ఓ కప్పుడు సెనగపప్పు అరగంట నానపెట్టండి. ఉల్లిపాయలు తరిగి పెట్టుకోండి.పొయ్యి
మీద గిన్నె పెట్టి కాస్త ఎక్కువ నూనె వేసి(పప్పు కాబట్టి) కాగిన తర్వాత ఉల్లిపాయలు
వేసి గొధుమవర్ణం వచ్చేవరకు వేయించి పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం పొడి,
కరివేపాకు వేసి కొద్దిగా వేపి నానపెట్టిన సెనగపప్పును నీళ్ళు తీసేసి వేయాలి.తగినంత
ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టాఅలి.తడి ఆరిపోయాక కొద్దిగా నీళ్ళు పోసి మూత
పెట్టెయండి..ఓ పదినిమిషాల తరవాత కూర ఉడికిపోతుంది.కుక్కర్లో ఐతె 5 నిమిషాలు
చాలు.కొత్తిమిర, గరం మసాల పొడి వేసి దించేయండి.ఈ కూర పొడిపొడిగానే ఉండాలి.
ముద్దలా కాకుండా కస్త జాగ్రత్త పడితే చాలు.
దీనికి బెస్ట్ కాంబినేషన్ పచ్చిపులుసు
కొద్దిగా చింతపండు నానపెట్టండి.తెల్లది ఐతె బావుంటుండి.ఓ చిన్న ఉల్లిపాయను చాలా
చిన్న ముక్కలుగ తరిగి పెట్టుకోవాలి.ఒకటి లేదా రెండు పచ్చిమిర్చి ని గ్యాస్ మంటపై
కాల్చి చిన్న ముక్కలుగ తరిగి పెట్టుకోవాలి.ఇప్పుదు ఉల్లిపాయ,పచ్చిమిర్చి,కరివేపాకు
,కొత్తిమిర,తగినంత ఉప్పు,పావు స్పూను చక్కెర కలిపి పెట్టి ఇందులొ చింతపండు
నీళ్ళు కలపాలి.పుల్లగా కావాలనుకుంటె చిక్కగా పులుసు తీసుకోవాలి.లేదంటె
పలుచగా తీసుకోవాలి.ఇప్పుడు బాణలిలో నూనె పోసి కాగిన తర్వాత ఆవాలు,జీలకర్ర,
కొద్దిగా పోపుగింజలు( ఎండుమిర్చి విత్తనాలు) వేసి అన్ని కలిపి పెట్టుకున్న పులుసులో
కలపి వెంటనే మూత పెట్టాలి.
మాలిక పత్రిక జులై 2024 సంచిక విడుదల
5 months ago
పచ్చిపులుసు - అనే పదం చాలామందికి తెలీదని తెలిసి నాకు ఆశ్చర్యం కలిగింది. కొంతమంది తెలుగువారికి అసలు పచ్చిపులుసు అనేదొకటుందనికూడా తెలీదు. దౌర్భార్యం. దీన్ని వికీపీడియాలో పెడదామనుకుంటున్నా. రాత్రి మిగిలిన పచ్చిపులుసును పొద్దున్నే సద్దెన్నం మీగడపెరుగుతో కలిపి తింటే వచ్చే హుషారే వేరే. మీగడపెరుగనేదే లేకుండాపోయింది మావూరినుంచి బతుకుదెరువుకోసం పట్నాలవెంటబడ్డాక.