చికెన్ - 1 kg
ఉల్లిపాయలు - 4
అల్లం వెల్లుల్లి - 2 tbsp
పసుపు - 1/4 tsp
మిరియాల పొడి - 1 tbsp
వినెగర్ - 1 tsp
ఉప్పు - తగినంత
నూనె - 100 gm
చికెన్ ముక్కలకు ఉప్పు, మిరియాలపొడి, అల్లం వెల్లుల్లి, పసుపు, వెనిగర్ పట్టించి కనీసం ౨-౩ గంటలు నాననివ్వాలి. ఉల్లిపాయలు ముద్దగా నూరి పెట్టుకోవాలి. మందపాటి బాణలిలో నూనె వేడి చేసి ఉల్లిముద్ద వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. తర్వాత నానబెట్టిన చికెన్ ముక్కలు వేసి బాగా కలిపి మూత బెట్టాలి. అర కప్పు నీళ్ళు పోసి కలిపి నీరంతా ఇగిరి నూనె తేలేవరకు నిదానంగా ఉడికించాలి.
ఉగాది కథలపోటీలు 2024 ప్రత్యేక సంచిక విడుదల
1 week ago
0 వ్యాఖ్యలు