అన్నం మామూలుగా వండేసి పెట్టుకోండి.కాని పొడిపొడిగా ఉండాలి. మెత్తగా ఉంటే ఏమి చేయలేము.
1. ఒక గిన్నెలో ఒ గరిటెడు నూనె తీసుకునిఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి,కాస్త
మినప్పప్పు,శనగపప్పు,కరివేపాకు పసుపు వేసి కాస్త వేగిన తర్వాత దింపేసి
ఓ నిమ్మకాయ పిండి ఉప్పు వేసి అన్నంలో కలిపేస్తే నిమ్మకాయ పులిహార రెడీ
2. పచ్చి కొబ్బరి ఉంటె తురిమి పెట్టుకోండి.గిన్నెలో నూనె వేసి , ఎండుమిర్చి పోపు
గింజలు వేసి చిటపటలాడాక కరివేపాకు,పచ్చికొబ్బరి తురుము వేసి కలిపి
దించేయాలి. అన్నంలో తగింత ఉప్పు కలిపి పోపును,ఓ స్పూను నెయ్యి వేసి బాగా
కలిపి మూత పెట్టి ఓ పదినిమిషాల తర్వాత తిండానికి కొబ్బరి పులిహార రెడీ.ఇందులో
పసుపు వేయకూడదు. కొబ్బరి వేపకూడదు.
3. నిమ్మకాయ పులిహార ఎండుమిర్చి కాని పచ్చిమిర్చితో కాని చేసుకోవచ్చు.
అప్పుడప్పుడు అల్లం తురిమి పోపులో వేస్తె అదో అదిరే టేస్ట్.
4. క్యారట్,బీన్సు సన్నగా ముక్కలుగా కోసి కాస్త ఉడికించి పెట్టుకోవాలి. ఒక చిన్న
ఉల్లిపాయ చిన్న ముక్కలుగా తర్రిగి,రెండు పచ్చిమిర్చి చీల్చి పెట్టుకోవాలి. బాణలిలో
నూనె వేసి ఆవాలు,జీలకర్ర,కరివేపాకు,శనగపపు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ,
పచ్చిమిర్చి, కూరగాయ ముక్కలు కొద్దిగా వేపి కొంచం అల్లంవెల్లుల్లి ముద్ద,
గరంమసాల,పసుపు వేసి మళ్ళి కాస్త వేపి అన్నం వేసి తగిన ఉప్పు వేసి అన్ని
కలిసేలా బాగా కలిపి ఓ రెండు నిమిషాలు వేపి దించి పెరుగు పచ్చడితో
లాగించండివెజ్ ఫ్రైడ్ రైస్.
5. చింతపండు పులుసు తీసిపెట్టుకుని నూనె వేడి చేసి ఇంగువ వేసి,ఆవాలు,జీలకర్ర,
ఎండుమిర్చి,శనగపప్పు,వేరుశనగ గుళ్ళు,కరివేపాకు వేసి వేగిన తర్వాత పులుసు
పసుపు,తగినంత ఉప్పు వేసి చిక్కబడి నూనె తేలేవరకు ఉడికించి దించేయాలి. ఈ
పులుసు వారం నిల్వ ఉంటుంది ఉప్పు సరిగ్గా ఉంటే.కావల్సినప్పుడు అన్నంలో తగినంత
పులుసు వేసి కలుపుకోడమే.రుచికరమైన పులిహార రెడి ఎప్పుడైనా.
6. కాస్త వేరైటీగ ఉండాలంటె కారం తగ్గట్టుగా ఎండుమిర్చి,కాస్త జీలకర్ర,మెంతులు,
నువ్వులు వేయించి పొడి చేసి మరుగుతున్న పులుసులో అప్పుడు ఎండుమిర్చి
వేయకూడదు.మిగతావన్ని అలాగే.
7. ఉల్లిపాయ,చిన్న అల్లం ముక్క,రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి.
గిన్నెలో నూనె వేడి చేసి జీలకర్ర,యాలకులు,లవంగాలు,దాల్చిన చెక్క,షాజీర
కొద్దిగా,ఉల్లిపాయలు, మిర్చి, అల్లం ముక్కలు వేసి వేప అన్నం, తగినంత ఉప్పు
వేసి బాగ కలిపి కొద్దిగా వేపి దించేయాలి. అంతే జీరా రైస్ రేడీ.
8. అన్నంలో నీళ్ళు పోసి మెత్తగా ఉడికించుకోవాలి.లేదా అన్నం ఎప్పుడన్నా మెత్తబడితే
ఇలా చేసుకోవచ్చు.దానిని గరిటతో మెదిపి తగినంత ఉప్పు కలిపాలి. ఒక గిన్నెలో పాలు
ఇంక పెరుగు కలిపి పెట్టుకోవాలి.గిన్నెలో నూనె వేసి ఇంగువ వేసి ఎండుమిర్చి,ఆవాలు,
జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు వేసి వేపి పెరుగులో కలపాలి.కావాలంటె సన్నగా తరిగిన
అల్లం ముక్కలు పోపులో వెసుకోవచ్చు.బావుంటుంది. పెరుగు మిశ్రమాన్ని అన్నంలో
వేసి బాగా కలిపి అట్టే పెట్టి పది నిమిషాల తర్వాత తింటే సరి ఆవకాయనంజుకుంటూ.
ఇది ఎక్కువగా ప్రయాణాలకోసం చేసుకోవచ్చు.మొత్తం పెరుగుతో చేసుకుంటె అన్నం
పుల్లగ అవుతుంది.అందుకే సగం పెరుగు సగం పాలతో చేసుకోవాలి.అప్పుడు కమ్మగా
ఉంటుంది దధ్యోజనం దీనికి నిమ్మకాయ ఊరగాయ ఉంటె అదుర్స్.
మాలిక పత్రిక జులై 2024 సంచిక విడుదల
5 months ago
0 వ్యాఖ్యలు