుము 1/4 కప్పు
ఉల్లికాడల తురుము 1/4 కప్పు
చిల్లీ సాస్ 1 tsp
టొమాటో సాస్ 1 tsp
అల్లం వెల్లుల్లి ముద్ద 1tsp
గరం మసాలా పొడి 1/2 tsp
మిరియాలపొడి 1/2 tsp
ఒక కళాయిలో కొద్దిగా నూనె వేడి చేసి అంగుళం ముక్కలుగా కోసిన పనీర్ ముక్కలు, జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. బియ్యం కడిగి కాస్త బిరుసుగా(పొడిపొడిగా) వండి పెట్టుకోవాలి. కళాయిలో నూనె వేడి చేసి అల్లం వెల్లుల్లిముద్ద వేసి మంచి వాసన వచ్చేవరకు వేయించాలి. ఉల్లికాడల తురుము, పచ్చిబఠానీలు, క్యారట్ తురుము వేసి కలిపి కొద్దిగా వేయించాలి. చిల్లీసాస్, టోమాటో సాస్, మిరియాల పొడి, గరం మసాలా పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇందులోనే పనీర్, జీడిపప్పు ముక్కలు, వండిన అన్నం వేసి అన్నీ బాగా కలియబెట్టాలి. చివరగా తురిమిన కొత్తిమిర, కొబ్బరి కూడా చల్లి ఒక నిమిషం ఉంచి దింపేయాలి. పదినిమిషాలు అలానే ఉంచి ఆ తర్వాత తినాలి.
పనీర్ నూడుల్స్
పనీర్ ముక్కలు 200 gms
వెజ్ నూడుల్స్ 250 gms
నూనె 50 gms
తురిమిన ఉల్లికాడలు 1/2 కప్
క్యారట్ ముక్కలు 50 gms
బీన్స్ ముక్కలు 50 gms
టొమాటో సాస్ 2 tbsp
రెడ్ చిల్లీసాస్ 1 tsp
వెల్లుల్లి ముద్ద 2 tsp
సోయాసాస్ 1 tsp
తురిమిన కొత్తిమిర 1 tbsp
మిరియాల పొడి 1/4 tsp
అజినోమోటో 1/4 tsp
ఉప్పు తగినంత
సన్నగా, నిలువుగా కోసిన పనీర్ ముక్కల్ని కొద్దిపాటి నూనెలో వేయించాలి. కళాయిలో నూనె వేడి చేసి వెల్లుల్లి ముద్ద, ఉల్లికాడల తురుము, కొద్దిగా ఉడికించిన బీన్స్, క్యారట్,పనీర్ ముక్కలు వేసి కలపాలి. తర్వాత టొమాటో,చిల్లీ,సోయా సాస్ , మిరియాలపొడి, అజినోమోటో, తగినంత ఉప్పు వేసి సన్నపాటిసెగపై బాగా కలియబెట్టాలి. చివరగా ఉడికించి వార్చి పెట్టుకున్న నూడుల్స్ కూడా వేసి బాగా కలిపి కొత్తిమిర చల్లి వడ్డించాలి.
పనీర్ సాండ్విచ్
పన్నీర్ 400 gms
పుదీనా చట్ని 4 tsp
టొమాటో కెచప్ 4 tsp
మిరియాల పొడి 1/4tsp
నూనె తగినంత
ఉప్పు తగినంత
అలంకరించడానికి సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు, టొమాటో ముక్కలు
పనీర్‌ను రెండడుగుల మందం కలిగిన ముక్కలుగా కోసుకోవాలి. వీటిమీద కొద్దిగా ఉప్పు, మిరియాలపొడి చల్లాలి. బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి పనీర్ ముక్కలను వేయించాలి. పనీర్ మెత్తగా ఉండాలనుకుంటే బేక్ చేయొచ్చు లేదా ఆవిరి మీద ఉడికించొచ్చు. ఒక ప్లేట్లో పనీర్ ముక్కలను తీసుకుని ఒక ముక్కపై పుదీనా చట్నీ పూసి దానిపై మరో పనీర్ ముక్కను పెట్టాలి. దానిపై టోమాటో కెచప్ పూసి మరో పనీర్ ముక్కను పెట్టాలి. దానిపై క్యాప్సికం, టోమాటో ముక్కలతో అలంకరించి వేడిగా వడ్డించాలి.
పనీర్ ఫ్రైడ్ స్లైసెస్
పనీర్ ముక్కలు 6 (బ్రెడ్ స్లైసుల్లా ఉండాలి)
నిమ్మరసం 2 tbsp
చిల్లీసాస్ 1 tbsp
సోయాసాస్ 2 tsp
తేనే 1 tsp
అల్లం వెల్లుల్లి ముద్ద 1 tbsp
కార్న్ ఫ్లోర్ 3 tbsp
పాలు 1 tsp
గుడ్లు 2 (ఇష్టం లేని వాళ్ళు మానేయవచ్చు)
ఉప్పు తగినంత
నూనె వేయించడానికి
నిమ్మరసం, తేనె, అల్లం వెల్లుల్లి ముద్ద,ఉప్పు, సోయా, చిల్లీసాస్లను బాగా కలిపి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్(మొక్కజొన్న పిండి), గిలకొట్టిన గ్రుడ్లు, పాలను కూడా బాగా కలిపి ప్రక్కన పెట్టుకోవాలి. వెడల్పాటి గిన్నెలో పనీర్ ముక్కల్ని పరచి నిమ్మరసం, సోయాసాస్ల మిశ్రమాన్ని వాటి మీద పోసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ముక్కల్ని మధ్యలో అటూ ఇటూ తిపుతూ 2-4 గంటలసేపు నానబెట్టాలి. తర్వాత పనీర్ ముక్కల్ని మామూలు ఉష్ణోగ్రతకి వచ్చేవరకు ఉంచాలి. కార్న్ ఫ్లోర్ మిశ్రమంలో ముంచి వేడి నూనెలో బంగారురంగు వచ్చేవరకు వేయించాలి. వీటిని వేడిగా తింటే చాలా బాగుంటాయి.
మొలకలతో మసాలా కూర

మొలకెత్తిన పెసలు 150 gms
క్యాప్సికం అన్ని రంగులలో 6
ఉల్లిపాయ 1
అల్లం 1 " ముక్క
వెల్లుల్లి రెండు రెబ్బలు
నూనె 1 tsp
పంచదార చిటికెడు
ఉప్పు తగినంత
మూడు రంగుల క్యాప్సికమ్‌ని, ఉల్లిపాయని, సన్నగా ముక్కలు చేసుకోవాలి. కోసేటప్పుడు వాటి మధ్యలో ఉన్న గింజల్ని తీసేయాలి. ఓ బాణలిలో నూనె వేడి చెసి అల్లం, వెల్లుల్లి వేసి రెండు నిమిషాలు వేయించాలి. తరువాత మొలకెత్తిన పెసలు, పచ్చిమిర్చి, ఉల్లిముక్కలు వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి. చివరగా ఉప్పు,పంచదార కూడా వేసి గరిటతొ బాగా కలిపి దింపాలి. ఇది వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది.
తమలపాకు ,పుట్టగొడుగుల రోల్స్

తమలపాకులు పెద్దవి 20
మష్రూమ్స్ 200 gms
బంగాళదుంపలు 2
ఉల్లికాడ ముక్కలు 4 tbsp
వేయించిన జీలకర్ర 50gms
చీజ్ 50 gms
చాట్ మసాలా పొడి 1 tsp
శనగపిండి 250 gms
అల్లంవెల్లుల్లి ముద్ద 2 tsp
వాము 4 tsp
కారం పొడి 4 tsp
కుంకుమ పువ్వు(కేసర్ రంగు) చిటికెడు
ఉప్పు తగినంత
నూనె వేయించడానికి
తమలపాకుల్ని తడిగుడ్డతో తుడిచి శుభ్రం చేయాలి. తరిగిన పుట్టగొడుగులు, ఉడికించిన బంగాళదుంపలు, తురిమిన చీజ్, ఉల్లికాడముక్కలు, జీలకర్ర, కొద్దిగా ఉప్పు, కుంకుమపువ్వు అన్నీ బాగా కలపాలి. ఒక్కో తమలపాకు మధ్య ఈ మిశ్రమాన్ని కొద్దిగా పెట్టి సిగార్స్లా చుట్టాలి. అవి విడిపోకుండా టూత్ పిక్స్ గుచ్చాలి. తర్వాత శనగపిండిలో అల్లం వెల్లుల్లి ముద్ద, వాము, ఉప్పు, కారం వేసి జారుడుగా కలపాలి. ఈ పిండిలో తమలపాకు రోల్స్‌ని ముంచి కాగిన నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకు వేగించాలి. వీటి మీద చాట్ మసాలా పొడి చల్లి టొమాటో పచ్చడితో తింటే చాలా బాగుంటాయి.















