Featured Posts
పానకం
బెల్లం అరకప్పు
సొంపు పొడి ఒక స్పూను
బెల్లం కప్పుడు నీళ్ళలో నానబెట్టి వడకట్టి అందులో సొంపు పొడి కలపాలి.
వడపప్పు

శ్రీరామనవమి సందర్భంగా చేసే వడపప్పు
సెనగపప్పు కాని పెసరపప్పు కాని - 1 కప్పు
కారం పొడి 1/2 tsp
ఉప్పు చిటికెడు
క్యారట్ తురుము 1 tbsp
పచ్చిమిర్చి తురుము1/2 tsp
కొత్తిమిర తురుము 1 tsp
పప్పును గంట సేపు నానబెట్టి నీరంతా వడకట్టి అందులో కారం, ఉప్పు, క్యారట్ తురుము, పచ్చిమిర్చి తురుము,కొత్తిమిర తురుము మీకు కావలసినంత వేసి కలపండి. మామూలుగా ఐతే పప్పు లో కాసింత ఉప్పు కారం మాత్రమె కలుపుతారు.
కొబ్బరితో ఉండ్రాళ్ళు

పచ్చికొబ్బరి తురుము - 3 కప్పులు
బియ్యం పిండి - 2 కప్పులు
బెల్లం - 2 కప్పులు
పంచదార - 5 చెంచాలు
యాలకుల పొడి - 2 చెంచాలు
నెయ్యి - 4 చెంచాలు
జీడిపప్పు పలుకులు - అర కప్పు
ముందుగా బాణలిలో నెయ్యి వేడి చేసి, అందులో కొబ్బరిని కొంచెం వేయించి,
అందులో బెల్లం కలిపి ఉడకనివ్వాలి.జీడిపప్పు పలుకులను కూడా వేసి
మాడకుండా కలుపుతూ ముద్దగా అయ్యేవరకు ఉడికించాలి. తర్వాత
దింపేయాలి. ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని పంచదార, యాలకులపొడి,
నెయ్యి వేసి అరకప్పు నీళ్ళు పోసి బాగా మరిగించాలి. దింపేసి అందులో
బియ్యం పిండీని పోసి ఉండలు లేకుండా బాగా కలపాలి. ఈ మిశ్రమం గట్టిగా
ఉండాలి. పలుచగా ఉంటే కొంచెం పిండిని వేసి కలపవచ్చు. కొబ్బరి
మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి ఉంచుకోవాలి. బియ్య్యం పిండిని
కాస్త పెద్ద ఉండను తీసుకుని వెడల్పుగా తట్టి, దాని మధ్యలో కొబ్బరి
ఉండను పెట్టి మూసేసి కావల్సిన ఆకారంలో చేసుకోవచ్చు. కావాలంటే
బియ్యం పిండిలో కేసరి రంగును కాని, కుంకుమపువ్వు కాని వేసుకోవచ్చు.
అటుకులతో కుడుములు
అటుకులు - 2 కప్పులు
బెల్లం - 1 1/2 కప్పు
నెయ్యి - 5 చెంచాలు
యాలకుల పొడి - 2 చెంచాలు
పాలు - అరకప్పు
ముందుగా ఒక మూకుడు తీసుకుని, అందులో నెయ్యి వేసి వేడి చేసి అటుకులను
వేయించాలి. బెల్లం సన్నగా తరగాలి. అందులో యాలకుల పొడి వేసి ఈ మిశ్రమాన్ని
గ్రైండ్ చేయాలి. దీనిని ఒక గిన్నెలోకి తీసుకుని పాలు వేడి చేసి కొంచెం కొంచెంగా
చల్లుకుంటూ ఉండలు చేయాలి. ఇవి మంచి రుచిగా ఉంటాయి. తొందరగా తయారు
చేయవచ్చు
శనగపప్పు పరమాన్నం

బియ్యం 1 cup
శనగపప్పు 1/2 cup
పచ్చి కొబ్బరి 1/2 cup
యాలకుల పొడి 2 tsp
పాలు 1 కప్
బెల్లం 1 కప్
నెయ్యీ 5 tbsp
ముందుగా బియ్యం, శనగపప్పు కడిగి తగినన్ని నీళ్ళు పోసి కొద్దిగా నెయ్యి వేసి
కుక్కర్లో ఉడికించాలి. తర్వాత దీనిలో బెల్లం వేసి మంట తగ్గించి నిదానంగా
ఉడికించాలి. నెయ్యి వేడి చేసి పచ్చికొబ్బరిని తురుము దోరగా వేయించి అందులో
కలిపి, యాలకుల పొడి వేసి పాలు కూడా వేసి బాగా కలుపుతూ అడుగు
మాడకుండా నెమ్మదిగా దగ్గరపడేవరకు ఉడికించాలి. తర్వాత దింపేయాలి.
కావాలంటే నెయ్యిలో వేపిన జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇది చాలా
రుచిగా ఉంటుంది.
పులిహోర

బియ్యం 250 gm
చింతపండు పులుసు 1/4 cup
ఎండుమిరపకాయలు5
జీలకర్ర 1 1/2 tsp
ధనియాలు 1 tbsp
ఆవాలు 1/4 tsp
ఇంగువ చిటికెడు
పసుపు 1/4 tsp
ఉప్పు తగినంత
వేరుశనగగుళ్ళు 3 tbsp
కరివేపాకు 2 tsp
నూనె 5 tbsp
ముందుగా ఎండుమిరపకాయలు,ధనియాలు,1 tsp జీలకర్ర కొద్దిగా వేపి
పొడి చేసిపెట్టుకోవాలి. అన్నం కాస్త బిరుసుగా వండి వెడల్పాటి పళ్ళెంలో
వేసి చల్లారనివ్వాలి. ఒక గిన్నెలో నూనె వేడి చేసి ఇంగువ వేసి, ఆవాలు,
జీలకర్ర, వేరుశనగగుళ్ళు, కరివేపాకు వేసి చిటపటలాడాక చింతపండు
పులుసు, పసుపు,తగినంత ఉప్పు వేసి చిక్కబడి నూనె తేలేవరకు
మరిగించాలి.ఇప్పుడు మసాలా పొడి వేసి బాగా కలిపి దింపి అన్నంలో వేసి
బాగా కలియబెట్టాలి.పావు గంట అలా ఉంచి తినడమే ...మామూలుగా
చేసుకునే పులిహారలా కాకుండా కాస్త వెరైటీగా ఉంటుంది. ఘాటుగా.


