Featured Posts
సోయా ఫ్లేక్స్ పకోడి

సోయా ఫ్లేక్స్ 1 కప్పు
ఉడికించిన బంగాళదుంపలు 2
బియ్యం పిండి 2 tsp
సెనగపిండి 2 tsp
అల్లం, వెల్లుల్లి ముద్ద 1 tsp
కారం 1 tsp
ఉప్పు తగినంత
నూనె వేయించడానికి
ఉడికించిన బంగాళదుంపలను, సోయాఫ్లేక్స్ని బాగా కలపాలి. తరువాత ఇందులో అల్లం,వెల్లుల్లి ముద్ద, కారం, ఉప్పు, బియ్యం పిండి, సెనగపిండి అన్నీ వేసి ముద్దలా కలపాలి. నూనె కాగిన తర్వాత పకోడీల మాదిరిగా వేయించి తీయాలి. పకోడీల కోసం సోయా ఫ్లేక్స్‌ని నీటిలో నానబెట్టకూడదు. నానబెడితే కరకరలాడవు.
సగ్గుబియ్యం ఇడ్లీ
సగ్గుబియ్యం 2 కప్పులు
పుల్లని మజ్జిగ 2 కప్పులు
ఉల్లిపాయ 1
పచ్చిమిర్చి4
ఉప్పు తగినంత
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/4 tsp
మినప్పప్పు 1/2 tsp
సెనగపప్పు 1/2 tsp
కరివేపాకు 1 tsp
కొత్తిమిర 1 కట్ట
నూనె 2 tbsp
సగ్గుబియ్యాన్ని పుల్లనిమజ్జిగలో కనీసం ఆరు గంటలు నానబెట్టాలి (మజ్జిగ మరీ పలుచగా కాకుండా మధ్యస్థంగా ఉండాలి). ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకుల్ని సన్నగా తరగాలి.బాణలిలో నూనె వేడి చేసి తాలింపు పెట్టి అందులో నాంబెట్టిన సగ్గుబియ్యం వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. కొత్తిమిర సన్నగా తరిగి ఈ మిశ్రమమలో కలపాలి. ఈ సగ్గుబియ్యం పిండిని ఇడ్లీల మాదిరిగా వేసి 15 నిమిషాలు ఆవిరిమీద ఉడికించాలి. మెత్తగా ఉండే ఈ సగ్గుబియ్యం ఇడ్లీలను టోమాటో చట్నీ కాని కొబ్బరి చట్నీతో కాని తింటే రుచిగా ఉంటాయి.
పైనాపిల్-చీజ్ సలాడ్
పైనాపిల్ ముక్కలు 4
చీజ్ 1 కప్పు
ఎర్ర క్యాప్సికం 2
వెనిగర్ 1 tsp
ఉప్పు 1 tsp
మిరియాలపొడి 1/4 tsp
పైనాపిల్ ముక్కలు చేసి నీరు ఓడ్చి, చిన్నగా తరగాలి. చీజ్‌ని కూడా చిన్న ముక్కలుగా తరిగి పైనాపిల్ ముక్కలతో కలపాలి. సిమ్లా మిర్చిలో గింజలు తీసి సన్నగా తరగాలి. ఈ మూడింటిని కలిపి ఫ్రిజ్‌లో ఉంచాలి. సర్వ్ చేసేముందు వెనిగర్,ఉప్పు, మిరియాలపొడి కలిపి ముక్కలు కూడా వేసి కలిపి చల్లగా సర్వ్ చేయాలి.
రష్యన్ సలాడ్
బఠానీలు 1/2 కప్పు
క్యారెట్ 125 gms
బీన్సు 125 gms
బంగాళదుంపలు 2
మయోన్నేస్ సాస్ 3/4 కప్పు
ఉప్పు తగినంత
మిరియాలపొడి 1/4 gms
టొమాటోలు 2
కూరగాయలు (టొమాటోలు తప్ప) ముక్కలు తరిగి, ఉడికించి,చల్లారిన తర్వాత నీరు ఓడ్చి, ఆరబెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. సర్వ్ చేసేముందు ముక్కలపైన సాస్,ఉప్పు, మిరియాలపొడి వేసి కలిపి చల్లగా సర్వ్ చేయాలి.
ఉడకబెట్టిన కూరగాయలతో సలాడ్
బంగాళదుంపలు 2
క్యారెట్ 2
బీట్రూట్ 1
క్యాబేజీ 1 కప్పు
బఠానీలు 1/2 కప్పు
మయొన్నేస్ సాస్ 1 కప్పు
ఉప్పు తగినంత
మిరియాలపొడి 1/2 tsp
టొమాటోలు 2
నిమ్మకాయ రసం 2 tsp
బంగాళదుంపలు, క్యారెట్టు, బీట్రూట్ అన్నీ పైన తొక్క తీసి చిన్న ముక్కలుగా తరిగి, క్యాబేజీ కూడ సన్నగా తరిగి, బఠానీలతో కలిపి ఉడికించాలి. ఉడికిన తర్వాత నీరంతా వార్చేసి చల్లార్చాలి. తయారుచేసిన సాస్ చల్లారిన ముక్కలపై పోసి , ఉప్పు, మిరియాలపొడి వేసి కలపాలి. పైన నిమ్మకాయ రసం పిండి, కలిపి టొమాటో ముక్కలు పైన అలంకరించి చల్లగా ఫ్రిజ్‌లో ఉంచి సర్వ్ చేయాలి.
ఉల్లిపాయల సలాడ్
ఉల్లిపాయలు 2
నిమ్మకాయ రసం 2 tsp
ఉప్పు తగినంత
కారం 1 tsp
కొత్తిమిర 2 tbsp
ఉల్లిపాయలను గుండ్రంగా ముక్కలు తరిగి, ఉప్పు వేసి 5 నిమిషాలు కదపకుండా ఉంచాలి.తర్వాత ఉల్లిపాయలను నీటితో కడిగి, నిమ్మకాయరసం, ఉప్పు, కారం వేసి కలిపి పైన కొత్తిమిర చల్లి సర్వ్ చేయాలి.
గోల్డన్ సలాడ్
క్యారట్ 3
కొబ్బరిపాలు 1/2 కప్పు
కిస్మిస్ 2 tsp
జీడిపప్పు 2 tsp
యాలకుల పొడి 1 tsp
పంచదార 2 tsp
క్యారెట్ చెక్కు తీసి ముక్కలు తరిగి కొబ్బరి పాలు పోసి ఉడికించాలి. ఉడికించిన ముక్కలు వేరే గిన్నెలో పోసి, మూతపెట్టి ఫ్రిజ్‌లో వుంచి, సర్వ్ చేసే ముందు కిస్మిస్ జీడిపప్పు, పంచదార,యాలకుల పొడి వేసి కలిపిన తర్వాత చల్లగా సర్వ్ చేయాలి.
పెరుగు సలాడ్
క్యారట్ 1
బంగాళదుంప 1
బఠానీలు 1/4 కప్పు
పెరుగు 1 కప్పు
కొత్తిమిర 2 tsp
పుదీనా 2 tsp
ఉప్పు తగినంత
కారం 1/4 tsp
గరం మసాలా 1/4 tsp
మిరియాల పొడి 1/2 tsp
జీలకర్ర పొడి 1/4 tsp
క్యారట్, బంగాళదుంప,బఠానీలు మెత్తగా ఉడికించుకోవాలి.పెరుగులో ఉప్పు,కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, మిరియాలపొడి వేసి,ఉడికించిన కూరగాయలు,సన్నగా తరిగిన పుదీనా కూడా వేసి బాగా కలిపిన తర్వాత కొత్తిమిర చల్లి చల్లగా సర్వ్ చేయాలి.
పెసలతో సలాడ్
మొలకెత్తిన పెసలు 100 gms
టొమాటో ముక్కలు 50 gms
బంగాళదుంపలు 50 gms(ఉడికించినవి)
పుదీనా చట్నీ 3 tsp
ఉప్పు తగినంత
కొత్తిమిర 2 tsp
సన్నగా తరిగిన కూరగాయలన్నీ మొలకెత్తిన పెసలతో చేర్చి, పుదీనాచట్నీ, తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టి కొత్తిమిర చల్లి వడ్డించాలి. ఈ కొత్త సలాడ్ ఆరోగ్యానికి చాలా మంచిది, ఘుమఘుమలాడుతూ నోరూరిస్తుంది.
శనగ మొలకల సలాడ్
మొలకెత్తిన సనగలు 1 1/2 కప్పులు
వెల్లుల్లి ముద్ద 2 tsp
పచ్చిమిర్చి 2
నిమ్మరసం 1 tsp
ఉప్పు తగినంత
కొత్తిమిర 2 tsp
నూనె 1 tsp
మూకుడులో నూనె వేడి చేసి, వెల్లుల్లి వేయాలి. కొద్దిగా వేగిన తర్వాత మొలకగింజలు వేసి, తగినంత ఉప్పు వేసి ఐదు నిమిషాలు సన్నని సెగపై వేగనివ్వాలి.నిమ్మరసం, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి కలిపి కొత్తిమిర చల్లి దింపేయాలి.















