మాంసం - 250 gm
గోధుమలు - 1 cup
సెనగపప్పు - 1/2 cup
పెసరపప్పు - 1/2 cup
కారం పొడి - 1 tbsp
పసుపు - 1/2 tsp
ఉల్లిపాయలు - 2
ధనియాలపొడి - 1 tbsp
గరమ్ మసాలా - 1 tsp
అల్లం వెల్లుల్లి - 2 tsp
నెయ్యి - 5 tbsp
కొత్తిమిర - 3 tsp
ఉప్పు - తగినంత
గోధుమలు నాలుగు గంటలు నీటిలో నానబెట్టి,వడకట్టి రవ్వలాగా గ్రైండ్ చేయాలి లేదా రోట్లో దంచుకోవాలి. మిగిలిన పప్పులు కూడా నీటిలో నానబెట్టాలి. ఒక వెడల్పాటి మందపాటి అడుగుగల బాణలి తీసుకుని అందులో సుమారు పది కప్పుల నీటిని మరిగించాలి. ఇప్పుడు నానబెట్టి వడకట్టిన పప్పులన్నీ, గోధుమ రవ్వ, మాంసం ముక్కలు వేయాలి. అవి ఉడుకుతుండగా అల్లం వెల్లుల్లి ముద్ద, ధనియాలపొడి, పసుపు, కారం పొడి, గరం మసాలా పొడి, తగినంత ఉపు వేయాలి. చిన్న మంటపై నిదానంగా మాంసం పూర్తిగా మెత్తబడేవరకు ఉడికించాలి. తర్వాత ఒక గరిటతోగాని, పప్పుగుత్తితో కాని దానిని మెత్తగా మెదపాలి. మొత్తం మిశ్రమమంతా కలిసి ఒకేలా అయ్యేలా.ఇప్పుడు దీనికి వేయించిన ఉల్లిపాయలు, నెయ్యి, కొత్తిమిరతో కలిపి వడ్డించాలి.
మాలిక పత్రిక జులై 2024 సంచిక విడుదల
5 months ago
0 వ్యాఖ్యలు