
మెత్తటి ఖైమా 250 gm
ఉల్లిపాయలు 2
పచ్చిమిర్చి 3
కొబ్బరిపొడి 50 gm
కారంపొడి 2 tsp
పసుపు 1/4 tsp
ధనియాల పొడి 2 tsp
గరం మసల పొడి 1 tsp
అల్లం వెల్లుల్లి 2 tsp
కరివేపాకు 1 tsp
కొత్తిమిర 2 tsp
నూనె 4 tbsp
ఉప్పు తగినంత
ముందుగా ఖైమాలో తగినంత ఉప్పు, సగం కారం, పసుపు, ధనియాల
పొడి ,గరం మసాలా, అల్లం వెల్లుల్లి, సగం కొబ్బరి పొడి వేసి బాగా కలిపి
వీలైతే రోట్లో కొద్దిగా దంచి తడి చేత్తో చిన్న చిన్న ఉండలుగా చేసుకుని
పెట్టుకోవాలి.బాణలిలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు
వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.ఇప్పుడు నిలువుగ తరిగిన
పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, కారంపొడి, అల్లం వెల్లుల్లి వేసి బాగా
వేపి ఈ ఖైమా ఉండలను అందులో వేసి తగినంత ఉప్పు వేసి కలిపి
మూత పెట్టాలి.నీరంతా ఇగిరిపోయాక కొబ్బరి పొడి, గ్లాసుడు నీళ్ళు
పోసి మూత పెట్టి ఉడకనివ్వాలి.నూనె తేలాక కొత్తిమిర గరం మసాలా
చల్లి దించేయాలి.