బాస్మతి బియ్యం 500gm
కొబ్బరికాయ 1
ఎండుమిర్చి 4
జ్పచ్చిమిర్చి 4
మినప్పప్పు 2 tsp
సెనగపప్పు 2 tsp
ఆవాలు 1/2 tsp
జీలకర్ర 1/2 tsp
కరివేపాకు 2 రెమ్మలు
నూనె 1/2 కప్పు
జీడిపప్పు 10
కిస్మిస్ 6
ఉప్పు తగినంత  
ముందుగా బియ్యం కడిగి పొడిపొడిగా వండాలి. కొబ్బరి తురిమి ఉంచుకోవాలి. ఓ వెడల్పాటి పళ్ళెంలో అన్నం పోసి, సగం నూనె పోసి కలపాలి. స్టవ్ మీద కళాయి పెట్టి మిగతా నూనె వేడి చేసి ఎండుమిర్చి,ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి,పప్పులు, కరివేపాకు వేసి కాస్త వేగాక  అన్నంలో వేసి బాగా కలియబెట్టాలి. కొంచెం  నెయ్యిలో జీడిపప్పు, కిస్మిస్ కూడా వేయించి అన్నంలో కలపాలి. చివరగా తగినంత ఉప్పు, కొబ్బరి తురుము కూడా వేసి బాగా కలిపి ఓ గంట తర్వాత వడ్డించండి.
మాలిక పత్రిక జులై 2024 సంచిక విడుదల
1 year ago
 
 










 

yeppudo maa amma chesaaru
tharuvaatha ikkade chusthunna