క్యాబేజీ 250gm
ఎండు మిర్చి 6
ఆవాలు 1/2gm
జీలకర్ర 1/2gm
పసుపు 1/2gm
మినప్పప్పు 1 tbsp
శనగపప్పు 2 tbsp
కరివేపాకు 1 రెబ్బ
కొత్తిమిర 2 tbsp
నూనె 3 tbsp
ఉప్పు తగినంత
ముందుగా క్యాబేజీని చాలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. వెడల్పాటి గిన్నెలో నూనె వేడి
చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక ఎండుమిర్చి, కరివేపాకు,శనగపప్పు, పసుపు
వేసి కొద్దిగా వేపి క్యాబేజీ, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. ఇది చిన్న మంటపై
నూనెలోనే మగ్గిపోతుంది.చివరగా గరం మసాల, తరిగిన కొత్తిమిర చల్లి దించేయడమే.
ఇది చపాతీలలోకి, అన్నంలోకి చాలా బావుంటుంది త్వరగా చేసుకోవచ్చు కాని
క్యాబేజీని మాత్రం చాలా సన్నగా దారాల్లాగా తరగాలి.
0 వ్యాఖ్యలు