Featured Posts
మరో మజిలీకి ఆహ్వానం..
ఈ బ్లాగులో ఇక అప్ డేట్లు ఉండవు. షడ్రుచులు మరింత విశాల ప్రాంగణం లోకి మారింది. మరి అక్కడికి వచ్చేయండి..
షడ్రుచులు
దోసకాయ పప్పు
కావలసిన వస్తువులు:
కందిపప్పు - 200 gms
చింతపండు పులుసు - పావు కప్పు
టొమాటోలు - 2
దోసకాయ - 1
మెంతికూర - 1 కట్ట
ఉల్లిపాయ - 1 చిన్నది
పచ్చిమిరపకాయలు - ౩
కరివేపాకు - 1 రెబ్బ
కొత్తిమిర - 1 కట్ట
కారం పొడి - 1 tsp
పసుపు - చిటికెడు
వెల్లుల్లి - 5 పాయలు
ఉప్పు - తగినంత
నూనె - 2 tsp
తాలింపు గింజలు
ముందుగా కందిపప్పు కడిగి కుక్కర్లో వేసి తగినన్ని నీళ్లు పోసి కొద్దిగా పసుపు, పావు చెంచాడు నూనె వేసి మూట పెట్టి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. తర్వాత అందులో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమిర, మెంతికూర, టమాటో ముక్కలు, దోసకాయ ముక్కలు (చేదు చూసుకోవాలి), చింతపండు పులుసు, పసుపు,కారం, ఉప్పు వేసి కలిపి మరో మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. నూనె వేడి చేసి తాలింపు గింజలు, నలగగొట్టిన వెల్లుల్లి రెబ్బలు వేసి పోపు పెట్టి ఈ పప్పులో కలపాలి. కొద్దిగా నెయ్యి వేసి మూతపెడితే ఘుమ ఘుమలాడిపోతుంది పప్పు. ఆవకాయ లేదా అప్పడాలు నంజుకుని తినండి.
క్యాబేజీ వడ
మినప్పప్పు 250 gms
క్యాబేజీ 100 gms
జీలకర్ర 1 tsp
కరివేపాకు 2 tsp
అల్లం 1 " ముక్క
కొత్తిమిర 1/4 కప్పు
ఉప్పు తగినంత
నూనె వేయించడానికి
మినప్పప్పును నాలుగైదు గంటలు నానబెట్టి నీరంతా ఒడ్చేయాలి. ఇందులో అల్లం, పచ్చిమిర్చి ముక్కలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన క్యాబేజీ (పచ్చిగా లేదా వేడినీళ్ళలో వేసి తీసినా సరే ) , కరివేపాకు, కొత్తిమిర, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. నూనె వేడి చేసి ఈ మిశ్రమాని వడలుగా వత్తుకుని ఎర్రగా అయ్యేవరకు నిదానంగా కాల్చాలి. టమాటో లేదా కొబ్బరి చట్నీతో సర్వ్ చేయండి.
మసాలా వడ
సెనగపప్పు 200 gms
ఉల్లిపాయ 1
పచ్చిమిర్చి 4
అల్లం 1 "ముక్క
కరివేపాకు 2 రెబ్బలు
తోటకూర 1కప్పు
ఉప్పు తగినంత
జీలకర్ర 1 tsp
నూనె వేయించడానికి.
సెనగపప్పు శుభ్రం చేసుకుని నాలుగైదు గంటలు నానబెట్టాలి. తర్వాత నీరంతా పోయేలా వడగట్టాలి. తడి ఉండకూడదు. పప్పులో కొంచం తీసి పక్కన పెట్టుకొని సగం పప్పును మెత్తగా రుబ్బుకోవాలి. మిగతా పప్పు చేర్చి బరకగా రుబ్బుకోవాలి. ఇదంతా ఒక వెడల్పాటి గిన్నెలో తీసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆకుకూర, ఉప్పు, జీలకర్ర, సెనగపప్పు వేసి బాగా కలియబెట్టాలి. ఇప్పుడు నూనె వేడి చేసి మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసుకుని కాస్త మందంగా వెడల్పుగా వత్తుకుని నిదానంగా ఎర్రగా అయ్యేవరకు వేయించాలి. పుదీనా లేదా కొబ్బరి చట్నీతో సర్వ్ చేయండి.
వడ
మినప్పప్పు 200 gms
పచ్చిమిర్చి 6
అల్లం 1 " ముక్క
కరివేపాకు 1 రెబ్బ
ఉప్పు తగినంత
నూనె - వేయించడానికి
ముందుగా మినప్పప్పును శుభ్రం చేసి నాలుగు గంటల పాటు నీళ్ళలో నానబెట్టాలి. తర్వాత వడగట్టి పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి మెత్తగా కాటుకలా గ్రైండ్ చేసుకోవాలి. ఉన్నా తడి సరిపోతుంది. నీళ్లు పోస్తే పిండి పలుచబడుతుంది. చివర్లో తగినంత ఉప్పు, సనంగా తరిగిన కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేడి చేసి పిండిని చిన్న ముద్దలుగా తీసుకుని తడి చేత్తో ప్లాస్టిక్ కాగితంపైన లేదా అరిటాకుపైన వేదలుపుగా వత్తుకుని మధ్యలో వేలితోనే చిల్లు పెట్టి నూనె లో వేసి బంగారు రంగు వచ్చేవరకు నిదానంగా వేయించి తీసేయాలి. వీటిని కొబ్బరి చట్నీ, సాంబార్ తో వడ్డించండి.
ఉల్లిపాయ పకోడీలు
ఉల్లిపాయలు - ౩
కరివేపాకు - 1 కట్ట
కొత్తిమిర - 1 కట్ట
సెనగపిండి - 300 gms
జీలకర్ర - 1 tsp
ధనియాలు - 1 tsp
పసుపు - చిటికెడు
కారం పొడి - 1 tsp
గరం మసాలా - 1 tsp
ఉప్పు - తగినంత
ఉల్లిపాయలు తొక్క తీసి, సన్నగా తరిగి అందులో తరిగిన కొత్తిమిర, కరివేపాకు, పసుపు, కారం పొడి, ధనియాలు, జీలకర్ర, గరంమసాలా వేసి బాగా కలిపి సెనగపిండి, తగినంత ఉప్పు వేసి మొత్తం బాగా కలియబెట్టాలి. ఇందులో నీరు అస్సలు వేయరాదు. నూనె వేడి చేసి ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని నూనె లో పొడి పొడిగా వేయాలి. బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీయాలి. ఆవకాయతో నంజుకుంటే సరి..
కొబ్బరి పాయసం
పాలు - 1 lit
పచ్చికొబ్బరి - 2 కప్పులు
కోవా - 200 gms
చక్కర - 200 gms
కుంకుమ పువ్వు - చిటికెడు
యాలకుల పొడి - 1 tsp
జీడిపప్పు, బాదాం పప్పు, పిస్తా - 1/4 కప్పు
కొబ్బరి తురిమి ఉంచుకోవాలి. మందపాటి గిన్నెలో పాలు, కొబ్బరి కలిపి చిక్కగా అయ్యేవరకు ఉడికించాలి. తర్వాత చక్కర, కోవా వేసి ఉడికించాలి. చివర్లో యాలకుల పొడి వేసి కలిపి దింపేయాలి. సన్నగా తరిగిన జీడిపప్పు, బాదాం పప్పు, పిస్తా , కుంకుమ పువ్వు వేసి అలంకరించాలి. వేడిగా అయినా, చల్లగా అయినా సర్వ్ చేయొచ్చు.
బంగాలదుంప కట్లెట్
బంగాలదుంపలు - 1/2 kg
బ్రెడ్ స్లైసెస్ - 4
జీలకర్ర - 1/2 tsp
పసుపు - చిటికెడు
కారం - 1 tsp
గరం మసాలా - 1 tsp
సన్నగా తరిగిన కొత్తిమిర - 3 tbsp
ఉప్పు - తగినంత
వేయించడానికి నూనె
బంగాలదుంపలు మెత్తగా ఉడికించి, పొట్టు తీసి ఒక వెడల్పాటి గిన్నెలో వేయాలి. అది చల్లారాక మెత్తగా పొడిలా చేసుకోవాలి. అందులో పసుపు, ఉప్పు, కారం, కొత్తిమిర, గరంమసాలా, జీలకర్ర, నీళ్ళలో నానబెట్టి తీసిన బ్రెడ్ ముక్కలు వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వెడల్పుగా వత్తుకుని నాన్ స్టిక్ పై నిదానంగా , కొద్దిపాటి నూనె వేస్తూ రెండువైపులా ఎర్రగా అయ్యేలా వేయించాలి. ఇది వేడిగా సాస్ తో వడ్డించండి..
బిస్కట్లు
మైదా - 1 కప్పు
బొంబాయి రవ్వ - 1/2 కప్పు
చక్కర - 1/2 కప్పు
నెయ్యి - 2-3 tsp
ముందుగా రవ్వ, మైదా, నెయ్యి వేసి బాగా కలపాలి. తగుమాత్రం నీళ్ళలో చక్కెరను కరిగించి ఆ నీళ్ళతో ఈ మిస్రమాని చపాతీ పిండిలా కలుపుకోవాలి. కనీసం రెండు గంటలు నానినతర్వాట బాగా మర్దన చేసి , చపాతీలా వత్తుకుని, చిన్న మూతతో బిళ్లలుగా కోసి నేతిలో లేదా నూనెలో గోదుమవర్ణం వచ్చేవరకు నిదానంగా వేయించుకోవాలి. ఇవి రుచిగా, కరకరలాడుతూ ఉంటాయి. తీపి వద్దు అనుకుంటే ఉప్పు, కారం వేసి కూడా చేసుకోవచ్చు.
గుమ్మడికాయ హల్వా
తురిమిన గుమ్మడికాయ - 500 gms
చక్కర - 200 gms
నెయ్యి - 50 gms
కోవా - 50 gms
యాలకుల పొడి - 1 tsp
ఎండుద్రాక్ష, జీడిపప్పు, పిస్తా - 1/4 కప్పు
పిస్తా రంగు.. చిటికెడు
ముందుగా గుమ్మడికాయ కడిగి చెక్కు తీసి, సన్నగా తురిమి పెట్టుకోవాలి. మందపాటి బాణలిలో నెయ్యి వేసి ఈ తురుము తడి ఆరిపోయేదాకా వేయించాలి. ఇపుడు చక్కర వేసి మళ్ళీ ఉడికించాలి. కాస్త చిక్కబడ్డాక కోవా, పిస్తా రంగు, యాలకుల పొడి వేసి బాగా కలిపి నెయ్యి బయటకు వచ్చేదాకా వేయించాలి. ఇపుడు సన్నగా తరిగిన ఎండుద్రాక్ష, జీడిపప్పు, పిస్తా వేసి దింపేయాలి.