మినప్పప్పు 100 gm
పచ్చిమిర్చి 3
ఉప్పు తగినంత
నూనె వేయించడానికి
ముందుగా మినప్పప్పును రెండుగంటలపాటు నానబెట్టి, మిక్సీలో పచ్చిమిర్చితో
కలిపి మెత్తగా కాటుకలా రుబ్బుకోవాలి. తరువాత నూనె వేడి చేసి నిమ్మకాయంత
సైజులో పిండి ముద్ద తీసుకుని చేతితో తట్టి మధ్యలో చిల్లు పెట్టి నూనెలో నిదానంగా
ఎర్రగా వేయించి సాంబార్ లేదా చట్నీతో తినాలి.
వడ కొసం పిండిని మరీ మెత్తగా రుబ్బకూడదు