కాబూలీ శనగలు 1 1/2 కప్పు
ఉప్పు తగినంత
వేయించిన జీలకర్ర 1 tsp
చాట్ మసాలా 1tsp
ధనియల పొడి 2 tsp
కారం పొడి 1/2 tsp
చింతపండు రసం 1/4 tsp
యాలకులు 3
దాల్చిన చెక్క 2
తేజ్ పత్తా 4
ఉల్లిపాయ 1
పచ్చిమిర్చి 2
కొత్తిమిర 2 tsp
మైదా 1 కప్పు
గోధుమపిండి 2 కప్పులు
పెరుగు 1/4 కప్పు
నూనె 1 tsp
చక్కెర 1 tsp
ఉప్పు 1 tsp
వంట సోడా చిటికెడు
నూనె వేయించడానికి
గోధుమపిండి,మైదా కలిపి అందులో పెరుగు, సోడా,నూనె, ఉప్పు, చక్కెర కలిపి
చపాతీ పిండిలా కలిపి మూత పెట్టి ఉంచాలి. కాబూలీ శనగలు ఉప్పు కలిపిన
నీళ్ళలో కనీసం ఐదారు గంటలు నానపెట్టాలి.తర్వాత అందులో దాల్చినచెక్క,
యాలకులు తెజ్ పత్తా వేసి కుక్కర్లో ఉడకబెట్టలి.తర్వాత కొద్దిగా వెన్న వేడి
చేసి ఈ శనగల మిశ్రమాన్ని పోసి అందులో చింతపండు రసం, జీలకర్ర,
కారప్పొడి, చాట్ మసాల,ధనియాలపొడి, ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిర్చి
ముక్కలు, కొత్తిమిర వేయాలి. బాగా ఉడికి చిక్కగ అయ్యకా దింపేయాలి.
ఇప్పుడు పొంగిన చపాతీ పిండిని ఉండలుగా చేసుకుని పూరీలాగా వత్తుకుని
ఇప్పుడు పొంగిన చపాతీ పిండిని ఉండలుగా చేసుకుని పూరీలాగా వత్తుకుని
వేడి నూనెలో ఎర్రగా కాల్చి తీసి ఈ బటూర(శనగల కూర)తో వడ్డించాలి.
onions ni fry cheyakkaraledda?mari kuura vudakadaaniki water poyakkarleda?tejpatta antea emiti?
శనగలు ఉడికించిన నీళ్ళు, చింతపండు రసం మసాలాలన్ని కలిపి ఉడికిస్తున్నాము కదా మళ్ళీ వేరే అవసరం లేదు.ఉల్లిపాయలు కూడా అలాగే చిన్నముక్కలుగా కోసి కలపాలి ఫ్రై చేయక్కర్లేదు. తేజ్ పత్తా అంటే బిరియాని ఆకు అంటాము కదా అది..మామిడి ఆకులా ఉంటుంది.పలావ్ లాంటి వాటిలో వేసుకోవచ్చు.
palav aaku telusamdi.tejpatta amtea ardam kaaledu.twaraloane try chesta.baaguntea aa credit naadi.baagoka pote meedi[just kidding]