Thursday, August 23, 2007

శనగపప్పు పరమాన్నం






బియ్యం 1 cup
శనగపప్పు 1/2 cup
పచ్చి కొబ్బరి 1/2 cup
యాలకుల పొడి 2 tsp
పాలు 1 కప్
బెల్లం 1 కప్
నెయ్యీ 5 tbsp

ముందుగా బియ్యం, శనగపప్పు కడిగి తగినన్ని నీళ్ళు పోసి కొద్దిగా నెయ్యి వేసి
కుక్కర్లో ఉడికించాలి. తర్వాత దీనిలో బెల్లం వేసి మంట తగ్గించి నిదానంగా
ఉడికించాలి. నెయ్యి వేడి చేసి పచ్చికొబ్బరిని తురుము దోరగా వేయించి అందులో
కలిపి, యాలకుల పొడి వేసి పాలు కూడా వేసి బాగా కలుపుతూ అడుగు
మాడకుండా నెమ్మదిగా దగ్గరపడేవరకు ఉడికించాలి. తర్వాత దింపేయాలి.
కావాలంటే నెయ్యిలో వేపిన జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇది చాలా
రుచిగా ఉంటుంది.

Wednesday, August 22, 2007

పులిహోర



బియ్యం 250 gm
చింతపండు పులుసు 1/4 cup
ఎండుమిరపకాయలు5
జీలకర్ర 1 1/2 tsp
ధనియాలు 1 tbsp
ఆవాలు 1/4 tsp
ఇంగువ చిటికెడు
పసుపు 1/4 tsp
ఉప్పు తగినంత
వేరుశనగగుళ్ళు 3 tbsp
కరివేపాకు 2 tsp
నూనె 5 tbsp

ముందుగా ఎండుమిరపకాయలు,ధనియాలు,1 tsp జీలకర్ర కొద్దిగా వేపి
పొడి చేసిపెట్టుకోవాలి. అన్నం కాస్త బిరుసుగా వండి వెడల్పాటి పళ్ళెంలో
వేసి చల్లారనివ్వాలి. ఒక గిన్నెలో నూనె వేడి చేసి ఇంగువ వేసి, ఆవాలు,
జీలకర్ర, వేరుశనగగుళ్ళు, కరివేపాకు వేసి చిటపటలాడాక చింతపండు
పులుసు, పసుపు,తగినంత ఉప్పు వేసి చిక్కబడి నూనె తేలేవరకు
మరిగించాలి.ఇప్పుడు మసాలా పొడి వేసి బాగా కలిపి దింపి అన్నంలో వేసి
బాగా కలియబెట్టాలి.పావు గంట అలా ఉంచి తినడమే ...మామూలుగా
చేసుకునే పులిహారలా కాకుండా కాస్త వెరైటీగా ఉంటుంది. ఘాటుగా.

Friday, August 10, 2007

మాంసం పప్పు




మాంసం 250 gm
కందిపప్పు 20 gm
చింతపండు పులుసు 1/4 కప్పు
ఉల్లిపాయ 1
కరివేపాకు 2 tsp
అల్లం వెల్లుల్లి 1 tbsp
గరం మసాలా 1 tsp
పసుపు 1/4 tsp
కారం పొడి 2 tbsp
ఉప్పు తగినంత
కొత్తిమిర 3 tsp
నూనె 5 tbsp

ముందుగా కందిపప్పును కడిగి నీళ్ళు పోసి కొద్దిగా పసుపు, నూనె వేసి కుక్కర్లో మెత్తగా ఉడికించాలి. వెడల్పాటి గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలను బంగారు రంగు వచ్చేవరకు వేయించి కరివేపాకు, అల్లం వెల్లుల్లి,పసుపు,కారం వేసి కొద్దిగా వేపి మాంసం, తగినంత ఉప్పు వేసి అన్ని బాగా కలియబెట్టి మూత పెట్టాలి. నీరంత ఇగిరిపోయాక కప్పుడు నీళ్ళు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. మాంసం ముక్కలు ఉడికాక చింతపండు పులుసు వేసి మరి కొద్ది సేపు ఉంచి, ఉడికించిన కందిపప్పును, దానికి తగిన ఉప్పు వేసి కలిపి మరో ఐదు నిమిషాలు ఉడికించి కొత్తిమిర, గరం మసాలా వేసి కలిపి దింపేయాలి.



శాకాహారులు మాంసం బదులు సోయా చంక్స్ వాడొచ్చు. దాని తయారి విధానం సరిగా పాటించి చేస్తే రుచి బావుంటుంది.

Saturday, August 04, 2007

మటన్ గ్రేవీ



మటన్ 250 gm
ఉల్లిపాయ 1
టొమాటో 2
మిరియాలు 1 tbsp
జీలకర్ర 1/2 tsp
అల్లం వెల్లుల్లి 2 tsp
ధనియాల పొడి 2 tbsp
ఎండుమిరపకాయలు 4-5
గరం మసాలా పొడి 1 tsp
ఉప్పు తగినంత
నూనె 4 tbsp
కొత్తిమిర 2 tbsp

ముందుగా ఒక స్పూను నూనెలో టొమాటోలు,ఎండుమిరపకాయలు,మిరియాలు,జీలకర్ర కొద్దిగా వేయించి ముద్దగా రుబ్బి పెట్టుకోవాలి. మిగతా నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా వేయించి అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేపాలి.తర్వాత మాంసం, నూరిన మసాలా ముద్ద, తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టి నీరంతా ఇగిరిపోయేవరకు వేయించాలి. తర్వాత కప్పు నీళ్ళు పోసి కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించి. చల్లారాక కొత్తిమిర చల్లి వడ్డించాలి.

మటన్ మిరియాల వేపుడు



మటన్ 1/2 kg
కారంపొడి 2 tbsp
గరం మసాలా పొడి 1 tsp
పసుపు 1/4 tsp
పచ్చిమిరపకాయలు 6
అల్లం వెల్లుల్లి ముద్ద 2 tbsp
మిరియాలు 1 tbsp
ధనియాలపొడి 1 tbsp
కరివేపాకు 2 రెబ్బలు
కొత్తిమిర 1 కట్ట
ఉప్పు తగినంత
ఉల్లిపాయ 2
నూనె 5 tbsp

మాంసం కడిగి అరకప్పు నీరు పోసి కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించి దింపి చల్లారనివ్వండి. వెడల్పాటి గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు,మిరియాలు ఎర్రగా వేపాలి.తర్వాత అల్లం వెల్లులి వేసి కొద్దిగా వేపి ఉడికిన మాంసం,కరివేపాకు, కారంపొడి,గరం మసాలా,ధనియాలపొడి,పసుపు,ఉప్పు వేసి బాగా కలియబెట్టి నిదానంగా వేగనివ్వండి. నూనె తేలాక కొత్తిమిర చల్లి దింపేయండి.