
మటన్ 250 gm
ఉల్లిపాయ 1
టొమాటో 2
మిరియాలు 1 tbsp
జీలకర్ర 1/2 tsp
అల్లం వెల్లుల్లి 2 tsp
ధనియాల పొడి 2 tbsp
ఎండుమిరపకాయలు 4-5
గరం మసాలా పొడి 1 tsp
ఉప్పు తగినంత
నూనె 4 tbsp
కొత్తిమిర 2 tbsp
ముందుగా ఒక స్పూను నూనెలో టొమాటోలు,ఎండుమిరపకాయలు,మిరియాలు,జీలకర్ర కొద్దిగా వేయించి ముద్దగా రుబ్బి పెట్టుకోవాలి. మిగతా నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా వేయించి అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేపాలి.తర్వాత మాంసం, నూరిన మసాలా ముద్ద, తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టి నీరంతా ఇగిరిపోయేవరకు వేయించాలి. తర్వాత కప్పు నీళ్ళు పోసి కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించి. చల్లారాక కొత్తిమిర చల్లి వడ్డించాలి.
మాలిక పత్రిక జులై 2024 సంచిక విడుదల
1 year ago










ఇంటెర్నెట్ లో తెలుగు వంటకాలు కూడా వ్రాయడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. నేను ఈ మధ్య నే తెలుగు వాడుతున్న ఆది ఈ www.quillpad.in/telugu వలన. ఇలాంటివి ఇంకా పోస్ట్ చెయ్యండి