బ్రెడ్ స్లైసులు 8
బంగాళ దుంప (ఉడికించినది) 1
శనగపిండి 1 కప్పు
పచ్చిమిర్చి 2
కొత్తిమిర 1 tbsp
కరివేపాకు 1 tsp
కారం పొడి 1 tsp
ఉప్పు తగినంత
వంట సోడా చిటికెడు
పసుపు చిటికెడు
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/2 tsp
నూనె వేయించడానికి
ముందుగా బాణలిలో ఒక స్పూను నూనె వేడి చేసి ఆవాలు వేసి చిటపటలాడాక
కరివేపాకు,తరిగిన పచ్చిమిర్చి,పసుపు వేసి కొద్దిగా వేపి ఉడికించిన బంగాళ దుంపను
పొడి పొడిగ చిదిమి అందులో వేసి తగినంత ఉప్పు,కొత్తిమిర వేసి రెండు నిమిషాలు
వేయించాలి.శనగపిండిలో ఉప్పు,కారం పొడి,వంట సోడా వేసి గరిటజారుగా కలిపి
ఉంచాలి. ఒక బ్రెడ్ స్లైసును తీసుకుని దానిపై కొద్దిగా బంగాళదుంప మిశ్రమాన్ని పరిచి
ఇంకో స్లైసును దానిపై పెట్టి అతుకునేట్టట్టుగా కొద్దిగా వత్తి నాలుగు చతురస్రాలుగా
కట్ చేయాలి. ఇప్పుడు ఒక్కో ముక్కను శనగపిండి మిశ్రమంలో ముంచి వేడి నూనెలో
ఎర్రగా కాల్చాలి.ఇవి గ్రీన్ సాస్ కాని టొమాటో సాస్ కాని నంజుకుని తింటే బావుంటాయి
పక్కనే వేడి కాఫీ కాని టీ కాని ఉండాలి సుమా.
మాలిక పత్రిక జులై 2024 సంచిక విడుదల
1 year ago
bread to kuudaa inni ceyochani naaku ivaale telisindi.thanks.