చికెన్ 1 kg
ఉల్లిపాయ 3
అల్లం వెల్లుల్లి 2 tsp
కారం పొడి 2 tsp
పసుపు 1/2 tsp
ధనియాల పొడి 3 tbsp
గరం మసాలా 1 tsp
టొమాటో 200 gm
కొత్తిమీర 2 tsp
ఉప్పు తగినంత
నూనె 3 tbsp
ముందుగా టోమాటోలు,ఉల్లిపాయలు ముక్కలుగ కోసి విడివిడిగా రుబ్బుకోవాలి.
ఇప్పుడు వెడల్పాటి బాణలిలో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముద్దను ఎర్రగా
అయ్యెవరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి వేయించాలి. ఇప్పుడు
టొమాటో ముద్దను వేసి వేయించాలి. కారం, పసుపు, ధనియాలపొడి వేసి కాస్త
వేయించి చికెన్ ముక్కలు తగినంత ఉప్పు వేసి అన్ని బాగా కలిపి మూత పెట్టాలి.
నిదానంగా నూనె తేలేవరకు ఉడికించాలి. కొత్తిమిర చల్లి దింపేయాలి.
ధనియాల పొడి మూడు కేజీలే?
ఇలాగయితే చికెన్ వండెటప్పుడల్లా బ్యాంకు లోనుకు అప్ప్లై చెయ్యాల్సిందే :-)
అచ్చు తప్ప్స్.
-- విహారి
అయ్యబాబోయ్, నిజంగా అచ్చు తప్పే. కొత్తగా వంట నేర్చుకునేవాళ్ళూ నన్ను నమ్మి ఇలాగే వండి తింటే ఉత్త పుణ్యానికి చచ్చేవాళ్ళు కదా! లోన్ సంగతి దేవుడెరుగు.
ధాంక్స్..విహారి( కొత్త విహారా, పాత విహారా???)
nenu chesanu ee vanta!!!
abbooo racha rache!!!
taste addirindi!!!
kani 3 kg dhaniyala podi veyaledu le!!!