Wednesday, May 09, 2007

షాహి మధురసం

రూఅఫ్జా 40 ml
వెనిలా ఐస్‌క్రీం 1 చెంచా
లిమ్కా 1 బాటిల్
ఐస్ ముక్కలు

ముందుగా ఒక పెద్ద గ్లాసును ఫ్రిజ్‌లో ఉంచాలి. పది నిమిషాల తర్వాత గ్లాసును బయటకు తీసి కొన్ని ఐస్‌ముక్కలు వేసి ఉంచుకోవాలి. తరువాత దానిలో రూఅఫ్జా వేయాలి. పైన మరల కొన్ని ఐస్‌ముక్కలు వేసి లిమ్కాను కలపాలి. లిమ్కా అందులో కరుగుతున్నప్పుడు నది ఒడ్డున అలలులాగా నురగతో చూడటానికి అందంగా కనపడుతుంది.పైన ఒక చెంచాడు ఐస్‌క్రీం వేయాలి.

0 వ్యాఖ్యలు: