రాగి పిండి 1 కప్పు
బియ్యం పిడికెడు
ఉప్పు 1/4 tsp
నీళ్ళు 4 కప్పులు
నెయ్యి 1 tsp
ముందుగా కడిగిన బియ్యం,ఉప్పు,నెయ్యి,నీళ్ళు కలిపి ఉడికించాలి.
అన్నం మెత్తబడ్డాక రాగిపిండి పోసి కలిపి మూత పెట్టి కొద్ది సేపు
ఉడికిన తర్వాత గరిటతో కాని,పప్పు గుత్తితో కాని మెత్తగా ఉండలు
లేకుండా మెదిపి మళ్ళీ గట్టిపడేవరకు నిదానంగా ఉడికించాలి.
కొద్దిగా చలారిన తర్వాత తడిచేత్తో ముద్దలుగా చేసుకుని నెయ్యి
వేసుకొని తినాలి.దీనికి కాంబినేషన్ నాటుకోడి ఇగురు, బచ్చలి
కూర పప్పు లేక సాంబారు.
మా అమ్మమ్మ, అమ్మ ఇప్పుడు మా ఆవిడ ఎలా చేస్తారంటే...
మామూలుగా అన్నం వండాటానికి (సరి ఎసరు) ఎన్ని నీళ్ళు కావాలో అంతకంటె 50 శాతం ఎక్కువ నీళ్ళు పోస్తారు. అంటే ఒక కప్పుకు మూడు కప్పుల నీళ్ళు. బాగా పాత బియ్యమయితే ఇంకాస్త ఎక్కువ నీళ్ళు పట్టవచ్చు. అందులో ఉప్పు వేయడం మీ ఇష్టం, కొందరు అన్నంలో వుప్పు వేసి వండుతారు కొందరు వేయరు. అదే పద్దతి ఇక్కడా పాటించవచ్చు. ఇక నెయ్యి ఇప్పుడు వేయక్కర లేదు. అన్నం మెతుకు బాగా వుడికినప్పుడు రాగి పిండి వుడుకుతున్న అన్నం మీద కుప్పగా పోస్తారు మద్యలో. మంట మద్యస్థంగ పెడతారు. అలా వుడుకుతూ అందులో నీళ్ళు తగ్గి అన్నం బాగా వుడికినప్పుడు (ఇక పిండి అన్నం కలిపితే మరీ గట్టిగా కాకూడదు, మరీ నీళ్ళుగా వుండకూడదు) తెడ్డుకర్ర (ఇది లేకపోతే పొడవాతి గరిటె, లేదా పప్పు గుత్తి)తో బాగా కలపాలి. ఎక్కడా రాగి పిండి వుండలు కనపడకూడదు.
ఇక వాటిని ముద్దలు చేయొచ్చు లేదా అలాగే గరిటతో పెట్టుకొని నెయ్యి వేసుకొని పప్పుతో తినొచ్చు.
(జ్యోతి, కూడలిలో ఈ పోస్టు చూసినప్పుడు పై పదం కింది పదంతో కలిసి పోయి "పిడికెడు ఉప్పు" అని చదివి అదిరి పడ్డాను. :) )
--ప్రసాద్
http://blog.charasala.com