Featured Posts
వెజిటబుల్ మంచూరియా

కావలసిన వస్తువులు.
తురిమిన క్యాబేజీ - రెండు కప్పులు
తురిమిన క్యారట్ - రెండు కప్పులు
తరిగిన్న ఉల్లికాడ - పావు కప్పు
సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు - రెండు
వెల్లుల్లి రేకులు - నాలుగు
కార్న్ ఫ్లోర్ - 2 tbsjp
నూనె - 2 tbsp
సోయా సాస్ - 1 tsp
ఉప్పు - తగినంత
మిరియాల పొడి - 1 tsp
చక్కర - 1/2 tspj
అజినోమోటో - చిటికెడు
నూనె - వేయించడానికి
తురిమిన క్యాబేజీ, క్యారట్, తరిగిన పచ్చిమిర్చి సగం, 1 tbsp కార్న్ ఫ్లోర్ ,, ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి ఈ ఉండలను దోరగా బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. వెడల్పాటి ప్యాన్ లో 2 tbsp నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లికాడలు, మిగిలిన పచ్చిమిర్చి ముక్కలు , వెల్లుల్లి వేసి కొద్దిగా వేయించి మగ్గిన తర్వాత అరకప్పు నీరు పోసి అందులో తగినంత ఉప్పు, మిరియాల పొడి, అజినోమోటో, చక్కర , సోయాసాస్ వేసి ఉడికించాలి. చిక్కబడ్డాక వేయించిన ఉండలు వేసి సన్నని మంట మీద కొద్ది సేపు ఉడకనివ్వాలి. సన్నగా తరిగిన కొత్తిమిరతో అలంకరించి వేడిగా సర్వ్ చేయాలి.
కారప్పూసతో మైసూర్ పాక్

ఉప్పులేని కారప్పూస 400 gms
కోవా - 400 gms
పాలు - 250 ml
చక్కెర 300 gms
నెయ్యి - 200 gms
కారప్పూసను చేతితో మెత్తగా చిదిమి పక్కన పెట్టుకోవాలి. మందపాటి గిన్నెలో పాలు పోసి వేడెక్కిన తర్వాత అందులో కోవా వేసి మొత్తం కలిసేంతవరకు కలియబెట్టాలి.ఇప్పుడు కారప్పూస పొడి, చక్కెర వేసి నెమ్మదిగా కలియబెడుతూ వుండాలి. అంతా గట్టిపడిన తర్వాత నెయ్యి వేస్తూ మెల్లిగా కలియబెట్టాలి. నెయ్యి మొత్తం వేసిన తర్వాత కొద్ది సేపు పొయ్యి మీద ఉంచి కిందకు దింపేయాలి. మందపాటి పళ్ళేనికి నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని పోయాలి. దానిని సమానంగా సర్దాలి. చల్లారిన తర్వాత కావలసిన ఆకారంలో ముక్కలు చేసుకోవాలి ఇవి వారం వరకు నిల్వ ఉంటాయి.
నమక్ పేడాలు

మైదా - 1/2 kg
ఉప్పు - రుచికి తగినంత
నూనె - వేయించడానికి
వాము - 1 tsp
పసుపు - చిటికెడు
వంటసోడా - చిటికెడు
నెయ్యి - 2 tbsp
మైదా, వాము, ఉప్పు, నెయ్యి, వంటసోడా వేసి బాగా కలిపి తగినన్ని నీళ్ళు పోస్తూ మృదువుగా చపాతీ పిండిలా తడిపి తడిగుడ్డ కప్పు అరగంట పక్కన పెట్టుకోవాలి. తర్వాత పెద్ద సైజు నిమ్మకాయంత ఉండలు చేసుకుని కాస్త మందపాటి చపాతీల్లా ఒత్తుకోవాలి. చాకుతో చపాతీని డైమండ్ కాని పట్టీలుగా కాని కట్ చేసుకుని వేడి నూనెలో నిదానంగా బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఇవి వారం పాటు నిలవ ఉంటాయి.
పుట్నాల పప్పు లడ్డూలు
పుట్నాల పప్పు - 100 gms
చక్కెర - 100 gms
ఏలకులు - 3
నెయ్యి - 75 gms
పుట్నాల పప్పు శుభ్రపరచుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. అలాగే చక్కెర కూడా ఏలకులతో కలిపి మెత్తగా పొడి చేసుకోవాలి. రెండింటిని బాగ కలియబెట్టాలి. కరిగించిన నెయ్యి పోస్తూ ఉండలు కట్టుకోవాలి. ఇది చాల త్వరగా చేసుకునే స్వీట్.
ఉల్లిపాయ కచోరి

కావలసిన పదార్ధాలు:
బంగాళదుంపలు - 2
ఉల్లిపాయలు - 2
సన్నగా తరిగిన అల్లం - 1 tsp
సన్నగా తరిగిన వెల్లుల్లి - 1/2 tsp
పచ్చిమిరపకాయ ముక్కలు - 1 tsp
పచ్చి బఠానీలు - 1 tbsp
ధనియాలు - 1/2 tsp
నిమ్మరసం - 2 tsp
కారం పొడి - 1/2 tsp
గరం మసాలా పొడి - 1 tsp
ఉప్పు - తగినంత
సన్నగా తరిగిన కొత్తిమిర 1 tsp
కిస్మిస్ - 10
జీడిపప్పులు - 8
గోధుమపిండి - 250 gm
ఉప్పు - చిటికెడు
నెయ్యి లేదా నూనె - 2 tbsp
వంట సోడా - చిటికెడు
బంగాలదుంపలను మెత్తగా ఉడికించి , చేత్తో చిదిమి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ ముక్కలు, బఠానీలు, ధనియాలు, నిమ్మరసం, కారం పొడి, గరం మసాలా పొడి, తగినంత ఉప్పు, కొత్తిమిర, కిస్మిస్, జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి.
పిండి లో ఉప్పు, వంటసోడా లేదా బేకింగ్ పౌడర్,నెయ్యి వేసి కలిపి తగినంత నీరు పోస్తూ చపాతీ పిండిలా కలిపి తడిగుడ్డ కప్పి అరగంట పక్కన పెట్టుకోవాలి. తర్వాత నిమ్మకాయ సైజు ఉండలు చేసుకుని కొద్దిగా నొక్కుకుని బంగాళా దుంపల మిశ్రమం ఉంచి అంచులను బాగా మూసేయాలి. దానిని కాస్త వెడల్పుగా చేసుకుని సన్నని సెగపై వేడి నూనేలో బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
పానకం
బెల్లం అరకప్పు
సొంపు పొడి ఒక స్పూను
బెల్లం కప్పుడు నీళ్ళలో నానబెట్టి వడకట్టి అందులో సొంపు పొడి కలపాలి.
వడపప్పు

శ్రీరామనవమి సందర్భంగా చేసే వడపప్పు
సెనగపప్పు కాని పెసరపప్పు కాని - 1 కప్పు
కారం పొడి 1/2 tsp
ఉప్పు చిటికెడు
క్యారట్ తురుము 1 tbsp
పచ్చిమిర్చి తురుము1/2 tsp
కొత్తిమిర తురుము 1 tsp
పప్పును గంట సేపు నానబెట్టి నీరంతా వడకట్టి అందులో కారం, ఉప్పు, క్యారట్ తురుము, పచ్చిమిర్చి తురుము,కొత్తిమిర తురుము మీకు కావలసినంత వేసి కలపండి. మామూలుగా ఐతే పప్పు లో కాసింత ఉప్పు కారం మాత్రమె కలుపుతారు.
కంది పొడి

కంది పప్పు - 1 కప్పు
ఎండు మిరపకాయలు - 6
జీలకర్ర 1 tsp
ధనియాలు 1 tsp
పల్లీలు 1 tbsp
నువ్వులు 1 tsp
కరివేపాకు 1 రెబ్బ
ఉప్పు తగినంత
నూనె 2 tsp
పోపు గింజలు 1/2 tsp
ముందుగా 1 స్పూను నూనె వేడి చేసి కరివేపాకు తప్ప మిగత వస్తువులన్నీ దోరగా వేయించి తగినంత ఉప్పు వేసి కాస్త బరకగా పొడి చేసుకోవాలి. తర్వాత మిగాతా నూనె వేడి చేసి పోపు గింజలు, కరివేపాకు వేసి చితపతలాదాకా ఈ పొడి కూడా వేసి కొద్ది సేపు వేయించాలి, తడి లేకుండా ఉండేందుకు. అంటే కంది పొడి రెడీ.
కంది పచ్చడి

కందిపప్పు - 100 gms
ఎండుమిరపకాయలు - 6
జీలకర్ర - 1tsp
ధనియాలు - 1 tsp
నెయ్యి - 1 tsp
నూనె - tbsp
కరివేపాకు - 1రెబ్బ
చింతపండు - నిమ్మకాయంత
ముందుగా నెయ్యి వేడి చేసి ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు వేయించి తీసి పక్కన పెట్టి, ఆ తరవాత కంది పప్పును దోరగా కమ్మని వాసన వచ్చేవరకు వేయించి మిగతా వస్తువులతో కలిపి తగినంత ఉప్పు వేసి కొద్దిగా నెలలు చల్లుకుంటూ ముద్దగా రుబ్బుకోవాలి. తర్వాత నూనె వేడి చేసి పోపు గింజలు, కరివేపాకు వేసి చిటపటలాడాక పచ్చడిలో కలపాలి. ఇది వేడి వేడి అన్నం లో నెయ్యి వేసుకుని తింటే రుచిగా ఉంటుంది.
సోయా ఫ్లేక్స్ పకోడి

సోయా ఫ్లేక్స్ 1 కప్పు
ఉడికించిన బంగాళదుంపలు 2
బియ్యం పిండి 2 tsp
సెనగపిండి 2 tsp
అల్లం, వెల్లుల్లి ముద్ద 1 tsp
కారం 1 tsp
ఉప్పు తగినంత
నూనె వేయించడానికి
ఉడికించిన బంగాళదుంపలను, సోయాఫ్లేక్స్ని బాగా కలపాలి. తరువాత ఇందులో అల్లం,వెల్లుల్లి ముద్ద, కారం, ఉప్పు, బియ్యం పిండి, సెనగపిండి అన్నీ వేసి ముద్దలా కలపాలి. నూనె కాగిన తర్వాత పకోడీల మాదిరిగా వేయించి తీయాలి. పకోడీల కోసం సోయా ఫ్లేక్స్ని నీటిలో నానబెట్టకూడదు. నానబెడితే కరకరలాడవు.


