బంగాళదుంపలు 200 gm
క్యారట్ 1
ఉల్లిపాయలు 2
బటాణీలు 50 gm
పసుపు చిటికెడు
మైదాపిండి 250 gm
కారం పొడి 1 tsp
కొత్తిమిర 3 tsp
నిమ్మకాయ 1
ఉప్పు సరిపడ
నూనె వేయించడానికి
పిండిలో కొద్దిగా ఉప్పు 1 చెంచా నూనె వేసి నీరు పోసి చపాతీ పిండిలా కలిపి
మూత పెట్టి ఉంచాలి. బంగాళదుంప,క్యారట్‌ను ముక్కలుగా కోసి బటాణీ
కలిపి ఉడికించాలి. బాణలిలో నూనె వేసి తరిగిన ఉల్లిపాయలు వేసి ఎర్రగా
వేపి దానికి ఉడికించిన కూరగాయలు వేసి కారం, ఉప్పు, పసుపు వేసి
నీరంతా పోయేదాకా వేపి దించేయాలి.కొత్తిమిర చల్లి నిమ్మరసం పిండి
బాగా కలిపి ఉంచాలి.చపాతీ పిండిని నిమ్మకాయ సైజులో తీసుకుని
చపాతీలా చేసి వాటిని సగానికి కట్ చేసి సగభాగాల మధ్యలో కూర
మిశ్రమాన్ని పెట్టి త్రికోణపు ఆకారంలో మడవాలి.అంచులు గట్టిగ వత్తి
కాగిన నూనెలో ఎర్రగా వేయించి వేడి వేడిగా సర్వ్ చేయాలి.
0 వ్యాఖ్యలు