గోధుమపిండి 100 gm
ఉప్పు చిటికెడు
గోధుమపిండిని ఉప్పు కలిపి జల్లించి నీళ్ళతో మృదువుగా తడిపి పెట్టుకోవాలి.
ఓ పదినిమిషాల తర్వాత పిండిని బాగ మర్ధించి చిన్న నిమ్మకాయ సైజులో
ఉండలుగా చెసుకుని పిండి చల్లుకుంటూ పలుచగా వత్తుకోవాలి. వేడి
పెనంపై వేసి ఒకవైపు కొంచం కాలాక తిరగేసి రెండో వైపు కొంచం కాలాకా
పెనంపైనుండి తీసి గ్యాస్ మంటపై పటకారు సాయంతో రెండువైపులా
కాల్చుకోవాలి. ఇది చాలా త్వరగా చేయాలి. ఇలా చేస్తే పుల్కాలు పూరీలాగా
పొంగుతాయి. నూనె లేకుండా తినాలనుకునేవాళ్ళు ఎక్కువగా
చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల మృదువుగా ఉంటాయి. మొత్తం
పెనంపై చేస్తే గట్టిగా వస్తాయి.
pulka vinadam,tinadam tappinchi ela ceayalo teleedu.thanks.alage parata lu kuda ela ceyalo cheppandi
అబ్బో మీరు మాత్రం సంపేత్తున్నారండి.
ఒక దాని వెంబడి ఒకటి రైలు పెట్టెల్లాగ సాగిపోతూనే వుంది మీ షడ్రుచుల ప్రవాహం. ఇక మీదట గూగుల్లో వెదుకులాట ఆ వచ్చిన తరువాత ఆ ఇంగ్లిష్ పదాలకు నిఘంటువు లో వెదుకులాట తప్పి పోయింది.
మీ నిరంతర ప్రవాహాన్ని జీవ నది లాగ పొంగిస్తూనే వుండండి.
విహారి