ఈ రోజు నాకు ఎంతో సంతోషకరమైన రోజు..ఇవాళా నా పుట్టిన రోజు ఇంకా ఈ
బ్లాగులో నా వందవ టపా ఇదే. రెండు విధాల పండుగను జరుపుకోవడం నా
అదృష్టం గా భావిస్తున్నాను. ఆదరిస్తున్న అందరికీ నా కృతజ్ఞతలు. అందరికి
కాస్త నోరు తీపి చెయనా.
సగ్గుబియ్యం 100 gm
పాలు 500 ml
పంచదార 150 gm
యాలకులు 4
జీడిపప్పు 6
నెయ్యి 3 gm
ముందుగా సగ్గుబియ్యం అరగంట నానబెట్టాలి.తరువాత అదే నీళ్ళలోపాలు
పోసి అవి పారదర్శకమయ్యేవరకు ఉడికించాలి. తరువాత పంచదార, యాలకుల
పొడి,నెయ్యి, జీడిపప్పు అన్ని వేసి కొద్దిసేపు ఉడికించి దింపేయాలి.
ముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు !!
మీ పుణ్యమా అని అమెరికాలో ఉన్నా కూడా రుచికరమైన వంటలు చేసుకుంటున్నాము !!
మీరు ఈ వందవ టపాలో అందించిన స్వీటు లాగా మీ జీవితం కూడా తియ్యగా ఉండాలి అని ఆకాంక్షిస్తున్నా !!
ముందు ముందు ఇంకా ఇంకా రుచికరమైన బ్లాగులతో మమ్మల్ని ఆనందపరచాలి అని కోరుకుంటూ మరొక్క సారి జన్మదిన శుభాకాంక్షలు !!
అభినందనలు!
పుట్టిన రోజు శుభాకాంక్షలు! మీ బ్లాగు వందల నుండి వేలకు పెరగాలని ఆశిస్తూ-
శుభాభినందనలు
జన్మదిన శుభాకాంక్షలు!!
అప్పుడే వందటపాలు పూర్తిచేశారా? శతటపోత్సవ శుభాభినందనలు కూడా అందుకోండి!!
మీరన్నట్లు గూగుల్ వాడికి తెలుగు అర్థమైనట్లు లేదండీ! లేకపోతే మీ ఇంగ్లీషు బ్లాగులో వంటల ప్రకటనలు ఇచ్చి, తెలుగు బ్లాగులో పొంతనలేని ప్రకటనలు ఇవ్వడమేమిటి?
జన్మదిన శుభాకాంక్షలు. మీరు అందిస్తున్న రుచికరమైన వంటకాలు మాకు నోరూరిస్తూనే ఉండాలని కోరుకుంటూ
జన్మదిన శుభాకాంక్షలు జ్యోతీ. శతటపోత్సవ శుభాకాంక్షలు కూడా
జ్యోతి గారూ,
అందుకోండి జన్మదిన మరియు నూరుటపాల విజయోత్సవ శుభాకాంక్షలు. నాకింకా మీ పాయసాలుతినే భాగ్యము అబ్బలేదు. ఏదో ఓరోజు మా శ్రీమతిని పక్కన పెట్టి నేనూ చేసేస్తాను మీ వంటల బ్లాగు సహాయంతో!
--ప్రసాద్
http://blog.charasala.com
మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అండి.
మీరు ఇలాగే ఇంకెన్నో వంటకాలతో అందరికి నోరూరించాలని ఆకాంక్షిస్తూ...
జన్మదిన శుభాకాంక్షలు!!
జ్యొతి గారు,
మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.
మీరు వందవ టపా మాత్రమే కాదు వంద పుట్టిన రొజులు జరుపుకుని, మీ వందవ పుట్టిన రోజున మిలియన్ టపా రాయాలని, రాస్తారని మీకు మరొక్కసారి శుభాకాంక్షలందిస్తూ..
విహారి.
http://vihaari.blogspot.com
మీకు నా హ్రుదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.మరియు సత టపోత్సవ శుభాకాంక్షలు.
Happy birthday.
మరింత సంతోషకరమైన పుట్టిన రోజులు మరిన్ని జరుపుకొందురుగాక!! హృదయపూర్వక శుభాకాంక్షలు.
wish you a very happy birth day an congratulations on your 100th post!