బంగాళ దుంపలు 250 gm
ఉల్లిపాయలు 3
పచ్చిమిర్చి 2
కరివేపాకు 2 రెబ్బలు
పసుపు చిటికెడు
కారంపొడి 1 tsp
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/4 tsp
ఉప్పు తగినంత
నూనె 3 tbsp
ఉల్లిపాయలు 3
పచ్చిమిర్చి 2
కరివేపాకు 2 రెబ్బలు
పసుపు చిటికెడు
కారంపొడి 1 tsp
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/4 tsp
ఉప్పు తగినంత
నూనె 3 tbsp
బంగాళదుంపలను చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసి నీళ్ళలో వేసి ఉంచాలి.
ఉల్లిపాయలను కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి.వెడల్పాటి బాణలిలో నూనె వేడి చేసి
ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి చిటపటలాడాక ఉల్లిపాయలు,పచ్చిమిర్చి ముక్కలు
వేసి అవి గోధుమ రంగు వచ్చేవరకు వేయించి పసుపు,కారం పొడి వేసి కలిపి
బంగాళదుంప ముక్కలు తగినంత ఉప్పు వేసి అన్నీ బాగా కలిపి మూతపెట్టాలి. ఓ పది
నిమిషాలలో కూర తయారవుతుంధి.నీళ్ళు పోసే పని కూడా లేదు.కాని నిదానంగా
ఉడకనివ్వాలి. గరం మసాల ,కొత్తిమిర చల్లి దించేయడమే. ఇది అన్నం ఇంకా
రొట్టెలలోకి బావుంటుంది.
బంగాళదుంపలను చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసి నీళ్ళలో ఎందుకు వేసివుంచాలి?
బంగాళదుంపలను ముక్కలుగ కోసి నీళ్ళలో వేసి పెట్టాలి ఎందుకంటే. వాటిని అలాగే ఉంచితే గాలిలోని రసాయన ప్రక్రియ వల్ల రంగు మారతాయి.వంకాయలు ,అరటికాయలు కూడా అంతే.అందుకే ముక్కలు కోయగానే పోపులో వేసి పసుపు కారం అన్ని వేసి వండుకుంటే రంగు మారవు. అరటిపండు,ఆపిల్ ముక్కలు కూడా కోసి అట్టే పెడితే నల్లబడతాయి. వాటికి కొద్దిగా నిమ్మరసం చల్లి కలిపి పెడితే రంగు మారవు. ఫ్రూట్ సలాడ్ చేసినప్పుడు ఇలా చేయొచ్చు.లేకుంటే తినేముందే ఈ ముక్కలు కలపాలి.