కొర్రలు అంటే అంధ్రా రాయలసీమ దిక్కు ఎక్కువగా పండుతుంది. అది బియ్యంతో
సమానం. అన్నం లాగే వండుకుంటారు.ఇడ్లీ, దోశ కూడా చేసుకుంటారు. ఇందులో
చక్కెర శాతం చాల తక్కువగా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా
ఉపయోగకారి. వరి అన్నం బదులు కొర్రన్నం చాలా మంచిది. దీనిని ఇంగ్లీషులొ
foxtail millet అంటారు. పెద్దల అమావాస్య రోజు కొర్రలతో పాయసం చేసి
పెద్దలకు నైవేద్యం పెడతారు..
కొర్రలు 1 కప్పు
పాలు 500 ml
చక్కెర
లేదా బెల్లం 100 gm
యాలకులు 4
నెయ్యి 2 tsp
ముందుగా కొర్రలను శుభ్రం చేసుకుని గ్లాసుడు నీళ్ళు పోసి గంటసేపు నాననివ్వాలి.
తరువాత వాటిని మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. పాలు పోసి అవి మరుగుతుండగా
చక్కెర కాని బెల్లం కాని వేసి చిక్కపడేవరకు ఉడికించి నెయ్యి, యాలకులపొడి వేసి
కలిపి దింపేయాలి.
మాలిక పత్రిక జులై 2024 సంచిక విడుదల
5 months ago
నక్కతోక ధాన్యమా? (fox tail millet) ఎందుకలా అంటారో? కొర్ర కంకి నక్క తోకలా ఉంటుందా లేక వేరే కారణమేదైనా ఉందా?
అవును, దాని కంకుల ఆకారం నక్క బొచ్చు తోకలా ఉంటుంది.
http://en.wikipedia.org/wiki/Foxtail_millet చూడండి.
ఇందాకే ఆంగ్లంలో ఏమంటారని అడిగాను. ఈమె చెప్పేసింది.
పేరెలా వున్నా సులభంగా గుర్తుంచుకోవచ్చు. ఇక్కడి ఇండియన్ స్టోర్లలో బహుశా అవి హిందీ పేర్లతో వుంటాయి. హిందీలో ఏమంటారో!
--ప్రసాద్
http://blog.charasala.com