చికెన్ - 1 kg
మెంతి ఆకులు - 1 cup
ఉల్లిపాయలు - 3
పచ్చిమిర్చి - 5
అల్లంవెల్లుల్లి ముద్ద - 2 tbsp
కారం - 2 tsp
గరం మసాలా - 1 tsp
పసుపు - 1/4 tsp
టొమాటోలు - 1/4 kg
నూనె - 100gm
ఒక మందపాటి బాణలిలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి కాస్త మెత్తబడ్డాక నిలువుగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసి వేయించాలి. తర్వాత తరిగిన మెంతి ఆకులు, కారం వేసి మరి కొద్ది సేపు వేపి చికెన్ ముక్కలు, తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టి మూత పెట్టాలి. నీరంతా ఇగిరిపోయాక సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, గరం మసాలా పొడి వేసి కలిపి సరిపడా నీళ్ళు పోసి నూనె తేలే వరకు ఉడికించాలి.
ఉగాది కథలపోటీలు 2024 ప్రత్యేక సంచిక విడుదల
2 weeks ago
0 వ్యాఖ్యలు