బోన్లెస్ చికెన్ - 1 kg
కోడిగుడ్లు - 2
కార్న్ ఫ్లోర్ - 3 tbsp
మైదా - 3 tsp
ఉప్పు - తగినంత
అల్లం వెల్లుల్లి - 2 tsp
చిల్లీ సాస్ - 1 tsp
సోయా సాస్ - 1/4 tsp
కారం - 1 tsp
మిరియాల పొడి - 1 tsp
ఉల్లికాడలు - 1 cup
కొత్తిమిర - 1/4 cup
కార్న్ ఫ్లోర్ - 1 tbsp
అజినమోటో - చిటికెడు
నూనె - వేయించడానికి
చికెన్ శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా వంపేసి తడి అరనివ్వాలి. అందులో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి, మైదా,కార్న్ ఫ్లోర్, కోడిగుడ్డు, కొత్తిమిర వేసి బాగా కలిపి వేడి నూనెలో పకోడీల్లా ఎర్రగా వేయించాలి. తర్వాత వెడల్పాటి బాణలిలో కాని కళాయిలో కాని కొద్దిగా నూనె వేడి చేసి వేయించిన ముక్కలు వేయాలి. అందులో ఒక స్పూన్ చిల్లీ సాస్, మిరియాలపొడి, అజినొమోటో, సోయా సాస్ వేసి బాగా కలిపి కప్పుడు నీళ్ళలో కలిపిన కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని వేసి ఉండలు కట్టకుండా కలపాలి. చివరగా సన్నగా తరిగిన ఉల్లికాడలు వేసి ౨ నిమిషాలు ఉడికించి దింపేయాలి.
ఉగాది కథలపోటీలు 2024 ప్రత్యేక సంచిక విడుదల
3 weeks ago
0 వ్యాఖ్యలు