తెల్ల నువ్వులు 250 gm
బెల్లం 250 gm
నెయ్యి 2 tsp
ఏలకులు 4
బెల్లం 250 gm
నెయ్యి 2 tsp
ఏలకులు 4
బెల్లం కరిగించి వడకట్టుకోవాలి.నువ్వులు ఖాలీ బాణలిలో దోరగా వేయించాలి. నువ్వు
పప్పు నొట్లో వేసుకుంటే గుల్ల విచ్చినట్టు ఉండాలి. బెల్లం ముదురు పాకం చేయాలి. ఒక
చిన్న పళ్ళెంలో నీళ్ళు పోసి రెందు చుక్కలు పాకం అందులో వేస్తే అది వెంటనె ఉండ
కట్టాలి. ఆ ఉండను నేలకేసి కొడితే విరగొద్దు.ఇప్పుడు నెయ్యి, ఏలకుల పొడి నువ్వులు
అన్నీ వేసి బాగా కలిపి దించి. నెయ్యి రాసిన పళ్ళెంలో చిన్న గరిటతో ఈ నువ్వుల
పాకాన్ని కొద్ది కొద్దిగా వేసి చేయి తడి చేసుకుంటూ జాగ్రత్తగా వేడి మీదనే ఉండలుగ
చేసుకోవాలి. కొద్దిగ అలవాటు పడితే తొందరగా చేయొచ్చు. అరగంట ఆరిన తర్వాత
డబ్బాలో వేసి పెట్టుకోడమే.
0 వ్యాఖ్యలు