మైదా 100 gm
ఉప్పు చిటికెడు
నూనె 100 gm
ముందుగా మైదాలో ఉప్పు కలిపి నీళ్ళతో చపాతీ పిండిలా కలిపి ఒక స్పూను
నూనె వేసి కలిపి అరగంట పక్కన పెట్టుకోవాలి. పెద్ద నిమ్మకాయంత ముద్ద
తీసుకుని పిండి చల్లుకుంటూ చపాతీలా వత్తుకోవాలి. ఇప్పుడు దానిపై నూనె
రాసి పిండి చల్లి చాపలా చూట్టాలి. మళ్ళీ చపాతీలా వత్తుకుని నూనె రాసి
పిండి చల్లి మళ్ళి చుట్టాలి. ఇప్పుడు పెనం వేడి చేసి ఈ పరోటాను నూనె వేస్తూ
రెండువైపులా కాల్చుకోవాలి. ఈ పరోటా పొరలు పొరలుగా వస్తుంది.ఇది
వేడి మీదనే బావుంటుంది చల్లారితే బలప్రయోగం చేయాల్సొస్తుంది
తినడానికి. ఏమీలేదు సాగుతుంది అంతే.
thanks andi
అబ్బొ అబ్బొ అబ్బో.. ఇక్కడ ఎన్ని ఉన్నాయో..
శనాదివారాలు వీటన్నిటినీ కాకపోయినా కొన్నయినా చేసుకుని తి౦టా..
థా౦క్స౦డి.. :)