అటుకులు 200gm
ఉల్లిపాయ 1
పచ్చిమిర్చి 2
ఎండుమిర్చి 2
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/4 tsp
మినప్పప్పు 1 tsp
శనగపప్పు 1 tsp
కరివేపాకు 2 రెబ్బలు
కొత్తిమిర 2 tsp
ఉప్పు తగినంత
నూనె 3 tbsp
పచ్చి కొబ్బరి తురుము 3 tsp
దీనికి లావు అటుకులు ఐతేనే బాగుంటుంది. వెడల్పాటి బాణలిలో నూనె వేడి చేసి
ఎండుమిర్చి, పోపు సామాను వేసి కొద్దిగా వేపి పసుపు, తరిగిన ఉల్లిపాయ,
పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొద్దిగా వేపాలి. అటుకులను నీళ్ళలో వేసి తీసి నీళ్ళన్నీ
పిండేసి ఈ పోపులో వేసి తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టి మూతపెట్టాలి.
రెండు నిమిషాల తర్వాత కొత్తిమిర,కొబ్బరి తురుము చల్లి దింపేయాలి.వేడిగానే తినాలి.
మాలిక పత్రిక జులై 2024 సంచిక విడుదల
5 months ago
హ! అలాగా నేను మొన్నోసారి నీళ్ళు పోసి ఉడికించేశా.. మాములు ఉప్మా లాగా.
ఈ సారి మీరు చెప్పినట్టు చేసి చూస్తా.
అక్కాయ్, అదేదో ఓ కథలో నాయకి "చలిమిడి" చేసి తినిపిస్తుంది. నాయకుడు అది చాలా బావుందంటాడు. నేనెప్పుడూ ఇది వినలేదు. అదేంటో చెప్పి ఎలా చేయాలో చెప్పరూ!
--ప్రసాద్
http://blog.charasala.com
Also at the end of the preparation add some lemon juice to enhance the taste.
Also at the end of the preparation add some lemon juice to enhance the taste.